అన్నయ్య కోసమే 'ఊరికో ఠాగూర్'

ఈ సందర్భంగా ఏర్పాటయిన పాత్రికేయుల సమావేశంలో దర్శకనిర్మాత బండారు భాస్కరరాజా మాట్లాడుతూ 'అన్న ఎన్.టి.ఆర్.గారి గొప్పతనాన్ని వెల్లడిస్తూ గతంలో 'ప్రజాతీర్పు', 'అన్నసైన్యం' చిత్రాలు నిర్మించాను. ఇప్పుడు ఈ అన్నయ్య కోసం ఈ సినిమా తీస్తున్నాను. సినిమాలో 8 పాటలు ఉంటాయి. సెప్టెంబరులో షూటింగ్ ప్రారంభిస్తాం.ఆరు నెలల్లో సినిమా మొత్తం పూర్తి చేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.
కొత్తవారికి ఈ సినిమాలో ఎక్కువ అవకాశాలు కల్పిస్తాం. ఇక రధసారథిగా నిలిచి కథను నడిపించే కీలకపాత్రను ఓ ప్రముఖ నటుడు పోషిస్తారు' . అందరినీ ఆలోచింపజేసే కథనంతో ఈ సినిమా ఉంటుందని పేర్కొన్నారు. కథ,మాటలు: సంగరాజు వెంకట్, పాటలు: విష్ణు శ్రీ, సమర్పణ: తులసీ రామచంద్రప్రభు.


Click it and Unblock the Notifications











