twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కళ్ళనుండి నీళ్ళొచ్చాయి: రామ్ చరణ్ తేజ

    By Staff
    |

    Ram Charan Teja
    అవును...మా ఇద్దరికీ కళ్ళనుండి నీళ్ళొచ్చాయి...అంటూ తన తండ్రి చిరంజీవి తో కలసి స్టెప్స్ వేసిన క్షణాలను తలచుకుంటూ భావావేశానికి లోనయ్యాడు రామ్ చరణ్ తేజ. రాజమౌళి సినిమా షూటింగ్ గ్యాప్ లో మీడియా తో ముచ్చటిస్తూ...తన మనసులోని అనేక భావాలను బయిట పెట్టాడు.

    మెగాస్టార్ తో పనిచేసిన క్షణం..
    నిజానికి డాడీ నేనూ...కొన్ని సినిమాలు కలపి చెయ్యాలని అనుకున్నాం. అయితే నాన్నగారు మా అందరినీ సర్పైజ్ చేస్తూ...రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు... ఏ కొడుకు కైనా తండ్రితో కలసి పనిచేసే క్షణాలు చాలా గొప్పవని అవి మళ్ళీ వస్తాయని అతను ఆశిస్తున్నాడు.

    పారిశ్రామిక వేత్తను అవుదామనుకున్నా
    ఇక తను నటుడు అవదలచుకోలేదని...ఓ పారిశ్రామిక వేత్తగా ఎదుగుదామని చిన్నప్పటినుండీ కలలు కనేవాడినని అతను భవిష్యత్ ని వర్తమానంతో భేరీజు చేసుకుంటూ ఆలోచనలో అక్షరం అక్షరం పలకుతూ చెప్పాడు. అలాగే లండన్ లో నటన,నృత్యం నేర్చుకున్న చరణ్ తన తొలి దర్శకుడు పూరీ జగన్నాధ్ కి ధాంక్స్ చెపుతున్నాడు. తనలోని మల్టీ టాలెంట్స్ ని ప్రదర్శంచేలా కథ,కథనాలు సమకూర్చినందుకు ఆయన గొప్పతనాన్ని లెక్కించలేమంటున్నాడు. ఇక చిరుత సినిమాతో తాను,తన కుటుంబం చాలా తృప్తిగా ఫీలయ్యామని ఆ గంటలను గుర్తుచేసుకున్నాడు.

    నాన్నతో కలసి చెయ్యాలనే ఆలోచన
    ఇక తన తండ్రి తో కలిసే ఆలోచన అమితాబ్-అభిషేక్ జోడి తెరపై కనిపించినప్పుడల్లా కలిగేదని నవ్వుతూ చెప్పాడు. అలాగే తన తండ్రి డౌట్ లేకుండా చాలా గొప్ప నటుడుని చెప్తున్నాడు. అలాగే తాను ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటున్నానని,ఎత్తు పల్లాలను ఒకేలా చూడటం అలవాటు చేసుకోవాలని మనసులో మాటగా చెప్తున్నాడు.

    రాజకీయమంటే..
    పొలిటిక్స్ గురించి మాట్లాడుతూ ఇది ఓ విభిన్నమైన బంతాట అని అర్ధమైందని,తన తండ్రి సున్నితమైన మనస్సు గల వాడని ఎవరైనా భాధ పడుతుంటే చూడలేడని చెప్తున్నాడు. అలాగే రెగ్యులర్ పొలిటీషన్ లా మాత్రం చిరు బిహేవ్ చెయ్యడని హామీ ఇస్తున్నాడు.

    ఎస్.ఎస్.రాజమౌళి సినిమా...
    ఇక తన కొత్త చిత్రంలో తనది ఓ విభిన్న మైన పాత్ర అని నాలుగు వందల ఏళ్ళ క్రిందట ప్రారంభమైన కథ ఈ కాలానికి ముడిపడుతుందని వివరిస్తున్నాడు. అలాగే తన తదుపరి చిత్రం వేరే జెనర్ లో ఉంటుందని భాస్కర్ మంచి స్క్రిప్టుతో వచ్చాడని ఆనందంతోవివరించాడు.

    పర్శనల్ లైఫ్
    రెగ్యులర్ లైఫ్ ని మిస్సవుతున్న ఫీలింగ్ అప్పుడప్పుడూ కల్గుతుందనీ కానీ ఫారిన్ వెళ్ళి నప్పుడు ఆ ఇబ్బంది ఉండదని చెప్తున్నాడు.షాపింగ్ చెయ్యటం ఇష్టమని,వర్స్ చేయని రోజు స్ట్రెస్ ఫీలవుతానని, షూటింగ్ లో పాల్గొనే రోజు పెయిడ్ హాలిడే గా ఫీలవుతానని,తనకు అన్నిటికన్నా తన కుటుంబమంటే ప్రాణమని చెప్పుకొచ్చాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X