»   » దర్శకుడు వియన్.ఆదిత్యకు ట్విస్ట్

దర్శకుడు వియన్.ఆదిత్యకు ట్విస్ట్

Subscribe to Filmibeat Telugu

మనసంతా నువ్వే తో దర్శకుడు మారిన దర్శకుడు వియన్.ఆదిత్య లేటెస్ట్ గా తరుణ్ హీరోగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆదిత్యను తీసేసి కన్మణిని దర్శకుడుగా ఎంపికచేసినట్లు సమాచారం.కన్మణి ఇంతుకు ముందు 'నా వూపిరి', 'చిన్నోడు',కాల్ సెంటర్ చిత్రాలను రూపొందించారు. అయితే ఆదిత్యను తీసేసి కన్మణి ని ఎందుకు పెట్టుకున్నారన్నది తెలిసి రాలేదు. అయితే కొంత కాలంగా వియన్.ఆదిత్యకీ నిర్మాతకీ మధ్య కొన్ని పొరపొచ్చాలు వచ్చినట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో తరుణ్ సరసన విమలారామన్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమాలో ఈమె బికినీలో దర్శనమీయబోతోంది. అలాగే తరుణ్‌ ఓ పాట పాడారు. సుప్రీమ్‌ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. నిర్మాతలు రాజు హర్వాణీ, గోగినేని శ్రీనివాస్‌ మాట్లాడుతూ ''14 నుంచి తదుపరి షెడ్యూల్‌ ఉంటుంది. బ్యాంకాక్‌లో ఇటీవల ముఖ్య సన్నివేశాల్ని, పాటల్ని తెరకెక్కించాం. వినోదాత్మకమైన ప్రేమ కథ ఇది. నేటి యువతను ఆకట్టుకొనేలా ఉంటుంది. సాఫ్ట్‌వేర్‌ రంగంలోని యువతీయువకుల మనోభావాలకు, జీవనశైలికి అద్దం పడుతుంద''న్నారు. సమర్పణ: ప్రణవ్‌ స్టూడియోస్‌, మాటలు: గంగోత్రి విశ్వనాథ్‌, పాటలు: రెహ్మాన్‌, చిన్నిచరణ్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: వాసు, కూర్పు: గౌతంరాజు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu