»   » కొడుకు కోసం కోట్లు గుమ్మరిస్తున్న నిర్మాత

కొడుకు కోసం కోట్లు గుమ్మరిస్తున్న నిర్మాత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వివి వినాయక్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు శ్రీను అనే టైటిల్ ఖరారు చేసారు. అయితే ఈచిత్రానికి ఖర్చు చేస్తున్న బడ్జెట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

సాధారణంగా కొత్త హీరోల సినిమాలంటే వీలైనంత వరకు బడ్జెట్ తక్కువగానే ఉండేట్టు చూసుకుంటారు దర్శక నిర్మాతలు. కొత్త మొహాలు కాబట్టి వసూళ్లు తక్కువగా ఉంటాయి కాబట్టే బడ్జెట్ కుదిస్తారు. అయితే వివి వినాయక్ దర్శకత్వం, సమంతను హీరోయిన్ గా చేస్తుండటం, తమన్నాతో ఐటం సాంగు చేస్తుండం లాంటి అట్రాక్షన్స్ ఉండటం వల్ల సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా మళ్లీ రాబట్టుకోవచ్చనే ఆలోచనలో ఉన్నాడట బెల్లంకొండ. ఈ చిత్రానికి దాదాపు 35 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఒక సినిమాకు 40 కోట్లు వసూలు కావడమే గగనంగా ఉన్న ఈ రోజుల్లో తన కొడుకు తొలి సినిమాతో బెల్లంకొండ ఎలాంటి ఫరిస్థితులు ఎదుర్కోబోతున్ానారు అనేది

VV Vinayak's ‘Alludu Srinivas’ budget in danger zone?

అదృష్టం కలిసొచ్చి కొడుకు హీరోగా క్లిక్ అయితే.....భవిష్యత్‌లో తన వారసుడితోనే సినిమాలు తీసుకోవచ్చని, అపుడు లాభాలు మరింత ఎక్కువగా ఉంటాయని బెల్లంకొండ భావిస్తున్నాడట. రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. శ్రీ లక్ష్మి నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 4గా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

వివి వినాయక్ దర్శకత్వం కావడం, సమంత హీరోయిన్ గా చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి బెల్లంకొండ శ్రీనివాస్ లుక్స్ పరంగా ఫర్వాలేదనిపిస్తున్నాడు. మరి వెండితెరపై ఏ మేరకు నిలదొక్కుకుంటాడో చూడాలి. ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రానికి వినాయక్ అత్యంత ఎక్కువ మొత్తంలో రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్ల సమాచారం. అదే విధంగా తన కొడుకు సరసన సమంతను హీరోయిన్ గా ఒప్పించడానికి కూడా ఆమెకు హారీ మొత్తంలోనే ఆఫర్ చేసాడట బెల్లంకొండ. కొడుకు సినిమా కాబట్టి వెనకా ముందు ఆలోచించకుండా బెల్లంకొండ తెగ ఖర్చు పెడుతున్నాడని వినికిడి.

English summary
Producer Bellamkonda Suresh’s son Bellamkonda Sai srinivas is all set to debut as hero with a new movie ‘Alludu Srinivas’. VV Vinayak is directing the movie. The latest buzz is that the movie title is under consideration.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu