twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వామ్మో...మాఫియా రంగంలోకి దిగిందా?

    By Srikanya
    |

    ముంబయి: మాఫియా అనేది సినిమాల్లో విలన్ వృత్తిగా స్ధిరపడిపోయింది. దర్శకులు, కథకులు, నిర్మాతలు మాఫియా కథలపై ఉత్సాహం చూపిస్తూంటారు. అయితే నిజ జీవితంలో మాఫియా అనే పదం వినేసరికే ఉలిక్కిపడుతూంటారు. ఇప్పుడు ప్రీతిజింతా కేసు మాఫియా వైపు టర్న్ తీసుకోవటం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. నిజా,నిజాలు పై చర్చిస్తున్నారు. ఆమె తెలుగులోనూ సినిమాలు చేసి ఉండటంతో ఇక్కడ వారికి ఆమెతో మంచి రిలేషన్స్ ఉండటంతో ఆమె గురించి వచ్చే వార్తలపై నిరంతరం చర్చ జరుగుతోంది.

    సినీనటి ప్రీతీ జింతా, వ్యాపారవేత్త నెస్‌ వాడియా మధ్య వివాదం మరో మలుపు తిరిగింది. ప్రీతిని వేధిస్తే మీ వ్యాపారానికి ఇబ్బందులు తప్పవంటూ ఒక గ్యాంగ్‌స్టర్‌ నుంచి తమకు బెదిరింపు ఫోన్లు, మెసేజ్‌ వచ్చాయని వాడియా గ్రూప్‌ ఆరోపించింది. ఈ మేరకు ఎన్‌ఎం జోషి మార్గ్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నెస్‌ వాడియా తండ్రి, పారిశ్రామికవేత్త నస్లీ వాడియా ఇద్దరు వ్యక్తిగత కార్యదర్శుల సెల్‌ఫోన్లకు ఈ బెదిరింపులు వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

    నస్లీ వాడియా కార్యాలయానికీ ఇలాంటి ఫోన్లు వచ్చినట్లు తెలిపారు. విదేశాల్లో ఉంటున్నాడని భావిస్తున్న గ్యాంగ్‌స్టర్‌ రవి పూజారి పేరు మీద ఈ బెదిరింపులు వచ్చినట్లు ముంబయి పోలీసు కమిషనర్‌ రాకేశ్‌ మారియా బుధవారం వెల్లడించారు. మొత్తం ఐదు ఫోన్‌కాల్స్‌, ఒక మెసేజ్‌ వచ్చినట్లు చెప్పారు.

    Wadia group complains of threats from underworld over Preity Zinta

    ''ప్రీతిని వేధించొద్దని (నెస్‌) వాడియాకు చెప్పండి. మాట వినకపోతే ఆయన వ్యాపారం ఇబ్బందుల్లో పడుతుంది'' అని ఎస్‌ఎంఎస్‌లో ఉందని పోలీసులు తెలిపారు. ఫోన్‌లో మాట్లాడింది రవి పూజారానేనా, కాల్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయనేది నిర్ధరించేందుకు ఫిర్యాదును క్రైం బ్రాంచ్‌లోని బలవంతపు వసూళ్ల నియంత్రణ విభాగానికి పంపించారు. ఫోన్‌ నంబర్‌ ఇరాన్‌దని పోలీసులు భావిస్తున్నారు.

    నెస్‌ వాడియాపై ప్రీతి ఫిర్యాదుపై దర్యాప్తులో పురోగతి గురించి రాకేశ్‌ మాట్లాడుతూ- ప్రస్తుతం వేరే దేశంలో ఉన్న ఆమె వాంగ్మూలం ఇచ్చేందుకు ఈ వారంలో ముంబయి రానున్నారని చెప్పారు. వాంఖడే స్టేడియంలో మే 30న ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా తనను నెస్‌ వాడియా దుర్భాషలాడారని, లైంగికంగా వేధించారని ప్రీతి తన ఫిర్యాదులో ఆరోపించారు.

    కేసు దర్యాప్తులో భాగంగా సీసీటీవీ దృశ్యాలు, ఇతర సమాచారం ఇవ్వాలని కోరుతూ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి లేఖ రాశామని రాకేశ్‌ తెలిపారు. ప్రీతి ఆరోపిస్తున్న సంఘటన జరిగిన చోట ఐదు కెమెరాలు ఉన్నాయని, వాటిలోని దృశ్యాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.

    English summary
    In a new twist to Preity Zinta-Ness Wadia episode, the Wadia group has filed a police complaint claiming they received threatening calls and a text message from an underworld don warning that their "business will be in trouble" if the actress was harassed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X