»   » అంత డబ్బులు లేదన్న అనుష్క, రుద్రమదేవికి రెమ్యూనరేషన్ ఎంత?

అంత డబ్బులు లేదన్న అనుష్క, రుద్రమదేవికి రెమ్యూనరేషన్ ఎంత?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒక సినిమాకు కమిట్ అయిందంటే ఆ సినిమా కోసం అనుష్క తనకు సాధ్యమైన మేరకు కష్టపడుతుంది. అనుష్క ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాహుబలి, రుద్రమదేవి సినిమాల కోసం ఆమె ఏళ్ల తరబడి శ్రమించింది. రెమ్యూనరేషన్ విషయంలో కూడా అనుష్క మరీ ఓవర్‌గా ఏమీ డిమాండ్ చేయదనే మంచి పేరు కూడా ఉంది.

‘రుద్రమదేవి' సినిమా విషయంలో దర్శక నిర్మాత గుణశేఖర్ ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదట. ముందు సినిమా పూర్తి చేయడండి...ఆ తర్వాత డబ్బలు గురించి ఆలోచిద్దామని ప్రోత్సహించిందట. కేవలం డబ్బు కోసం కాకుండా సినిమాపై అభిరుచితో పని చేసే అరుదైన యాక్టర్లలో అనుష్క ఒకరు అని అంటన్నారు ఇండస్ట్రీ వర్గాలు.


What is Anushka Shetty's remuneration for Rudramadevi

సినిమా సరిగా ఆడక పోతే రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చిన సందర్భాలేమైనా ఉన్నాయా? అనే ప్రశ్రకు అనుష్క సమాధానం ఇస్తూ...తిరిగి ఇచ్చేసే అంత డబ్బు నా దగ్గర లేదు. కథ నచ్చితే పారితోషికం గురించి పెద్దగా పట్టించుకోను అని అనుష్క స్పష్టం చేరారు. ఈ సినిమా వదులుకోకూడదు అనేంత గొప్ప కథ అయితే అసలు పారితోషికమే అడగను. ఫ్రీగా చేస్తానంటే చాలా మంది నిర్మాతలు వెంట పడతారు' అంటోంది.


ఒక సినిమాకు పని చేస్తున్నపుడు టీం బావుండాలని కోరుకుంటాను. సినిమా ఫలితం ఎలా ఉన్న మా మధ్య సంబంధబాంధవ్యాలు కలకాలం కొనసాగాలని కోరుకుంటాను. ‘వర్ణ' సినిమా సరిగా ఆడక పోయినా ఆ టీంతో స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది అని అనుష్క తెలిపారు.


అనుష్క నటించిన ‘రుద్రమదేవి' చిత్రం ప్రస్తుతం విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమా కోసం అనుష్క దాదాపు రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్. అంతకు ముందు అనుష్క నటించిన ‘బాహుబలి' చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. త్వరలో మొదలయ్యే ‘బాహుబలి-2'లో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోంది.

English summary
There were reports that Anushka acted in Rudramadevi without taking any remuneration. Denying all these reports as rumors, she said that she does not have a big heart to act without taking remuneration. She also said that she will take the remuneration based on her hard work.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu