»   » కృష్ణం రాజు ఎందుకు మౌనం గా ఉన్నారు? మంచు విష్ణు ఏం మాట్లాడడేమిటీ..?

కృష్ణం రాజు ఎందుకు మౌనం గా ఉన్నారు? మంచు విష్ణు ఏం మాట్లాడడేమిటీ..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొన్ని సంవత్సరాల క్రితం ఆనాటి రెబెల్ స్టార్ కృష్ణం రాజు ప్రధాన పాత్రగా వచ్చిన భక్త కన్నప్ప అప్పట్లో మంచి విజయాన్నే అందుకుంది. అలాంటి ఈ కథను మళ్లీ తెరకెక్కించనున్నట్టు మోహన్ బాబు నిర్మించి నటించిన 'పెదరాయుడు' చిత్రం 20 వసంతాలను పూర్తిచేసుకున్న సందర్భంలో మంచు విష్ణు ప్రకటించాడు.

ఈ సినిమాలో విష్ణు కథానాయకుడిగా కనిపించనున్నట్టు, . 24 ఫ్రేమ్స్ బ్యానర్ పైన హాలీవుడ్ స్టూడియో భాగస్వామ్యంతో వివిధ భాషా ప్రేక్షకుల ముందుకు భక్త కన్నప్పను తీసుకువచ్చేలా మోహన్ బాబు ప్లాన్ చేసారనీ.,ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందనుందనీ, హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేయనున్నారని వార్తల మీద వార్తలు వచ్చాయి.

krishnam raju

అయితే దీనిక‌న్న ముందే త‌నికెళ్ల భ‌ర‌ణి సునీల్ తో "భ‌క్త క‌న్న‌ప్ప" తీయాల‌ని స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నాడు. సునీల్ కూడా చేయ‌డానికి ఉత్సాహంగా ముందుకొచ్చాడు. కానీ బ‌డ్జెట్ స‌మ‌స్యతో త‌నికెళ్ళ భ‌రణి వెన‌క్కి త‌గ్గారు. అయితే ఈ త‌రువాత ఈ ప్రాజెక్ట్ ను, స్ర్కిప్ట్ ను మంచు ఫ్యామిలీ హ్యాండ్ ఓవ‌ర్ చేసుకుంది. ఇప్పుడు క‌న్న‌ప్ప‌గా సునీల్ ప్లేస్ లోకి మంచు విష్ణు వ‌చ్చి చేరాడు. ఈ సినిమాను ఎట్టి ప‌రిస్థితుల్లోనైనా చేసి తీర‌తాన‌ని మ‌రో సారి స్ప‌ష్టం చేసాడు మంచు విష్ణు. తన త‌రువాత సినిమా ఇదేన‌ని కూడా వెల్ల‌డించాడు . దర్శకుడిగా తనికెళ్ళ భరణి అనే టాక్ కూడా వినిపించింది.

ఐతే అదే టైం లో కృష్ణం రాజు సైతం ఈ ప్రాజెక్ట్ ను త‌ప్ప‌కుండా చేస్తాన‌ని, ఈ సినిమా ఎవ‌రు చేసినా కానీ, ప్ర‌భాస్ చేస్తే దాన్ని రేంజే వేరుగా ఉంటుంద‌ని, త‌న ద‌గ్గ‌ర స్ర్కిప్ట్ కూడా స్టోరీ బోర్డ్ తో స‌హా రెడీగా ఉంద‌ని కొద్దిరోజుల్లో తానూ రంగం లోకి దూకుతాననీ అన్నాడు.అయితే సదన్ గా ఏమైందో గానీ... ఆయన రంగం లోకి దూకకనూ లేదు.... ఇటు మంచువారుకూడా ఇక మళ్ళీ ఆ విశయం ఎత్తనూ లేదు.

అందుకు సంబంధించిన సందడి ఎక్కడా కనిపించడం లేదు. ఈ సినిమా గురించిన సమాచారమూ లేదు. దాంతో ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయా? లేదంటే ఆ ఆలోచనని పక్కన పెట్టేశారా? అనే సందేహం కొంతమందిలో తలెత్తుతోంది. మంచు ఫ్యామిలీ నుంచి గానీ, ఇటు రెబెల్ స్టార్ల నుంచి గానీ ఒక ఖచ్చితమైన ప్రకటన వస్తే తప్ప ఈ ప్రాజెక్ట్ విసయం లో క్లారిటీ వచ్చేలా లేదు...

English summary
Tollywood young Hero Manchu Vishnu announced that he is going to remake the move Bhakta Kannapa in Tanikella Bharani's Direction.. at the same Time Rebel Star Krisnam raju also announced the Same project With Prabhas. but Now both are became silent.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu