twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఇంద్ర’లోని ఆ సీన్ వెనుక అంత కథ ఉందా?.. మెగాస్టార్ డెడికేషన్ అంటే అంతే మరి!

    |

    వైజయంతీ మూవీస్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ అంటే తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ ఓ అద్భుతమే. జగదేక వీరుడు అతిలోక సుందరి, చూడాలనివుంది, ఇంద్ర వంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. నేటికి ఇంద్ర విడుదలై పద్దెనిమిదేళ్లు. ఈ ఇండస్ట్రీ హిట్ చిత్రం వెనుకున్న ఓ చిన్న కథను వైజయంతీ మూవీస్ నేడు బయట పెట్టింది. చిరంజీవి అంకితభావం, ఓ సీన్ కోసం మెగాస్టార్ ఎంతలా కేర్ తీసుకుంటారని చెబుతూ ఓ వీడియోను విడుదల చేసింది.

    ఇంద్ర మూవీ షూటింగ్ ప్రతీ రోజు పండగల ఉండేది. బోలెడంత మంది చుట్టాలు లాగా వస్తూ ఉండేవారు. అలా ఒక టైంలో పెళ్లాం ఊరెళ్తే సినిమా ఓపెనింగ్‌ని దత్తు గారు, అరవింద్ గారు షూటింగ్ సెట్ బయట గార్డెన్స్‌లో పెట్టారు. చిరంజీవి గారిని ఓపెన్ చేయమన్నారు. అప్పుడు చిరంజీవి గారు చాలా తొందరగా ఓపెన్ చేసేసి.. ఈరోజు మాత్రం ఎవరినీ లోపలకి రానీవొద్దు. ఈ సీన్‌కి నేను గట్టిగా కాన్సన్‌ట్రేట్ చేయాలి అని అన్నారు.. అది ఈ సీన్.. అది చిరంజీవి గారి డెడికేషన్ అంటూ వైజయంతీ మూవీస్ ట్విట్టర్ ద్వారా ఆ సీన్‌ను షేర్ చేసింది.

    vyjayanthi movies About Chiranjeevi Practices Indra Movie Powerful Scene

    సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ అయ్యాక చిరంజీవి విలన్ ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. పైన వేసుకునే కండువాతో కుర్చీని లాగి.. సింహాసనం మీద కూర్చునే హక్కు పైన ఆ ఇంద్రుడిది ఇక్కడ ఈ ఇంద్ర సేనుడిది అనే చెప్పే సీన్ అట. అంతలా అంకితభావంతో చేశాడు గనుకే బాక్సాఫీస్ మోత మోగింది. ఇప్పటికీ ఇంద్ర రికార్డులు తెలుగు చిత్ర సీమలో ఓ అద్భుతమే. ఇంద్ర విడుదలై పద్దెనెమిదేళ్లు అవుతున్నందున సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.

    English summary
    vyjayanthi movies About Chiranjeevi Practices Indra Movie Powerful Scene. We are grateful to our audiences for showering this film with unconditional love Blue heart even after 18 years, this remains as one of our benchmark films
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X