For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కొడుకుని కాన్సర్ అని తెలిసినప్పుడు ఏం చెయ్యాలో అర్దం కాలేదు

  |

  సినిమా హీరో అనగానే వారి విలాస వంతమైన జీవితం, కళ్ళు మిరుమిట్లు గొలిపే సంపాదనా గుర్తొస్తాయి మనకు. అయితే గంభీరంగా, సంతోషంగా కనిపించే స్టార్లు కూడా మనలా భావోద్వేగాల కు స్పందిస్తారు...కన్నీళ్ళూ పెట్టుకుంటారు. కొన్ని విషాదాలని మోస్తూకూడా తెర మీద మాత్రం మనలని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు.

  సీరియల్ కిస్సర్ అనిపిలుచుకునే బాలీవుడ్ ముద్దుల హీరో ఇమ్రాన్ హష్మి కూడా తన జీవితం లోని అత్యంత విషాద కరమైన రోజులని ఒక పుస్తకంగా రాసాడు. "కిస్ ఆఫ్ లైఫ్" అన్న ఈ పుస్తకం లో క్యాన్సర్ భారిన పడ్ద తన తన ఆరేళ్ల కొడుకు అయాన్‌ క్యాన్సర్‌తో చేసిన పోరాటంపై ఇమ్రాన్‌ హష్మీ ఈ పుస్తకాన్ని రాశాడు.

  ఇమ్రాన్‌, పర్వీన్‌ షహానె దంపతులకు 2010 ఫిబ్రవరిలో అయాన్‌ జన్మించాడు. అయాన్‌ తన నాలుగవ ఏటనే క్యాన్సర్‌ వ్యాధి బారిన పడ్డాడు. ఈ వ్యాధి, చికిత్స సమయంలో తమ ముద్దుల తనయుడు ఎంతో బాధను అనుభవించాడని, అది చూసి చలించిపోయి తానీ పుస్తకం రాశానని ఇమ్రాన్‌ తెలిపాడు.

  ముద్దుల హీరో వేదన ఆ పుస్తకం :ఇమ్రాన్ హష్మీ

  ముద్దుల హీరో వేదన ఆ పుస్తకం :ఇమ్రాన్ హష్మీ "కిస్ ఆఫ్ లైఫ్" లో గుండెని పిండే విషయాలు (ఫొటో స్టోరీ )

  కొన్నేళ్ల క్రితం వరకూ చాలామంది కలలుగనే జీవితం నాది. బాలీవుడ్‌ ప్రపంచంలో పేరున్న హీరోని. దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు. డబ్బుకూ కొదవలేదు. నా భార్యా, కొడుకుతో చాలా సంతోషంగా ఉండేవాణ్ణి.

  ముద్దుల హీరో వేదన ఆ పుస్తకం :ఇమ్రాన్ హష్మీ

  ముద్దుల హీరో వేదన ఆ పుస్తకం :ఇమ్రాన్ హష్మీ "కిస్ ఆఫ్ లైఫ్" లో గుండెని పిండే విషయాలు (ఫొటో స్టోరీ )

  ఓ రోజు అయాన్‌కు ఒంట్లో బాలేదంటే ఆసుపత్రికి తీసుకెళ్లి టెస్టులు చేయించాం. వాడికి కిడ్నీలో క్యాన్సర్ గడ్డ ఉందని.. వెంటనే సర్జరీ చేసి తీసేయాలని వైద్యులు చెప్పడంతో ఏం మాట్లాడాలో తెలియలేదు. నా కుటుంబానికి ఇలాంటి కష్టం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి కావడంతో నా కొడుకు నాకు దక్కడేమో అని వణికిపోయాను.

  ముద్దుల హీరో వేదన ఆ పుస్తకం :ఇమ్రాన్ హష్మీ

  ముద్దుల హీరో వేదన ఆ పుస్తకం :ఇమ్రాన్ హష్మీ "కిస్ ఆఫ్ లైఫ్" లో గుండెని పిండే విషయాలు (ఫొటో స్టోరీ )

  కానీ తప్పు నాది కాదు... క్యాన్సర్‌ది. ప్రపంచం తెలీని ఆ పసివాడికి సోకిన క్యాన్సర్‌ నా జీవితాన్ని తలకిందులు చేసింది.

  ముద్దుల హీరో వేదన ఆ పుస్తకం :ఇమ్రాన్ హష్మీ

  ముద్దుల హీరో వేదన ఆ పుస్తకం :ఇమ్రాన్ హష్మీ "కిస్ ఆఫ్ లైఫ్" లో గుండెని పిండే విషయాలు (ఫొటో స్టోరీ )

  క్యాన్సర్‌కి సంబంధించిన రకరకాల పుస్తకాలు చదివా. చాలా మంది నిపుణులను కలిశా. ఎన్నో పరిశోధనలూ, అధ్యయనాల సారాంశాలను తిరగేశా. వైద్యుల మాటలూ, పుస్తకాల్లోని విషయాలూ క్యాన్సర్‌ని తొలిరోజుల్లో గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చనే చెబుతున్నాయి.

  ముద్దుల హీరో వేదన ఆ పుస్తకం :ఇమ్రాన్ హష్మీ

  ముద్దుల హీరో వేదన ఆ పుస్తకం :ఇమ్రాన్ హష్మీ "కిస్ ఆఫ్ లైఫ్" లో గుండెని పిండే విషయాలు (ఫొటో స్టోరీ )

  కానీ నాకు మాత్రం ఏదో తెలీని భయం వెంటాడుతూనే ఉండేది. "అయాన్‌కి క్యాన్సర్‌ నయమైతే చాలు, నేను సిగరెట్లూ, మద్యానికి దూరంగా ఉంటా, క్యాన్సర్‌పైన అవగాహన కల్పించే సంస్థలతో కలిసి పనిచేస్తా, అసభ్యకర సినిమాల్లో నటించనూ" అంటూ రకరకాలుగా ప్రమాణాలు చేసుకునేవాణ్ణి.

  ముద్దుల హీరో వేదన ఆ పుస్తకం :ఇమ్రాన్ హష్మీ

  ముద్దుల హీరో వేదన ఆ పుస్తకం :ఇమ్రాన్ హష్మీ "కిస్ ఆఫ్ లైఫ్" లో గుండెని పిండే విషయాలు (ఫొటో స్టోరీ )

  నా పరిస్థితి అలా ఉంటే వాడు మాత్రం అవేవీ పట్టనట్టూ, అసలు వాడికి ఎలాంటి సమస్యా లేనట్టూ చాలా సంతోషంగా ఉండేవాడు. అంత కష్టంలో కూడా వాడి నవ్వు నాకు కొండంత ధైర్యాన్నిచ్చింది. వాడి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని అర్థమైంది.

  ముద్దుల హీరో వేదన ఆ పుస్తకం :ఇమ్రాన్ హష్మీ

  ముద్దుల హీరో వేదన ఆ పుస్తకం :ఇమ్రాన్ హష్మీ "కిస్ ఆఫ్ లైఫ్" లో గుండెని పిండే విషయాలు (ఫొటో స్టోరీ )

  ఓ రోజు సాయంత్రం నా కొడుకు అయాన్‌కి ఫోన్‌ చేసి... "హలో అయాన్‌...! నేను బ్యాట్‌మ్యాన్‌ని మాట్లాడుతున్నా. నువ్వు కూడా నాలా సూపర్‌హీరో కావాలంటే కొన్ని ట్యాబ్లెట్లు వేసుకోవాలీ, కొన్ని ఇంజెక్షన్లు చేయించుకోవాలీ, అమ్మానాన్నా ఏం చెప్పినా నో అనకుండా చేయాలీ" అంటూ చాలా విషయాలు చెప్పా. వాడు నన్ను నిజంగానే బ్యాట్‌మ్యాన్‌ అని నమ్మాడు. నేను చెప్పిన వాటన్నింటికీ సరేనన్నాడు. నాలుగేళ్ల నా కొడుక్కి అలా అబద్ధం చెప్పినందుకూ, అలా చెప్పాల్సి వచ్చినందుకూ కాసేపు నాకు కన్నీళ్లాగలేదు.

  ముద్దుల హీరో వేదన ఆ పుస్తకం :ఇమ్రాన్ హష్మీ

  ముద్దుల హీరో వేదన ఆ పుస్తకం :ఇమ్రాన్ హష్మీ "కిస్ ఆఫ్ లైఫ్" లో గుండెని పిండే విషయాలు (ఫొటో స్టోరీ )

  వాడికి సర్జరీ జరుగుతున్నపుడు నా బాధ వర్ణనాతీతం. హాస్పిటల్ అద్దంలోంచి బయటికి చూస్తుంటే రోడ్డు మీద తోపుడు బండి వాడు కూడా నాకంటే అదృష్టవంతుడిలాగే కనిపించాడు.

  ముద్దుల హీరో వేదన ఆ పుస్తకం :ఇమ్రాన్ హష్మీ

  ముద్దుల హీరో వేదన ఆ పుస్తకం :ఇమ్రాన్ హష్మీ "కిస్ ఆఫ్ లైఫ్" లో గుండెని పిండే విషయాలు (ఫొటో స్టోరీ )

  నర్సు వచ్చి డాక్టర్ నన్ను పిలుస్తున్నారని చెప్పింది. ఆయన దగ్గరికి వెళ్తే ఎదురుగా బాయ్ చేతిలో ఉన్న ట్రేలో రక్తంతో తడిసిన కాలేయం కనిపించింది. ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది. నా ముఖంలో రంగులు మారిపోయాయి.

  ముద్దుల హీరో వేదన ఆ పుస్తకం :ఇమ్రాన్ హష్మీ

  ముద్దుల హీరో వేదన ఆ పుస్తకం :ఇమ్రాన్ హష్మీ "కిస్ ఆఫ్ లైఫ్" లో గుండెని పిండే విషయాలు (ఫొటో స్టోరీ )

  ఐతే నా కంగారును గుర్తించిన డాక్టర్.. ఆ కాలేయం మరో పిల్లాడిదని.. నా కొడుకు సర్జరీ విజయవంతమైందని చెప్పారు. క్యాన్సర్ కణితిని పూర్తిగా తొలగించేశారు. ఆ తర్వాత కీమోథరెపీ కూడా చేశారు. వాడికి పూర్తిగా నయమైంది. అయాన్ పుట్టిన రోజు కంటే కూడా వాడికి సర్జరీ పూర్తయినపుడే నాకు ఎక్కువ సంతోషంగా అనిపించింది...

  ముద్దుల హీరో వేదన ఆ పుస్తకం :ఇమ్రాన్ హష్మీ

  ముద్దుల హీరో వేదన ఆ పుస్తకం :ఇమ్రాన్ హష్మీ "కిస్ ఆఫ్ లైఫ్" లో గుండెని పిండే విషయాలు (ఫొటో స్టోరీ )

  .ఇప్పుడు వాడి శరీరం నుంచి క్యాన్సర్‌ పూర్తిగా దూరమైంది. కానీ సకల సదుపాయాలూ, విలాసాల మధ్య పుట్టిన పిల్లాడు అంత నొప్పిని నవ్వుతూ భరించడం నాకెన్నో జీవిత పాఠాలు నేర్పింది. సమస్యలు ఎప్పుడు ఎవరికి ఏ రూపంలోనైనా రావొచ్చనీ, అన్నింటినీ నవ్వుతూ ఎదుర్కోవాలనీ అర్థమైంది..

  ముద్దుల హీరో వేదన ఆ పుస్తకం :ఇమ్రాన్ హష్మీ

  ముద్దుల హీరో వేదన ఆ పుస్తకం :ఇమ్రాన్ హష్మీ "కిస్ ఆఫ్ లైఫ్" లో గుండెని పిండే విషయాలు (ఫొటో స్టోరీ )

  ఇప్పుడు నా కొడుకు నాకో సూపర్‌హీరో. వాడు క్యాన్సర్‌ని ఎదుర్కొన్న తీరు కొన్ని వేల మందికి స్ఫూర్తినిస్తుంది అనిపించింది. అందుకే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటానికి ఇష్టపడని నేను, వాడి పోరాటాన్ని వివరిస్తూ "ది కిస్‌ ఆఫ్‌ లైఫ్‌" పేరుతో ఓ పుస్తకం రాశా. వాడు పెద్దయ్యాక దాన్ని చదివి "చిన్నప్పుడే నేను సూపర్‌హీరోని, ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు నన్నేమీ చేయలేవు" అని అనుకుంటే చాలు.

  ముద్దుల హీరో వేదన ఆ పుస్తకం :ఇమ్రాన్ హష్మీ

  ముద్దుల హీరో వేదన ఆ పుస్తకం :ఇమ్రాన్ హష్మీ "కిస్ ఆఫ్ లైఫ్" లో గుండెని పిండే విషయాలు (ఫొటో స్టోరీ )

  అయాన్‌ పూర్తిగా కోలుకున్నాక స్కూల్లో జరిగిన ఓ పరుగు పందెంలో మొదట నాలుగు అడుగులకే పడిపోయాడు. లేచి ఓ నాలుగు అడుగులు ముందుకేసి మళ్లీ పడిపోయాడు. అప్పటికే దాదాపు అందరూ పరుగు పూర్తిచేశారు. అయినా వాడు అధైర్య పడలేదు. పరుగు ఆపలేదు. నాతో పాటు ఇతర తల్లిదండ్రుల ప్రోత్సాహంతో శక్తినంతా కూడదీసుకుని చివరికి పరుగు పూర్తిచేశాడు. మనిషికి కావల్సిందీ, జీవితాన్ని నడిపించేదీ ఆ పోరాటమే అని మరోసారి నాకు గుర్తుచేశాడు.

  బిలాల్‌ సిద్దిఖి సహరచయితగా ఇమ్రాన్‌కు తోడ్పడ్డారు.అతను మామూలు మనిషి అయ్యేవరకు జరిగిన ప్రయాణాన్ని వివరిస్తూ "ది కిస్ ఆఫ్ లైఫ్" అనే పుస్తకం రాశాడు హష్మి. కొడుకు క్యాన్సర్ పోరాటం గురించి అతడు చెప్పిన మాటల్లో గుండెలు పిండే కొన్ని విషయాలు..

  English summary
  The 36-year-old Mr X star, who is married to Parveen Shahani for nine years now and is a proud parent to a son, thanked the publisher and co-writer of the book.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X