twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మహర్షి’ ఎఫెక్ట్: వీకెండ్ వ్యవసాయం షురూ... పులికించిపోయిన మహేష్ బాబు

    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాల ద్వారా సమాజంలో స్పూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఆయన చేసిన 'శ్రీమంతుడు' చిత్రం ఎంతో మంది తెలుగు వారు తమ ఊరికి కోసం ఏదైనా చేయాలనే దిశగా అడుగులు వేయించింది. మహేష్ బాబుతో పాటు పలువురు తమ సొంతూర్లను దత్తత తీసుకుని తమకు తోచిన సహాయం చేసి గ్రామాలను అభివృద్ధి పనులు చేపట్టారు.

    తాజాగా విడుదలైన 'మహర్షి' చిత్రం సైతం ప్రజలను మార్పు దిశగా అడుగులు వేయిస్తోంది. రైతుల విలువను తెలియజేస్తూ రూపొందిన ఈ చిత్రం నగరాల్లో ఉండే వారిని సైతం వ్యవసాయం చేసే దిశగా అడుగులు వేయిస్తోంది. ఈ సినిమా చూసి స్పూర్తి పొందిన నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, మరో అభిమాని అమిత్ సాజనె ఈ వీకెండ్ తన వ్యవసాయం క్షేత్రంలో వాలిపోయి పొలం దున్నుతూ కనిపించారు.

    వీకెండ్ వ్యవసాయం మొదలైందంటూ మహేష్ బాబు ట్వీట్

    వీకెండ్ వ్యవసాయం అనేది మొదలైంది. ఇలాంటి మార్పు కేవలం మన తరానికి మాత్రమే కాదు రాబోయే తరాలకు కూడా మంచి ప్రారంభం. ఒక భవిష్యత్ కోసం చొరవ తీసుకుని ముందు వచ్చినందుకు మధుర శ్రీధర్, అమిత్ సాజనె లాంటి వారిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

    రైతులకు కావాల్సింది సానుభూతి కాదు, గౌరవం


    తన పొలంలోకి వెళ్లి వ్యవసాయం చేస్తూ కనిపించిన నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి స్పందిస్తూ... ‘రైతులు మన నుంచి నాభూతి కోరుకోవడం లేదు. మన నుంచి గౌరవం కోరుకుంటున్నారు. మహర్షి సినిమా వల్ల ఒక మంచి ఆలోచన నాలో కలిగింది. ఇలాంటి సినిమా అందించిన మహేష్ బాబును అభినందించకుండా ఉండలేక పోతున్నాను. దర్శకుడు వంశీపైడిపల్లి, దిల్ రాజు నిజాయితీగా రైతుల సమస్యలను తమ సినిమాలో చూపించారు. ఇది నాకు ఎంతో నచ్చింది.' అని ట్వీట్ చేశారు.

    మనిషికి, భూమికి మధ్య వ్యవసాయ బంధం

    వ్యవసాయం అనేది మనిషికి, భూమికి మధ్య ఉన్న ఒక అద్భుతమైన రిలేషన్. మహర్షి సినిమా చూసిన వీకెండ్ వ్యవసాయం విషయంలో స్పూర్తి పొందాను. వ్యవసాయం చేయడం ప్రారంభించాను. అందరూ దీన్ని ఫాలో అవ్వండి అని తెలిపారు.

    మహర్షి

    మహర్షి

    మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా ‘మహర్షి' తెరకెక్కింది. పూజా హెడ్గే హీరోయిన్‌గా నటించగా... అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ఇంకా ఈ చిత్రంలో అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాతలు.

    English summary
    "Weekend Agriculture has caught up now & this is the beginning for a great future... not just for our generation but for generations to come... Big thumbs up to people like madhurasreedhar & amit5284sajane for taking this great initiative on their shoulders." Mahesh Babu tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X