Don't Miss!
- Sports
INDvsNZ : ఉమ్రాన్ మాలిక్‌ను తీసేయండి.. రెండో టీ20కి మాజీ లెజెండ్ సలహా!
- News
జోగినిపల్లి సంతోష్ సహకారంతో కిలిమంజారోను అధిరోహించిన బానోతు వెన్నెల
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Lifestyle
Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం దురదృష్టాన్ని ఇలా అదృష్టంగా మార్చేసుకోవచ్చు
- Finance
Jio, Airtel: జియో, ఎయిర్‌టెల్‌కు పెరిగిన డిమాండ్.. !
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
Naresh Pavitra Lokesh ఊహించని ట్విస్ట్! పవిత్ర లోకేష్‌కు నరేష్ లిప్ కిస్.. గుడ్ న్యూస్ చెప్పిన జంట!
ఇటీవల కాలంలో తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు సీనియర్ నటుడు, హీరో వీకే నరేష్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్. వీళ్లిద్దరూ సహాజీవనం చేస్తున్నారన్న పుకార్లు ఇంతకాలం బీభత్సంగా షికార్లు చేశాయి. అయితే వాళ్లిద్దరూ మంచి స్నేహితులు అని చెబుతూ ఓ వీడియో ద్వారా చెప్పుకొచ్చారు. వాళ్ల మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చారు. కానీ, ఇప్పుడు ఎవ్వరూ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది నరేష్-పవిత్ర లోకేష్ జంట. పవిత్రకు నరేష్ ప్రేమగా కిస్ చేసి మరి ఓ గుడ్ న్యూస్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంతకి అదేంటనే విషయంలోకి వెళితే..

సినీ హీరోల కంటే పాపులర్ గా..
సినీ రంగం అంటేనే గ్లామర్ ప్రపంచం. ఈ రంగంలో ఏ రిలేషన్ ఎప్పుడు.. ఎలా మారుతుందో చెప్పలేం. అలాగే సినీ సెలబ్రిటీల్లో రెండు, మూడు పెళ్లిల్లు, అఫైర్లు సాధారణంగా జరిగే వ్యవహారాలే. అందులో కొన్ని హైలెట్ అయితే మరికొన్ని ఇంకొకరికి తెలియకుండానే కనుమరిగిపోతాయి. అయితే ఇటీవల సినీ హీరోల కంటే మోస్ట్ పాపులర్ గా మారింది సీనియర్ నటుడు నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్ రిలేషన్ షిప్.

హైలెట్ గా మారిన వివాదం..
నరేష్, పవిత్రా లోకేష్ వీరిద్దరూ లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోనున్నారని, అందుకోసం పలు ఆలయాలు కూడా చుట్టి వస్తున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలు వస్తున్న సమయంలోనే వాళ్లిద్దరని మైసూర్ లోని ఓ హోటల్ గదిలో పట్టుకుని నరేష్ భార్య మూడో భార్య రమ్య మీడియాలో హల్ చల్ చేయడంతో ఈ వివాదం హైలెట్ గా మారింది. అలాగే నరేష్, పవిత్రా లోకేష్ సోషల్ మీడియా వేదికగా తాము మంచి ఫ్రెండ్స్ అంటూ క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం కూడా చేశారు.

సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు..
ఈ విషయం తర్వాత వీళ్లిద్దరు వ్యవహారం సద్దుమణిగింది. అయితే తర్వాత సూపర్ స్టార్ మరణం తర్వాత ఆయన అంత్యక్రియలు ఏర్పాట్లు, ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న సమయంలో నరేష్, పవిత్రా లోకేష్ జంటగా కనిపించారు. దీంతో పలు వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెల్స్ లలో వివిధ రకాలుగా కథనాలు వెలువడ్డాయి. ఈ విషయమై పవిత్రా లోకేష్ హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

న్యూ ఇయర్ సందర్భంగా..
పలు వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానెళ్లు అభ్యంతరకర వీడియోలు, ట్రోల్స్ చేస్తూ తమపై దుష్ప్రచారం చేస్తున్నారని, వాటి వెనుక నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఉన్నారని పవిత్ర లోకేష్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయమై పోలీసులు కేసు విచారణ చేసి 15 యూట్యూబ్ ఛానెల్స్, వెబ్ సైట్స్ కు నోటీసులు కూడా పంపించారు. అయితే ఇప్పుడు 2023 న్యూ ఇయర్ సందర్భంగా ఈ జంట షాక్ ఇచ్చింది.

రొమాంటిక్ గా వీడియో..
న్యూ ఇయర్.. న్యూ బిగినింగ్స్.. మీ అందరి ఆశీర్వాదం కావాలంటూ ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు నటుడు నరేష్. ఈ వీడియోలో నరేష్, పవిత్ర లోకేష్ ఇద్దరు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అంతేకాకుండా ఇద్దరు లిప్ కిస్ పెట్టుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ లో క్లాకర్ వెలుగులతో మంచి రొమాంటిక్ గా వీడియోను చిత్రీకరించారు. ఇక ఈ వీడియో చివర్లో హ్యాపీ న్యూయర్ 2023 అని చెబుతూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ గుడ్ న్యూస్ తెలిపింది ఈ జంట.
|
రకరకాలుగా నెటిజన్స్ కామెంట్స్..
ఇలా ఎట్టకేలకు నరేష్-పవిత్ర జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మూడో భార్య అయిన రమ్య రఘుపతికి ఇంకా విడాకులు ఇవ్వలేదని తెలుస్తోంది. ఇక 2007లో సుచేంద్ర అనే వ్యక్తితో పవిత్రా లోకేష్ కి వివాహం జరిగింది. వీరిద్దరూ కూడా విడాకులు తీసుకోలేదని టాక్ నడుస్తోంది.