»   » ‘చందమామ కథలు’ మూవీలో మందు కొడుతూ మంచు లక్ష్మి

‘చందమామ కథలు’ మూవీలో మందు కొడుతూ మంచు లక్ష్మి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'ఎల్బీడబ్ల్యూ' చిత్రంతో దర్శకుడిగా పరిచయమై 'రొటీన్‌ లవ్‌స్టోరీ' చిత్రంతో కమర్షియల్‌ సక్సెస్‌ను అందుకున్న ప్రవీణ్‌ సత్తారు తాజాగా తెరకెక్కిస్తున్న మూడవ చిత్రం 'చందమామ కథలు'. ఎ వర్కింగ్‌ డ్రీమ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై చాణక్య బూనేటి నిర్మిస్తున్నారు. మంచు లక్ష్మిప్రసన్న, చైతన్య కృష్ణ, సీనియర్‌ నటుడు నరేష్‌, ఆమని, కృష్ణుడు, కిశోర్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రం చిత్రీకరణ పూర్తయిన నేపథ్యంలో సినిమాకు సంబంధించిన న్యూస్టిల్స్ విడుదల చేసారు. ఇందులో మంచు లక్ష్మి మందుకొడుతున్నట్లు ఉన్న సన్నివేశాలు.... సినిమా ఏ విధంగా ఉండబోతోందనే ఆసక్తిని రేపుతున్నాయి. 'చందమామ కథలు' చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సినిమాకు సంబంధించిన వివరాలను చిత్ర యూనిట్ సభ్యులు ప్రెస్ నోట్ రూపంలో విడుదల చేసారు. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన వివరాలు, ఫోటోలు...

చంద్రమామ కథలు ప్రెస్ నోట్

చంద్రమామ కథలు ప్రెస్ నోట్


ఒక ప్రవక్త అన్నాడు, జీవితంలోజరిగేవరుస సంఘటనలు మనలోఒక నమ్మకానికి దారితీస్తాయి, ఒక్కసారి ఆ నమ్మకం నిజమనిబలంగా విశ్వసిస్తే, ఆ నిజాన్నిబతికించడానికి ప్రపంచం నీకోసం సంభవిస్తుంది అని. అయితే ఆ నమ్మకాన్ని ఎంత బలంగా నమ్మగలం? నమ్మిన దానికోసం ఎంత పనంగా పెట్టగలం, ఎంత దూరం వెళ్ళగలం? అంతర్లీనమైన ఈ నిరంతర మానసిక సంఘర్షణ తో పాటు అనంతమైన విశ్వంలో మన ఆధీనంలోనే ఉంది అనుకుంటున్న మన నలుసంత జీవితాన్ని ఒక రచయిత ద్వారా ఆవిష్కరించే ప్రయత్నమే మా ఈ "చందమామ కథలు".

చంద్రమామ కథలు ప్రత్యేకత

చంద్రమామ కథలు ప్రత్యేకత


ఈ చిత్రం ఒక పవనం...మురికి వాడల నుంచి మహా సంపన్నుల వరకు, అమాయకత్వం నుంచి అహంకారం వరకు, పడుచు వయసు నుంచి పండు ముసలి వరకు సాగే ప్రయాణం... మనం రోజూ చూస్తూ గమనించని వ్యక్తుల జీవితాలని, రోజూ చేస్తూ దృష్టి పెట్టని పనుల పర్యవసానాన్ని ప్రతిస్పుఠిస్తూ, సమాజం లోని అందం, ఆశ, అబద్ధం, బంధం, బాంధవ్యం, నమ్మకం, మోసం, పేదరికం అనే ఎనిమిది అసమానతలని సమానంగా, అంతర్భాగంగా, అతిసహజంగా,ఆహ్లాదకరంగా పొందుపరిచిన వైనం ఈ చిత్రం యొక్క ప్రత్యేకత.

కాన్సెప్టు ఏమిటి?

కాన్సెప్టు ఏమిటి?


మనం లోతుగా గమనించినట్లయితే ప్రచార చిత్రం లోని ఎనిమిది గడులు ఎనిమిది కథల మరియు పాత్రల దృశ్యరూపాలు అని స్పష్టం అవుతుంది, మన కళ్ళు మోసం చేసినట్టు గా మనల్ని ఇంకెవరు మోసం చేయరు అంటారు...నిజమే, మనకు కనపడుతోంది చాలా చాలా తక్కువ, కనపడని భావోద్వేగాలు, కనిపిస్తూ కనిపించని మానవత్వాలు అన్నీ కలిపి...మనకు కనిపించబోయే ఈ "చందమామ కథలు".

మంచు లక్ష్మీ..

మంచు లక్ష్మీ..


ఈ చిత్రంలో చేసిన క్యారెక్టర్‌ గతంలో ఎప్పుడు చేయలేదు. మంచి చిత్రమవుతుందనే నమ్మకం ఉందని నటి ఆమని అన్నారు. దర్శకుడు చెప్పన కథ నచ్చి ఈ చిత్రం చేస్తున్నానని మంచు లక్ష్మీప్రసన్న తెలిపారు.

నరేష్ మాట్లాడుతూ..

నరేష్ మాట్లాడుతూ..


సీనియర్‌ నటుడు నరేష్‌ మాట్లాడుతూ... యూత్‌కి మంచి ఫీల్‌నిచ్చే స్టైలిష్‌ సినిమా. ఫ్రెష్‌ స్టోరీతో డిఫరెంట్‌ ఫ్లేవర్‌ ఉన్న చిత్రమిది. నెక్స్ట్‌ జనరేషన్‌కి బాగా కనెక్ట్‌ అవుతుంది. ఆమని, నేనూ పెయిర్‌గా చేస్తున్నాం అన్నారు.

దర్శకుడు

దర్శకుడు


దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు మాట్లాడుతూ... ప్రతి మనిషి నిత్య జీవితంలో ఎన్నో చోట్ల తనకి తారసపడే వ్యక్తుల ద్వారా, ఎదురయ్యే సంఘటనల ద్వారా సమాజంలో మంచి చెడుల్ని చూస్తుంటాడు. వాటి మధ్య వ్యత్యాసాలను తెలుసుకొని మరి కొన్నింటిని నేర్చుకుంటుంటాడు. అలాగే కొన్ని అనుభవాలను కూడా సంపాదిస్తుంటాడు. అటువంటి కొన్ని పాత్రల అనుభవాలు, పర్యావసనాలు, ఫలితాల సమాహారమే 'చందమామ కథలు'. సినిమా కథాంశం. అన్నారు.

షూటింగ్ పూర్తి

షూటింగ్ పూర్తి


దర్శకుడు మాట్లాడుతూ... నేనేం చెప్పాలనుకున్నానో... దాన్ని క్లారిటీగా తెరకెక్కించగలిగాను. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల రెండు లేదా మూడో వారంలో లోగో లాంఛ్‌ చేసి త్వరలో సినిమా విడుదల చేస్తాం అన్నారు.

నిర్మాత

నిర్మాత


నిర్మాత చక్రి బూనేటి మాట్లాడుతూ... అనుకున్న సమయంలో అనుకున్న బడ్జెట్‌లో సినిమా పూర్తయింది. అందుకు ప్రవీణ్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జనవరి రెండో వారంలో పాటల్ని విడుదల చేసి అదే నెలాఖరులో సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తాం అని తెలిపారు.

నటీనటులు, టెక్నీషియన్స్

నటీనటులు, టెక్నీషియన్స్


వెన్నెల కిషోర్‌, అభిజిత్‌, నాగశౌర్య, అమితారావ్‌, కొండవలస, నరసింహరాజు, రిచా పనరు, పృథ్వి, రాళ్లపల్లి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:మిక్కీ జె మేయర్‌, ఎడిటింగ్‌:ధర్మేంద్ర కాకర్ల.

English summary
Is someone’s Belief in VIRTUE more important than VIRTUE itself? Do rational thoughts destroy your soul? The depth of these questions cannot be scaled. The Interpretation of these facts seem normal, But it is going to be visible only to those who wish to see it. Experience will only teach us, ’what not to do’, But ‘not what to do’. Chandamama Kathalu is a paradox of a writer’s point of view about life and his journey towards the path of enlightenment that we humans are mire particles in the greater aspect of the universe and forces beyond our imagination. The Real treasure of the movie is the apodictic situations and Philosophical Facts, which hide behind a mask of casual conversation and Real life Actions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu