»   »  స్టైల్ కే స్టైల్ : రజనీ 'కబాలి' టీజర్ ఇదిగో (వీడియో)

స్టైల్ కే స్టైల్ : రజనీ 'కబాలి' టీజర్ ఇదిగో (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ''ఎవడ్రా ఆ కబాలి.. రమ్మని చెప్పురా'' అంటే....''కబాలి అంటే తమిళ సినిమాల్లోలాగా బొట్టు పెట్టుకుని.. లుంగీ కట్టుకుని.. కబాలి అని పిలవగానే వచ్చి నిలబడి చెప్పన్నా అనే టైపనుకున్నావారా..'' అంటూ మొదటే చెప్పినట్లుగా కబాలి వచ్చేసారు.

మొదటే చెప్పినట్లుగానే 'కబాలి' టీజర్.. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు టీజర్‌ విడుదల చేసారు నిర్మాత కలై పులి ధాను. వయస్సు పెరుగుతున్నా తన నటనలో స్టామినా తగ్గలేదని, తన స్టైల్‌లో ఏమాత్రం మార్పులేదని చాటుతూ ఈ కొత్త టీజర్ లో రజనీ ఫ్యాన్స్ ను మెస్మరైజ్‌ చేస్తున్నాడు. ఈ టీజర్ లో వయస్సు మీదపడ్డ డాన్ గా రజనీ కనిపించి అలరించారు.


ఇక ఈ టీజర్... సూపర్ స్టార్ రజనీ మార్కు స్టైలిష్ నడకతో మొదలవుతుంది. అలాగే...ఆ తర్వాత ఓ మీటింగ్ హాల్లో ''మీరెందుకన్నా డాన్ అయ్యారు'' అని అడిగితే.. రజినీ తనదైన స్టయిల్లో నవ్వే సీన్ ఈ టీజర్ కు హైలైట్ గా నిలిచింది.
Watch: Rajinikanth's Kabali Teaser Released

ఇక ఈ టీజర్ చివర్లో రజినీ 80ల్లో మాదిరి యంగ్ గెటప్ లోనూ కనిపించటం మరో హైలెట్. రజినీకాంత్ భార్యగా నటిస్తున్న రాధికా ఆప్టే సంప్రదాయ చీరకట్టులో కనిపించి అలరించింది. సంతోష్ నారాయణ్ ఎనర్జిటిక్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా టీజర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు భావిస్తున్న ఈ సినిమాలో రజనీ వృద్ధ డాన్‌గా రెండు పార్శ్వాలున్న వైవిధ్యమైన పాత్రను పోషిస్తుండగా.. ఆయన భార్యగా రాధిక ఆప్టే కనిపించనుంది. పా రంజిత్ దర్శకత్వంలో వస్తున్న 'కబాలి' సినిమా కథ అండర్‌ వరల్డ్ మాఫియా చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది.

Watch: Rajinikanth's Kabali Teaser Released

ప్రముఖ దర్శకుడు శంకర్‌ సెన్సేషనల్ ప్రాజెక్టు '2.o'(రోబో-2)లో నటించేందుకు ప్రస్తుతం కాస్తా విరామం తీసుకున్న ఆయన మళ్లీ 'కబాలి' టీమ్‌తో జాయిన్‌ అయ్యాడు. చెన్నైలోని ప్రఖ్యాత ప్రివ్యూ థియేటర్‌ లే మ్యాజిక్‌ లాంతర్న్‌లో ఆయన 'కబాలి'కి డబ్బింగ్ చెప్తున్నారు.

'సినిమా పోస్ట్ ప్రోడక్షన్‌ పనులన్నీ పూర్తయ్యే దశకు వచ్చాయి. జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్‌ కేఎల్‌ ఎడిటింగ్ వర్క్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. దర్శకుడు పా రంజీత్ పర్యవేక్షణలో స్పెషల్ ఎఫెక్ట్స్‌, ఎడిటింగ్‌ పనులు చకచకా జరిగిపోతున్నాయి' అని చిత్ర యూనిట్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

యస్సు మళ్లిన మాజీ గ్యాంగ్‌ స్టర్‌గా రజనీ నటిస్తున్న 'కబాలి' సినిమా కథ అండర్‌ వరల్డ్ మాఫియా చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో రాధికా ఆప్టే, ధన్సికా, కలైరాజన్‌, దినేశ్, నాజర్ తదితరులు నటిస్తున్నారు. సంతోష్‌ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

English summary
The teaser of the most awaited Tamil movie of the year, Rajinikanth's Kabali was released on Sunday.The movie stars Superstar Rajinikanth in the title role portraying the character of an ageing don.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu