»   » వివి వినాయక్ రాజకీయం: బాలయ్య, చిరంజీవి, ఎన్టీఆర్‌పై అలా..

వివి వినాయక్ రాజకీయం: బాలయ్య, చిరంజీవి, ఎన్టీఆర్‌పై అలా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు వివి వినాయక్ నుండి సినిమా వచ్చి చాలా కాలం అయింది. 'నాయక్' తర్వాత ఆయన ఆయన చేసిన సినిమా 'అల్లుడు శ్రీను'. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయిశ్రీనివాస్‌ను ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నారు.

ఈ నెల 25న 'అల్లుడు శ్రీను' చిత్రం విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన సినిమా ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు సంబంధించిన విషయాలు, తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి వెల్లడించారు. తనకు 'ఆది' సినిమా చేసే అవకాశం ఇచ్చి లైఫ్ ఇచ్చిన బెల్లంకొండ సురేష్ కోసమే 'అల్లుడు శ్రీను' సినిమా చేసినట్లు వివి వినాయక్ చెప్పుకొచ్చారు.

సాయిశ్రీనివాస్ కొత్త నటుడే అయినప్పటికీ చాలా బాగా చేసాడని, సినిమాలో అతని నటన, పెర్ఫార్మెన్స్, అందరినీ ఆకట్టుకుంటుందని......సమంత హీరోయిన్‌గా నటించడం, తమన్నా స్పెషల్ సాంగ్ చేయడం సినిమాకు మరింత ప్లస్సవుతుందని, ఈ చిత్రం అన్ని వర్గాల వారికి తప్పకుండా ఆకట్టుకుంటుందని, నిర్మాతకు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందని వినాయక్ చెబుతున్నారు.

'అల్లుడు శ్రీను' సినిమా సంగతులు పక్కన పెడితే....ఇతర విషయాలపై ఆయన ఆసక్తికరంగా స్పందించారు. భవిషత్తులో రాజకీయాల్లోకి వస్తానని హింట్ ఇచ్చారు వినాయక్. అదే విధంగా చిరంజీవి, బాలయ్య, జూ ఎన్టీఆర్ లాంటి వారి గురించి కూడా స్పందించారు.

అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...

భవిష్యత్తులో రాజకీయాల్లోకి...

భవిష్యత్తులో రాజకీయాల్లోకి...


రాజకీయాల్లోకి వచ్చే అంశంపై వివి వినాయక్ స్పందిస్తూ...మా తండ్రి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన తరుపున ప్రచారం కూడా చేసారు. మా ప్రాంతంలో మాకు కుటుంబానికి మంచి పేరుంది. నాన్న మరణం తర్వాత నన్ను రాజకీయాల్లోకి రావాలని పలువురు అడుగుతున్నారు. రాజకీయాలపై నాకు చెడు అభిప్రాయం అయితే లేదు. కానీ ఇది సరైన టైం కాదు. సినిమాలతో హ్యాపీగా ఉన్నాను. సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల రాజకీయాల గురించి ఆలోచించడం లేదు. సమయం వచ్చినపుడు పాలిటిక్స్‌పై దృష్టి పెడతాను అన్నారు.

చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వంపై...

చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వంపై...


చిరంజీవి 150వ సినిమాకు దర్శకుడు మీరేనంటూ ప్రచారం జరుగుతుంది కదా...నిజమనా? అనే ప్రశ్నకు వివి వినాయక్ స్పందిస్తూ...ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. ఇప్పుడే ఏ విషయం చెప్పలేను. 150వ సినిమాను డాడీకి గిఫ్టుగా ఇవ్వాలని రామ్ చరణ్ ఆశ పడుతున్నాడు అని వినాయక్ తెలిపారు.

డిఫరెంట్ ఆప్షన్స్...అందులో నేనూ!

డిఫరెంట్ ఆప్షన్స్...అందులో నేనూ!


చిరంజీవి 150వ సినిమా కోసం చాలా కథలు పరిశీలిస్తున్నారు. బెస్ట్ కథ కోసం అన్వేషణ సాగుతోంది. కథల విషయంలో చిరంజీవి బెస్ట్ జడ్జ్. కథలు, డైరెక్టర్స్, ఇతర టెక్నీషియన్స్ విషయాల్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఆలోచిస్తున్నారు. అందులో నేనూ ఒకడిని. ఏ విషయం అయినా చిరంజీవిగారే ఫైనల్ చేస్తారు అని వివి వినాయక్ చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు గురించి

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు గురించి


పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి యాక్టర్లతో పని చేయాలని ప్రతి ఒక్క దర్శకుడు కోరుకుంటారని.....తగిన కథలు దొరికితే వారిని సంప్రదిస్తానని వినాయక్ చెప్పుకొచ్చారు.

జూ ఎన్టీఆర్ గురించి

జూ ఎన్టీఆర్ గురించి


జూ ఎన్టీఆర్‌ నాకు తమ్ముడు లాంటి వాడు. గతంలో అదర్స్ 2 చిత్రం చేద్దామని అన్నాం. కానీ ఎన్టీఆర్ ఇపుడు వివిధ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అవి పూర్తయ్యాక ఆలోచిస్తాం. కానీ అదుర్స్ 2 మాత్రం కాదు. కొత్త సినిమా చేస్తాం అన్నారు.

బాలయ్య గురించి...

బాలయ్య గురించి...

బాలయ్య దర్శకుల నటుడు. ఆయనతో చేసిన చెన్నకేశరెడ్డి చిత్రం నాకు ఎంతో స్పెషల్. చాలా చిన్న వయసులోనే ఆయనతో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఆయన దర్శకులను గౌరవంగా చూసుకుంటారు. బాలయ్య కోసం పవర్ ఫుల్ స్క్రిప్టు కోసం ఎదురు చూస్తున్నట్లు వి వినాయక్ చెబుతున్నారు.

English summary
VV Vinayak Opinion about Telugu Cinema stars Chiranjeevi, Balakrishna, NTR.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu