'లెజెండ్'లో బాలకృష్ణ టాటూ గురించి బోయపాటి

బాలకృష్ణ మాట్లాడుతూ ''నాన్నగారి రోజుల నుంచి మాకు బలాన్నిస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు. ఈ చిత్రంలో దేవిశ్రీప్రసాద్ మంచి సంగీతాన్ని అందించాడు. తన తండ్రిపేరును నిలబెడుతున్నాడు. రామజోగయ్య శాస్త్రి రాసిన పాటలు చాలా బాగున్నాయి. ఇందులో జగపతిబాబుది ప్రతి నాయక పాత్ర అని చెప్పను. నాతో సమానమైన పాత్ర అది. వాళ్ల నాన్నగారు స్థాపించిన సంస్థలో నేను రెండు సినిమాలు చేశాను. దర్శకుడు బోయపాటి గుంటూరు మిరపకాయ్ లాంటివాడు. అభిమానులకిది పంచ భక్ష పరమాన్నంలాంటి సినిమా. కుర్రాళ్లకు ఏం కావాలో నాకు బాగా తెలుసు. నేను కూడా చిన్నపిల్లాడిలా మారిపోయి ఇందులో నటించాను. వయసుతో సంబంధం లేకుండా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం నా అలవాటు. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది. అభిమానుల బలమే కొండంత అండ. నా అభిమానులు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటున్నారు. వారందరికీ నేను ఎప్పుడూ అండగా ఉంటా'' అన్నారు. సెంటరైనా స్టేటైనా.. పొజిషన్ అయినా అపోజిషన్ అయినా.. పవర్ అయినా పొగరైనా... నేను వచ్చేవరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్. హిస్టరీ రిపీట్స్'' అన్నారు బాలకృష్ణ.
''నేనూ నాన్నగారి అభిమానినే. ఆయన చిత్రరంగానికి చేసిన సేవలు మరువలేనివి. ఆవేశం, ఆలోచన ఎన్టీఆర్‌గారి తర్వాతే పుట్టాయి. ఆయన రాజకీయంగా ఓ చరిత్ర సృష్టించారు. మనకే కాదు ప్రపంచం మొత్తానికీ ఎన్టీఆర్‌గారే నిజమైన 'లెజెండ్'' అన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన హీరోగా నటించిన చిత్రం 'లెజెండ్'. సోనాల్ చౌహాన్, రాధికా ఆప్టే హీరోయిన్స్ . జగపతిబాబు విలన్ గా నటించారు. బోయపాటి శ్రీను దర్శకుడు. 14 రీల్స్, వారాహి చలన చిత్ర సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూర్చారు.


Click it and Unblock the Notifications











