»   » థియేటర్ లో సినిమా మరింత భారమేనా..? ప్రేక్షకుడి పై జీఎస్టీ దెబ్బ....

థియేటర్ లో సినిమా మరింత భారమేనా..? ప్రేక్షకుడి పై జీఎస్టీ దెబ్బ....

Posted By:
Subscribe to Filmibeat Telugu

కేంద్రం ప్రవేశపెట్టనున్న జీఎస్టీ బిల్లు అమలు సినిమా టిక్కెట్లపై ప్రభావాన్ని చూపనుంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ మూవీ టిక్కెట్లపై ఫిక్స్‌డ్‌ రేటును 28 శాతంగా నిర్ణయించింది.అఫార్డబుల్ రేట్లతో థియేటర్లలో అందరూ సినిమా చూడటానికి వీలుగా తక్కువ రేట్లను నిర్ణయిస్తారనుకున్న మల్టిఫ్లెక్స్ ఆపరేటర్లను జీఎస్టీ కౌన్సిల్ నిరాశపరిచింది.

అత్యధిక రేటు ఇదే

అత్యధిక రేటు ఇదే

జీఎస్టీ శ్లాబులో ఇప్పటి వరకూ ఉన్న అత్యధిక రేటు ఇదే కావడం విశేషం. దీంతో ఇకపై మల్టిఫ్లెక్స్‌లలో సినిమా చూడటం సామాన్యుడికి భారం కానుంది. దాంతో పాటు ఎంటర్ టైన్మెంట్ ట్యాక్స్ ను కలిపి చెల్లి‍స్తున్నాయని జైట్లీ తెలిపారు. ఇవన్నీ కలిపి ప్రస్తుతం 28 శాతం పన్ను పరిధిలోకి తెచ్చినట్టు పేర్కొన్నారు..

కూల్ డ్రింక్స్, చిరుతిళ్ల ధరలు కూడా

కూల్ డ్రింక్స్, చిరుతిళ్ల ధరలు కూడా

పైగా కూల్ డ్రింక్స్, చిరుతిళ్ల ధరలు కూడా పెరుగుతుండటం వల్ల సినిమా చూడటం కొంచెం కష్టమే అవుతుందని తెలుస్తోంది. జీఎస్టీ దాదాపు ఖరారు కావడంతో కోలీవుడ్ ఇప్పుడు విచిత్ర పరిస్థితిని ఎదుర్కోంటోంది. జులై 1 నుంచి జీఎస్టీ అమలైతే ఇక తమిళనాట వినోదపు పన్ను రాయితీ అనేది ఉండదు. సో.. ఆ రాయితీ పొందిన సినిమాల్ని ఎట్టి పరిస్థితుల్లో జూన్ 30లోపు థియేటర్లలోకి తీసుకొచ్చేయాలి. లేదంటే వాటికి పన్ను మినహాయింపు దక్కదు.

మల్టిఫ్లెక్స్ ఆపరేటర్లు

మల్టిఫ్లెక్స్ ఆపరేటర్లు

అయితే 28 శాతం పన్ను అనేది సరియైనది కాదని మల్టిఫ్లెక్స్ ఆపరేటర్లు వాపోతున్నారు . తక్కువ శ్లాబ్ రేట్లకోసం సినిమా ఇండస్ట్రి వర్గాలు పలుమార్లు జీఎస్టీ కౌన్సిల్ తో లాబీయింగ్ చేపట్టారు కూడా. కానీ ఈ విషయం లో ఈ ఆందోళనల వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదనీ, ఇప్పటికే నిర్ణయించేసిన పన్ను రేట్లలో ఏ మార్పూ ఉండబోదనీ సమాచారం .

టిక్కెట్ల రేట్లు 8-10 శాతం పెరుగుతాయి

టిక్కెట్ల రేట్లు 8-10 శాతం పెరుగుతాయి

సినిమాను 5 శాతం నుంచి 12 శాతం పరిధిలోకి తీసుకురావాలని అభ్యర్థించారు. అయినా కూడా ప్రస్తుతం సినిమా రేట్లకు పై స్థాయి రేట్లనే నిర్ణయించింది. ఈ నిర్ణయంతో టిక్కెట్లపై సగటున పన్ను రేట్లు 8-10 శాతం పెరుగుతాయి. దీంతో సినిమా ఇండస్ట్రిపై నెగిటివ్ ప్రభావం చూపుతుందని మీడియా ఎంటర్ టైన్మెంట్, ట్యాక్స్ పార్టనర్ ఉక్తర్ష్ సంగ్వి చెప్పారు. అయితే 250 రూపాయల కంటే తక్కువగా వసూలు చేసే సినిమా టాక్కెట్లను పన్ను పరిధి నుంచి మినహాయింపు ఇచ్చారు.

జూన్ 30లోపు విడుదల చేయాలి

జూన్ 30లోపు విడుదల చేయాలి

తాజా లెక్కల ప్రకారం ఇప్పటికే సెన్సార్ పూర్తిచేసుకొని, పన్ను మినహాయింపు పొంది రిలీజ్ కు సిద్ధంగా 17 సినిమాలున్నాయి. సో.. వీటన్నింటినీ ఎట్టిపరిస్థితుల్లో జూన్ 30లోపు విడుదల చేయాలి. అంటే ఈరోజు నుంచి కౌంట్ చేసుకున్నా 40 రోజుల్లో 17 సినిమాల్ని రిలీజ్ చేయాలన్నమాట. దీని వల్ల పోటీ పెరిగి, థియేటర్లు దొరక్క దాదాపు అన్ని సినిమాలు నష్టపోయే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ అంశంపై చర్చించేందుకు అత్యవసరంగా సమావేశమౌతున్నాయి కోలీవుడ్ సంఘాలు.

తమిళ భాషలోనే టైటిల్

తమిళ భాషలోనే టైటిల్

కోలీవుడ్ లో ఇప్పుడు పన్ను మినహాయింపు కోసం "తమిళ భాషలోనే టైటిల్" పెట్టే సాంప్రదాయానికి కూడా ఇక తెర పడనుంది. ఇన్నాళ్ళూ తమిళ భాషలోనే సినిమా టైటిల్ ఉంటే వినోదపు పన్ను ఉండేది కాదు. ఈ నిబందన వల్ల చాలా తమిళ సినిమాలకు కొంత ఊరట లభించేది. అయితే ఇప్పుడు ఈ కొత్త నిబందనల వల్ల ఆ "మినహాయింపు" వర్తించకుండా పోతోంది. దీని మీద కూదా ఇప్పుడు కోలీవుడ్ లో కలకలం మొదలైపోయింది.

ప్రేక్షకున్ని బలి పశువుని చేసి

ప్రేక్షకున్ని బలి పశువుని చేసి

మొత్తానికి సినిమా చూడటం ఇప్పుడు సామాన్యుడికి మరింత భారం కాబోతున్నదన్నమాట. మరి సినిమా ఇండస్ట్రీ, థియేటర్ యాజమాన్యాలూ కలిసి ఈ కొత్త నిబందనలకు వ్యతిరేకంగా గొంతు విప్పుతారా లేదంటే ప్రేక్షకున్ని బలి పశువుని చేసి ఊరుకుంటారా అన్నది చూడాలి.

English summary
The GST Council has fixed rate on movie tickets at 28 per cent , the highest rate slab which is also applicable for casinos and fivestar hotels.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu