»   » గురు ట్రైలర్ వెంకీ కి మరో మైలు రాయి అయ్యేలాగే ఉంది.. ఈ ట్రైలర్ చూడండి

గురు ట్రైలర్ వెంకీ కి మరో మైలు రాయి అయ్యేలాగే ఉంది.. ఈ ట్రైలర్ చూడండి

Posted By:
Subscribe to Filmibeat Telugu

వెంకటేష్‌ కెరీర్‌లో హిట్లు కొట్టిన చిత్రాల్ని లెక్క వేస్తే అందులో రీమేక్‌ కథలే ఎక్కువ ఉంటాయి. రీమేక్‌ కథల రారాజుగా పేరు తెచ్చుకున్న వెంకీ..దృష్టి బాలీవుడ్‌ చిత్రం 'సాలా ఖడూస్‌'పై పడింది. ఈ చిత్రాన్ని తెలుగులో 'గురు' పేరుతో విడుదల చేస్తున్నారు. 'గురు'లో వెంకీ లుక్‌ ఇది వరకే బయటకు వచ్చింది.హిందీ సినిమా సాలా ఖండూస్ కు ఇదే మాతృక. అయితే హిందీ సినిమాలో కొన్ని మార్పులు చేసారు. ఆ మార్పులు లేకుండా తమిళ మాతృకనే తెలుగులోకి తీసుకువస్తున్నారు. బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన రీతికా సింగ్ నే తెలుగులో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే వెంకటేష్ సగానికంటే ఎక్కువే మార్కులు వేసుకున్నాడు

guru

హిందీలో విజయం సాధించిన 'సాలా ఖడూస్'కు 'గురు'గా తెలుగులో రీమేక్ చేస్తున్నాడు వెంకీ. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా టీజర్‌ను ఇటీవలే విడుదల చేశారు. 'వెంకటేష్' ఎంతో ఊహించుకున్న 'బాబు బంగారం' తీవ్రంగా నిరాశపరిచింది. ఈ చిత్రం బడ్జెట్ ని రాబట్టగలిగింది కానీ ఈ చిత్రం వల్ల 'వెంకటేష్' కి ప్రత్యేకంగా ఒరిగింది మాత్రం ఏం లేదని చెప్పాలి. అందుకే 'గురు' రీమేక్ తో అయినా బాక్సాఫీసు వద్ద విక్టరీ నమోదు చేయాలని ఈ సీనియర్ స్టార్ కసిగా ఉన్నాడు. తాజాగా వెంకీ తన ఫేస్‌బుక్ పేజీలో మరో టీజర్‌ను పోస్ట్ చేశాడు. 'బాక్సింగే నా ప్రపంచం', 'సున్నితంగా ట్రైన్ చేస్తే నీ లాగా వాళ్లు జీవితాంతం మరుగుదొడ్లు కడుక్కుంటూ చస్తారు', 'చెప్పిందే వింటారు.. చెప్పిందే తింటారు.. ఇల్లు, వాకిలి, ప్రేమ, దోమ వంటి చెత్త ఇక ఉండొద్దు' వంటి డైలాగులు ఆకట్టుకుంటాయి. తొలి టీజర్‌తో ప్రేక్షకులను అలరించిన వెంకీ.. తన రెండో టీజర్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా చేసుకుంటాడనడంలో సందేహం లేదు. వై నాట్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాను వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ఈ చిత్రం జనవరిలో విడుదల కానుండగా ప్రమోషన్ స్పీడ్ పెంచాడు. ఇప్పుడు ఈ సంబంధించి టీజర్ విడుదల చేసి మరింత హైప్స్ తెచ్చాడు. ' మీరు నేను చెప్పిందే వింటారు.. చెప్పిందే తింటారు. ఇల్లు, వాకిలి, ప్రేమ, దోమ, చెత్తాచెదారం అన్ని పక్కనపెట్టి ఒళ్లొంచి ట్రై చేయండి .. ' అని టీజర్‌లో వెంకీ చెప్పే డైలాగ్‌ అదుర్స్ అనిపించింది. గురువు గారి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీరే చూడండి...

English summary
Guru is the latest Telugu movie, which is the remake of Tamil movie 'Irudhi Suttru' starring R Madhavan and Ritika Singh.Watch the latest teaser of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu