»   » అమ్మ బ్రహ్మ దేవుడో... కొంప ముంచినావురో...: శ్రీదేవి లేటెస్ట్ ర్యాంప్ వాక్ ఫొటోలు

అమ్మ బ్రహ్మ దేవుడో... కొంప ముంచినావురో...: శ్రీదేవి లేటెస్ట్ ర్యాంప్ వాక్ ఫొటోలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీదేవి ఇండియన్ స్క్రీన్ మీద మెరిసిన కాంతి రేఖ మూడున్నర దశాబ్దాల కాలం, 54 ఏళ్ళ వయస్సు ఆమె అందాన్ని ఏమాత్రం తగ్గించలేక పోయాయి. ఇప్పటికీ శ్రీదేవి అంటే ఆనాటి స్థాయి అభిమానంతో ఉండే అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. ప్రస్తతం సీనియర్ నటిగా ఇండస్ట్రీలో తనకంటూ గౌరవ స్థానాన్ని ఏర్పరచుకున్న శ్రీదేవి....

లేటెస్ట్ ఫొటో చూస్తేనే అర్థమైపోతోంది

లేటెస్ట్ ఫొటో చూస్తేనే అర్థమైపోతోంది

ఒకప్పుడు అతిలోక సుందరిగా ఇండియన్ సినీ రంగాన్ని క్వీన్ లా ఏలిన సంగతి తెలిసిందే. ఒకప్పుడే కాదు ఇప్పటికీ ఆమెలో అందం ఏమాత్రం తగ్గలేదన్న సంగతి ఆమె లేటెస్ట్ ఫొటో చూస్తేనే అర్థమైపోతోంది. కాలం, వయస్సూ అనే మాటలు శ్రీదేవి విషయంలో తమ స్వభావాన్ని మర్చిపోయాయేమో అన్నంతగా ఇప్పటికీ ఆమెలో వన్నె తగ్గని ఆ అందం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.

నోట మాట‌రాలేదంతే.

నోట మాట‌రాలేదంతే.

ఇద్ద‌రు కూతుళ్ల త‌ల్లి అయిన‌ప్ప‌టికీ.. వారితో పోటీ ప‌డ‌టం ఈ అతిలోక సుంద‌రికే సాధ్యం. వెండితెర వేల్పుగా.. అతిలోక సుంద‌ర‌న్న ట్యాగ్‌కు అచ్చుగుద్దిన‌ట్లుగా స‌రిపోవ‌టం శ్రీదేవికి మాత్ర‌మే సాధ్య‌మేమో? ఓప‌క్క కూతుళ్లు వెండితెర‌ను ఏలేందుకు సిద్ధ‌మ‌వుతున్న వేళ‌.. ర్యాంప్ మీద మెరిసిన శ్రీదేవిని చూసినోళ్ల‌కు నోట మాట‌రాలేదంతే.

ర్యాంప్‌కే కొత్త క‌ళ‌ను తీసుకొచ్చింది

ర్యాంప్‌కే కొత్త క‌ళ‌ను తీసుకొచ్చింది

సింధూరం.. బంగారం మిక్స్ చేసిన ఫుల్ గౌన్ లో దేవ‌క‌న్య దిగి వ‌చ్చిందా? అన్న‌ట్లు ఉండ‌టం శ్రీదేవికి మాత్ర‌మే సాధ్య‌మేమో? వ‌య‌సు మీద ప‌డుతున్నా.. ఎంత‌కూ త‌ర‌గ‌ని అందాలతో మెరిసిపోయింది. ర్యాంప్‌కే కొత్త క‌ళ‌ను తీసుకొచ్చింది. ర్యాంప్ మీద హోయ‌లు ఒలికించిన శ్రీదేవిని చూసిన అవాక్కు అయ్యార‌నే చెప్పాలి.

శ్రీదేవి ర్యాంప్ వాక్

శ్రీదేవి ర్యాంప్ వాక్

తాజాగా బెంగ‌ళూరులోని ఓ ప్ర‌ముఖ న‌గ‌ల వ్యాపార సంస్థ ఫ్యాష‌న్ షోను నిర్వ‌హించింది. అందులో సంప్ర‌దాయ వ‌స్త్రాలు.. న‌గ‌ల‌తో షో నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా శ్రీదేవి ర్యాంప్ వాక్ చేసి అద‌ర‌గొట్ట‌ట‌మే కాదు.. కెమేరా సైతం త‌న‌ను తాను ప‌ర‌వ‌శించిపోయేలా మెరిసిపోయింది. ప్ర‌తి జ‌న‌రేష‌న్ కు ఒక అందం ఉంటుంద‌ని. కానీ.. జ‌న‌రేష‌న్ ఏదైనా.. త‌న అందంతో పిధా చేసే స‌త్తా శ్రీదేవికి మాత్ర‌మే సాధ్య‌మేమో? అందగ‌త్తెలందు శ్రీదేవి వేర‌యా అనుకోక త‌ప్ప‌దు.

English summary
Sridevi looked ravishing on Saturday in a heavy gold and red lehenga paired with a boat-necked choli, designed by ace couturier Manish Malhotra.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu