»   » తొలిసారి మహేష్... చూడకపోతే చూసేయండి...అదిరిందంటే(వీడియో)

తొలిసారి మహేష్... చూడకపోతే చూసేయండి...అదిరిందంటే(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ ఇంతవరకూ ఎప్పుడూ టీవిలో టాక్ షోలో పాల్గొన్నది లేదు. అయితే తొలిసారిగా ఆయన కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అనే టీవి షోకు హాజరవుతున్నారు. జీ తెలుగులో టాప్ షో గా కొనసాగుతున్న ఈ షోకు ఆయన వస్తున్న విషయాన్ని ఆ షో హోస్ట్ ప్రదీప్ తన ఫేస్ బుక్ ద్వారా తెలియచేసారు.

ఈ సెన్సేషన్ ఎపిసోడ్ ఈ నెల 22 వ తేదీ, ఆదివారం ప్రసారవుతుంది. ప్రస్తుతం కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 3 ప్రతీ ఆదివారం జీ తెలుగులో వస్తోంది. ఇప్పటికే ఈ సీజన్ లో రకుల్ ప్రీతి సింగ్, సాయి ధరమ్ తేజ వచ్చి హంగామా చేసారు.

Watch Mahesh Babu's TV Debut, KTUC 3 Promo

ఇక ఇప్పుడు మహేష్ బాబు ఈ షోకు రావటంతో ఛానెల్ వాళ్ల ఆనందం మామూలుగా లేదు. శ్రీమంతుడు నుంచి మీడియాకు పూర్తి స్దాయిలో టచ్ లో కి వస్తున్నారు మహేష్. ఇప్పుడున్న పరిస్దితుల్లో మీడియాకు టచ్ లో లేకపోతే ప్రమోషన్ వేగం తగ్గుతోందని ఆయన గమనించారు. అలాగే ఇది ఓ రకంగా ఫ్రీ పబ్లిసిటీ కూడాను.

ఇక బ్రహ్మోత్సవం చిత్రం ప్రమోషన్ లో భాగంగా జీ తెలుగుకు వచ్చిన ఆయన తన పర్శనల్ విషయాలతో పాటు, తన సినిమాల గురించి కూడా వివరించారు. ఇదిగో ఈ ప్రోమోను ఇక్కడ మీరు చూడవచ్చు.


మహేష్ మాట్లాడుతూ...దాదాపు 28 మంది సీనియర్‌ ఆర్టిస్టులతో కలిసి పనిచేయడం ఫస్ట్‌టైమ్‌. చాలా కొత్త అనుభూతినిచ్చింది. చాలా కొత్త విషయాలు కూడా నేర్చుకున్నాను. శ్రీకాంత్‌ అడ్డాల చిత్రాలు చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. ఈ చిత్రం కూడా మన నిజ జీవితాలకు దగ్గరగా ఉంటుంది. ఇందులో మంచి లవ్‌ ట్రాక్‌ కూడా ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ వాల్యూస్‌ని తెలిపే చిత్రమిది.

మనం మర్చిపోతున్న చిన్న చిన్న విలువలను ఈ సినిమా గుర్తు చేస్తుంది. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు తమ ఫ్యామిలీని గుర్తు చేసుకుంటాడు. సినిమా చాలా బాగా వచ్చింది. క్వాలిటీ పరంగా ఏమాత్రం రాజీపడకుండా నిర్మాత పివిపి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఆయన కంటెంట్‌ను నమ్మి చేసిన చిత్రమిది. ఓవర్సీస్‌లో ప్రీమియర్‌ షో ఇక్కడ విడుదల రోజుకి ముందే ఉంటుంది. అలా విడుదలైనంత మాత్రం ఇక్కడ ప్రభావం పడడమనేది ఏం ఉండదు. సినిమా బాగుంటే ఎప్పుడైనా చూస్తారు.

English summary
Superstar Mahesh Babu has finally made his television début by gracing the popular talk show, Konchem Touch Lo Unte Cheptha, during the third season. The sensational episode will be aired on Sunday, 22 May, exactly two days after the release of Brahmotsavam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu