twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజకీయం లేదు, కమర్షియల్‌గా: చిరు 150వ చిత్రంపై వినాయక్

    By Nageswara Rao
    |

    తాను దర్శకత్వం వహించే మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలో ఎటువంటి రాజకీయ సన్నివేశాలు ఉండవని ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ స్పష్టం చేశారు. ఇది పూర్తిగా కమర్షియల్ చిత్రంగానే రూపొందిస్తున్నామని చెప్పుకొచ్చాడు. గురువారం తూర్పు గోదావరి జిల్లా మలికిపురంలో ఆయన మాట్లాడారు.

    ఈ సందర్భంగా తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి సినిమాను తెలుగులో 'కత్తి' ఉప శీర్షిక లాంటోడు పేరుతో శుక్రవారం హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

    megastar chiranjeevi

    తనపై ఉన్న నమ్మకంతోనే ఈ అవకాశం దక్కిందని చెప్పుకొచ్చారు. తొలిసారిగా కొణిదెల క్రియేషన్స్ బేనర్‌లో హీరో రామ్‌చరణ్ నిర్మాతగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఠాగూర్ చిత్రం మాదిరి చక్కటి సందేశం కూడా ఉంటుందన్నారు.

    ఈ సినిమాలో పాత చిరంజీవి అభిమానులందరూ చూస్తారని అన్నారు. అద్భుతమైన పాటలు, ఫైట్‌లతో చిరంజీవి అభిమానులను అలరిస్తారన్నారు. ఈ చిత్రానికి హీరోయిన్ ఎవరనేది ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. ఈ చిత్రానికి స్వరాలను దేవీశ్రీ ప్రసాద్ అందిస్తారని తెలిపారు.

    అన్నయ్య 150 సినిమా కావడంతో ఈ చిత్రానికి ఎంతో ప్రత్యేకత ఉందని అన్నారు. ఈ చిత్రాన్ని అత్యాధునిక సాంకేతిక విలువలతో మే చివరి వారం నుంచి తొలి షెడ్యూల్ సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని అన్నారు. ఒక పక్క చిరంజీవి తన 150 వ చిత్రం ప్రారంభానికి జోరుగా ఏర్పాట్లు చేసుకుంటూంటే ఆయనకు ఓ కొత్త తలనొప్పి ఎదురౌతోంది.

    సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో...ఆయన చేసేది 150 వ చిత్రం కాదంటూ అది 151 వ చిత్రం అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ బ్రూస్ లీ చిత్రంలో చిరంజీవి కనిపించారని, అది 150 వ చిత్రం అయ్యిందని, ఇప్పుడు చేసేది 151 వ చిత్రం అంటూ చిరంజీవి లెక్కలు మర్చిపోయారంటూ పోస్ట్ లు పెడుతున్నారు.

    English summary
    Tollywood star director vv vinayak about megastar chiranjeevi 150 th movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X