twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ ఎన్టీఆర్ తో ‘దాన వీర శూరకర్ణ’: వివి వినాయక్

    By Bojja Kumar
    |

    విజయవాడ : మహానటుడు ఎన్టీఆర్‌ నటించిన దాన వీర శూరకర్ణ చిత్రాన్ని జూనియర్‌ ఎన్టీఆర్‌తో తీయాలన్న ఆలోచనతో ఉన్నట్టు ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ తెలిపారు. గురువారం మాచర్లలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడకు ఆయన వచ్చారు. మంచి కథలు దొరికితే మల్టీస్టారర్‌ సినిమాలతో పాటు చిరంజీవి 150వ చిత్రం కూడా తీస్తానని చెప్పారు. వి వినాయక్ ప్రకటనతో చిరంజీవి 150 సినిమా ఆయనే తీస్తున్నట్లు కన్ ఫర్మ్ అయింది.

    'దానవీర సూర కర్ణ' రీమేక్ ప్రాజెక్టు కోసం ఎన్టీఆర్ తన శరీరాన్ని మార్చుకోబోతున్నారని చెప్పుకుంటున్నారు. అందుకోసం ప్రత్యేకమైన జిమ్ కోచ్ ని రప్పించి మరీ కృషి చేయటానికి నిర్ణయించుకుని సంప్రదింపులు జరుపుతున్నాడని సమాచారం. అందులో కర్ణ, ధుర్యోధన, కృష్ణ, బీమ పాత్రలను పోషించబోతున్నారు. అయితే ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్ కావటానికి దాదాపు సంవత్సంరం పైనే పట్టే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని రీమేక్ చేయడం తన జీవితంలోనే ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నారు వినాయక్. ఈ లోగా జూ ఎన్టీఆర్, వినాయక్ ఇప్పటికే కమిట్ అయిన చిత్రాలను పూర్తి చేయనున్నారు.

    దాన వీర శూర కర్ణ 1977లో విడుదలై చాలా విధాలుగా రికార్డులు సృష్టించిన తెలుగు సినిమా పౌరాణిక చిత్రరాజం. ఇది నందమూరి తారక రామారావు, కొండవీటి వెంకటకవి కలసి సృష్టించిన సంచలన చిత్రం. కేవలం 10 లక్షలతో తయారైన ఈ సినిమా కోటి రూపాయలకు పైగా అప్పట్లో వసూలు చేసింది. 1994లో రెండవసారి విడుదల అయినప్పుడు మళ్ళీ కోటి రూపాయలు వసూలు చేసింది.

    ఈ సినిమా పూర్తిగా ఎన్.టి.ఆర్. శ్రమ ఫలితం. అప్పటి సినిమా రంగంలో తిరుగులేని కధానాయకునిగా ఎంతో బిజీగా ఉన్న ఎన్.టి.ఆర్. ఈ సినిమాను, స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించి, ఆపైన కర్ణునిగా, దుర్యోధనునిగా, కృష్ణునిగా మూడు పాత్రలు పోషించాడు. మొత్తం 4 గంటల 17 నిముషాల నిడివి గల సినిమాలో దాదాపు నాలుగు గంటలపాటు ఎన్.టి.ఆర్. ఏదో ఒక పాత్రలో కనిపిస్తూనే ఉంటాడు. దాన వీర శూర కర్ణ బహుశా భారతీయ చిత్రాలలో పొడవైనవాటిలో ఒకటి.

    English summary
    Director VV Vinayak to remake Dana Veera Soora Karna with Jr NTR. Vinayak confirms this news.‘Dana Veera Sura Karna’ great movie was produced by the late NT Rama Rao and he also played three roles in the film, Karna, Duryodhana and Krishna. Now the latest news is that Jr NTR got the idea of remaking of DVS Karna under the direction of VV Vinayak.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X