»   » యోగాడే: హైదరాబాద్ లో బాలయ్య యోగాసనాలు (వీడియో)

యోగాడే: హైదరాబాద్ లో బాలయ్య యోగాసనాలు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఈ రోజు యోగాడే ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా యోగాసనాలతో భారతీయులందరూ తమ మూలాలను ఆవిష్కరించుకునే ప్రయత్నం చేసారు. అందులో బాగంగా హైదరాబాద్ లోని కేబీఆర్‌ పార్క్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తదితరులు యోగా వేడుకల్లో పాల్గొని ఆసనాలు వేశారు. ఈ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.

balayya

అనంతరం బాలకృష్ణ కార్యక్రమంలో మాట్లాడుతూ..మానవుడి విజయానికి యోగా అవసరమన్నారు. భారతీయ సంస్కృతి చాలా గొప్పదని బాలయ్య పేర్కొన్నారు. మానవుడు ఆరోగ్యంగా ఉండాలంటే యోగా తప్పకుండా చేయాలన్నారు. యోగాను ప్రతి ఒక్కరూ అలవాటుగా మార్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

balayya

సంజీవయ్య పార్కులో... హైదరాబాద్‌ సంజీవయ్య పార్కులో నిర్వహించిన యోగా వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు, భాజపా శ్రేణులు, విద్యార్థులు పాల్గొన్నారు.

వీడియో కర్టసి : v 6 ఛానెల్

నగరంలోని పలుచోట్ల యోగా వేడుకలు ఘనంగా జరిపారు. యోగావేడుకల్లో ప్రముఖులు పాల్గొని యోగాసనాలు చేశారు. గచ్చిబౌలిలో జరిగిన యోగా వేడుకల్లో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, పలువురు మంత్రులు పాల్గొన్నారు.

English summary
Nandamuri Balakrishna performed Yoga asanas at KBR Park in Hyderabad on Tuesday on the eve of International Yoga Day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu