»   » అంజలి అందం అదిరింది, వివి వినాయక్ వాయిస్ (ఫోటోలు)

అంజలి అందం అదిరింది, వివి వినాయక్ వాయిస్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: అంజలి కధానాయికగా తెలుగులో 'గీతాంజలి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందు. హర్రర్, హాస్య కధాంశంగా రూపొందుతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు రాజ్ కిరణ్ దర్శకత్వం వహిస్తుండగా, ఎం‌వి‌వి సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్ర కథను ప్రముఖ రచయిత కోన వెంకట్ సమకూర్చారు.

  ప్రవీణ్ లక్కరాజు సంగీత దర్శకుడిగా, శ్రీజో గేయ రచయితగా పరిచయమవుతున్నారు. దర్శకుడు వి.వి. వినాయక్ వాయిస్ ఓవర్‌తో ఈ సినిమా మొదలవుతుందని కోన వెంకట్ చెప్పారు. సోమవారం ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ "ఇప్పటివరకు కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన శ్రీనివాసరెడ్డి ఈ చిత్రానికి మూల స్తంభం వంటి ప్రధాన పాత్ర చేశాడు. సత్యం రాజేశ్ ఓ కీలక పాత్ర చేశాడు. 'షకలక' శంకర్‌కు ఇది పెద్ద బ్రేక్‌నిచ్చే సినిమా. కొత్త కమెడియన్ల తరం రావాల్సిన సమయం వచ్చిందన్నారు.

  స్లైడ్ షోలో 'గీతాంజలి' సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు, అంజలి హాట్ లుక్స్...

  విడుదల ఎప్పుడంటే...

  విడుదల ఎప్పుడంటే...

  జూలై రెండో వారంలో పాటల్నీ, ఆగస్ట్ మొదటి వారంలో సినిమానీ విడుదల చేయబోతున్నారు.

  బ్రహ్మీపై పాట

  బ్రహ్మీపై పాట

  టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఒకరు ఇందులో ఓ పాట చేయబోతోంది. బ్రహ్మానందం మీద చిత్రీకరించే పాట హైలైట్‌గా ఉంటుందట.

  అంజలి కెరీర్లో గుర్తింపు ఇచ్చే సినిమా...

  అంజలి కెరీర్లో గుర్తింపు ఇచ్చే సినిమా...

  'అనుష్కకు 'అరుంధతి'లా, జ్యోతికకు 'చంద్రముఖి'లాగా అంజలి కెరీర్‌కి టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచే సినిమా ఇదని అంటున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా కథా కథనాలు ఉంటాయి. వినోదానికి ప్రాధాన్యముంటుంది. ఇప్పటివరకూ వచ్చిన హారర్‌ కామెడీ చిత్రాల్లోనే ఇదొక స్పెషల్‌ మూవీగా నిలిచిపోతుందని రచయిత కోన వెంకట్ చెబుతున్నారు.

  చాలా కష్టపడుతున్న అంజలి

  చాలా కష్టపడుతున్న అంజలి

  నిర్మాత సత్యనారాయణ మాట్లాడుతూ "అంజలి ఇచ్చిన సపోర్ట్ మరచిపోలేనిది. చిక్‌మంగుళూరులో వర్షంలో తడుస్తూ, తక్కువ ఉష్ణోగ్రతలో ఆమె మూడు రోజుల పాటు ఓ పాటను చేశారు'' అన్నారు.

  నటీనటులు, టెక్నీషియన్స్

  నటీనటులు, టెక్నీషియన్స్

  శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, హర్ష వర్దన్ రాణె, రావు రమేశ్, అలీ, రఘుబాబు, పృథ్వీ, ఝాన్సీ, వెన్నెల కిశోర్, శ్రవణ్, మధునందన్, సీవీఎల్ నరసింహారావు, దీక్షితులు తారాగణమైన ఈ చిత్రానికి రచనా సహకారం: అనిల్ రావిపూడి, వెంకటేశ్ కిలారు, కథా విస్తరణ, స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్, సహ నిర్మాత: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల.

  English summary
  'Geethanjali' starring Anjali in the lead role has neared completion. The audio launch of the movie will be held on July 2nd and the theatrical release would be in August. Special Attraction in 'Geethanjali' is the voice over provided by ace filmmaker VV Vinayak and an Item Number by one of the Star Heroines.anjali, geethanjali, kona venkat, పవన్ కళ్యాణ్, గీతాంజలి, అంజలి, కోన వెంకట్
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more