»   » సల్మాన్ చంపుతానని బెదిరించాడు.. 41 సార్లు ఫోన్.. ఆ రాత్రి ఏం జరిగిందంటే.. ఐశ్వర్యరాయ్..

సల్మాన్ చంపుతానని బెదిరించాడు.. 41 సార్లు ఫోన్.. ఆ రాత్రి ఏం జరిగిందంటే.. ఐశ్వర్యరాయ్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్‌పై నటుడు వివేక్ ఒబేరాయ్ మరోసారి తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. 2003లో సల్మాన్‌తో జరిగిన గొడవ వివాదంపై తాజాగా మళ్లీ నోరు విప్పాడు. అప్పట్లో నేను మీడియా సమావేశాన్ని నిర్వహించడంతో నన్ను చాలా ఇబ్బందులకు గురిచేశాడు. అప్పుడు ఏమి జరిగిందో చెప్పకపోతే నన్ను ఇంకా అనుమానంగానే చూస్తారు అని వివేక్ అన్నారు. బ్యాంక్ చోర్ అనే సినిమా ప్రమోషన్‌లో భాగంగా దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్‌తో మాట్లాడుతూ ఆ గొడవకు కారణమైన విషయాలను వివేక్ వివరించాడు.

ఆ రాత్రి 41 సార్లు సల్మాన్ ఫోన్..

ఆ రాత్రి 41 సార్లు సల్మాన్ ఫోన్..

2003లో నిర్వహించిన మీడియా సమావేశానికి ముందు రాత్రి నాకు సల్మాన్ ఖాన్ 41 సార్లు ఫోన్ చేశాడు. చంపుతానని బెదిరించాడు. దాంతో నేను సల్మాన్ తీరును వివరించడానికి మీడియాతో మాట్లాడాను. దాంతో బాలీవుడ్‌లో నా కెరీర్‌ నాశనం అయ్యింది. దాని వల్ల నేను భారీగా ప్రతిఫలాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది అని వివేక్ ఆవేదన వ్యక్తం చేశాడు.

అంతకుముందే సల్మాన్‌తో డేటింగ్..

అంతకుముందే సల్మాన్‌తో డేటింగ్..

ఆ సమయంలో అందాల తార ఐశ్వర్యరాయ్‌తో అఫైర్ కొనసాగుతున్నది. అంతకుముందు సల్మాన్‌తో ఐశ్వర్య డేటింగ్ చేసింది. ఆ విషయం అందరికి తెలిసిందే. నాతో ఐశ్వర్య అఫైర్ కొనసాగించడాన్ని సల్మాన్ జీర్ణించుకోలేకపోయాడు. అందుకే నన్ను చంపుతానని బెదిరించాడు అని వివేక్ చెప్పాడు. అప్పట్లో ఈ వివాదం జాతీయ స్థాయి పత్రికలను ఆకర్షించింది. బాలీవుడ్‌లో వీరి గొడవ సంచలనం రేపింది.

వివేక్ ఆరోపణలు అవాస్తవం

వివేక్ ఆరోపణలు అవాస్తవం

2003లో నిర్వహించిన మీడియా సమావేశంలో తనపై వివేక్ ఒబెరాయ్ చేసిన వ్యాఖ్యలను సల్మాన్ ఖండించాడు. వివేక్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశాడు. ఆ తర్వాత తనపై ఆరోపణలు చేసిన వివేక్‌పై వ్యక్తిగతంగా కక్ష పెంచుకొన్నారనే రూమర్లు మీడియాలో ప్రచారమయ్యాయి. అందువల్లే వివేక్‌కు అవకాశాలు రాలేదనే కథనాలు వచ్చాయి.

ఐశ్వర్యరాయ్ తెలివిగా..

ఐశ్వర్యరాయ్ తెలివిగా..

సల్మాన్, వివేక్ ఒబెరాయ్ మధ్య జరిగిన వివాదం నుంచి ఐశ్వర్యరాయ్ తెలివిగా తప్పుకొన్నదట. వారి మధ్య వివాదానికి తానే కారణం కావడంతో దానిని తన వరకు రాకుండా చూసుకోవడంలో ఐశ్వర్యరాయ్ జాగ్రత్త పడ్డారనే బాలీవుడ్ కోడైకూసింది. అంతేకాకుండా సల్మాన్‌తో దూకుడుగా వ్యవహరించడం కారణాన్ని చూపి వివేక్‌తో అఫైర్‌ను ఐశ్వర్య తెగతెంపులు చేసుకొంది.

ఐశ్వర్య తీరు బాధపెట్టింది..

ఐశ్వర్య తీరు బాధపెట్టింది..

ఈ వివాదంలో ఐశ్వర్యరాయ్ తీరు, ప్రవర్తన తనకు ఆవేదన కలిగింది. ఆమె వ్యవహరించిన విధానాన్ని ఎప్పటికీ సమర్థనీయం కాదు. ఆ రోజు మీడియా సమావేశాన్ని నిర్వహించాలని ప్రోత్సహించింది కూడా ఐశ్వర్యరాయ్ అని ఫరాఖాన్ షోలో వివేక్ చెప్పుకొచ్చారు.

చేయని తప్పుకు క్షమాపణ చెప్పా..

చేయని తప్పుకు క్షమాపణ చెప్పా..

మీడియా సమావేశం నిర్వహించడం ద్వారా చేయని తప్పుకు సల్మాన్‌ఖాన్‌కు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అసలు మీడియా సమావేశాన్ని నిర్వహించకుండా ఉండాల్సింది. ఆ ఘటన నా జీవితంపై చాలా ప్రభావం చూపింది. ఒక రాత్రిలోనే నా జీవితం తారుమారైంది. ఆ వివాదం కారణంగా తనకు దక్కాల్సిన అవార్డు మరో హీరోకు దక్కింది అని ఆనాటి విషయాలను వివేక్ పంచుకొన్నారు.

అయినా నాపై ద్వేషం తగ్గలేదు..

అయినా నాపై ద్వేషం తగ్గలేదు..

ఈ వివాదానికి సంబంధించి పలుమార్లు సల్మాన్ ఖాన్‌కు సారీ చెప్పాను. అయినా నాపై ఆయనకు ద్వేషం తగ్గలేదు. కక్ష పెంచుకొన్నారు. ఇప్పటికీ నాకు దూరంగా ఉన్నాడు. అసలు సల్మాన్ ఖాన్ వ్యక్తిత్వం అంటే నాకు నచ్చదు అని వివేక్ చెప్పడం గమనార్హం. ఇలాంటి విషయాలను ప్రస్తావించడం వల్ల చాలా మంది జీవితాలు ఇబ్బందుల్లో పడుతాయి అని ఆయన అన్నారు.

English summary
Vivek Oberoi had an infamous fight with Salman Khan in 2003 that almost destroyed his career. At a recent press conference for his upcoming release Bank Chor, Vivek Oberoi took a dig at his infamous fight with Salman Khan. Vivek apologised to Salman repeatedly, but he would have none of it. He admitted on Farah's show that he shouldn't have held a press conference. He said that his career took a huge hit and he became an outcast in the industry overnight. In fact, the actor revealed that an award that was meant for him was given to another actor after this controversy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu