»   » వినాయక్ పుట్టినరోజు కోరిక...చిరు 150వ సినిమానే!

వినాయక్ పుట్టినరోజు కోరిక...చిరు 150వ సినిమానే!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: తెలుగు టాప్ డైరెక్టర్లలో ఒకరైన వివి వినాయక్ ఈ రోజు(అక్టోబర్ 9)తో 38వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మరోసారి మెగాస్టార్ చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కాలని ఆకాంక్షించారు. గతంలో చిరు, వినాయక్ కాంబినేషన్లో ఠాగూర్ లాంటి సూపర్ హిట్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

  ఆయన ఐ.ఏ.ఎన్.ఎస్‌తో మాట్లాడుతూ...'చిరంజీవిగారు పొలిటికల్ కెరీర్లో చాలా బిజీగా ఉన్నారని తెలుసు. ఆయన మళ్లీ తిరిగి యాక్టింగ్ వైపు వస్తారో కూడా తెలియదు. కానీ, ఒక వేళ ఆయన తిరిగి సినిమాల్లోకి వస్తే ఆయన సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. నాకు అంతకు మించిన సంతోషం ఇంకేమీ లేదు' అని వెల్లడించారు.

   VV Vinayak's Birthday Wish; Wants To Direct Chiranjeevi Again

  వినాయక్ తన పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటున్నారు. పుట్టినరోజు సందర్భంగా బాసరలోని సరస్వతీ దేవాలయాన్ని సందర్శించుకోవడం అలవాటు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఆనవాయితీ కొనసాగిస్తున్నామని, ప్రతి సంవత్సరం తప్పకుండా కుటుంబ సభ్యులతో పాటు బాసర వెళతాను అని తెలిపారు వినాయక్.

  ప్రస్తుతం వినాయక్ బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ హీరోగా పరిచయం సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ చిత్రంలో సమంత హీరోయిన్. అక్టోబర్ 20 నుంచి సినిమా ప్రారంభం కానుంది. దాదాపు 8 నెలల పాటు కేవలం ఈ సినిమా స్క్రిప్టు కోసం వినాయక్ కష్టపడ్డారు.

  English summary
  Telugu filmmaker VV Vinayak, who turns 38 today (October 9), says that if given an opportunity, he would love to direct Tollywood Megastar Chiranjeevi for the second time. The duo has previously worked in Telugu blockbuster Tagore, Telugu remake of Tamil blockbuster Ramanaa. It is one of the biggest hit movies in Vinayak's career.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more