twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్కార్ కి ‘ఈగ’ఎంపికకాకపోవటంపై రాజమౌళి

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఆస్కార్ అవార్డ్స్ విభాగంలో 'ఉత్తమ విదేశీ చిత్రం' విభాగానికి సంబంధించిన నామినేషన్ కోసం మన భారతదేశం నుంచి ఎంపిక చేసే చిత్రాలలో 'ఈగ' ఉంటుందని అంతా భావించారు. అయితే 'ఈగ'ని కాదని హిందీ చిత్రం 'బర్ఫీ' కి ఈ అవకాసం లబించింది. ఈ నేపధ్యంలో 'ఈగ' దర్శకుడు రాజమౌళిని మీడియా వారు ఈ విషయమై ప్రశ్నించారు. దానికాయన తాను నిరాశచెందలేదని,త్వరలోనే బర్ఫీ చిత్రం చూస్తానని అన్నారు. ఇలియానా నటించిన తొలి హిందీ సినిమా 'బర్ఫీ'. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ అవార్డుల బరిలోకి భారతదేశం తరఫున చిత్రం దిగబోతోంది. 2012 సంవత్సరానికిగానూ 'బర్ఫీ' చిత్రాన్ని ఎంపిక చేసినట్టు హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆస్కార్‌ జ్యూరీ ఛైర్‌పర్సన్‌ మంజు బోరా తెలియచేసారు.

    ఇక రాజమౌళి మాటల్లో...' నేను అవార్జుల కోసం ఎప్పుడూ వర్రీ అవను. నాకు సెలక్షన్ ప్రొసీజర్ తెలుసు. నాకు ఎక్సపెక్టేషన్స్ ఎమీ లేవు. కాబట్టి అసలు నేను నిరాశ చెందే అవకాసమే లేదు. ఎప్పుడైతే ఎక్సపెక్టేషన్స్ ఉండవో అప్పుడు నిరాశకూడా ఉండదు. నేను త్వరలోనే 'బర్ఫీ' చిత్రం చూస్తాను. అయితే ఈ చిత్రం ఆస్కార్ కి నామినేట్ అయినందుకు కాదు..బాగుందని మంచి రివ్యూలు వచ్చినందుకు..' అంటూ మీడియాతో మాట్లాడారు.

    మంజు బోరా మాట్లాడుతూ ''మొత్తం 20 ఎంట్రీలు వచ్చాయి. వాటిలో 'బర్ఫీ' చిత్రాన్ని ఎంపిక చేశాం. మానవ సంబంధాలకు ప్రాధాన్యమున్న చిత్రమిది. మన దేశం స్థితిగతుల్ని కూడా ప్రతిబింబించేలా తెరకెక్కించారు. అందుకే ఈ సినిమాని ఎంపిక చేశాము. మేం చూసిన అన్ని చిత్రాలు బాగున్నాయి. కానీ అకాడమీ అవార్డ్స్ కమిటీ నిబంధనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆ మేరకు 'బర్ఫీ'ని ఎంపిక చేశాం. ఆస్కార్ నామినేషన్‌కు పంపించడానికి సినిమా కథ, నాణ్యత ముఖ్యం. 'బర్ఫీ'లో ఇవి మెండుగా ఉన్నాయి. మానవీయ విలువలను అద్భుతంగా చూపించిన చిత్రం ఇది'' అన్నారు.

    ఎప్పుడూ కూడా హిందీ సినిమాలకే అవకాశాలిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి కదా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ''సినిమాలో ఉన్న విషయం, విలువల్నిబట్టే ఎంపిక జరుగుతుంది. అంతే కానీ భాషతో సం బంధమేమీ లేదు'' అన్నారు. మన సినిమాలు ఆస్కార్‌లో చివరి వరకూ నిలవలేకపోతున్నాయి కదా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ''సినిమాని ఎంపిక చేయడం వరకే మా బాధ్యత. అక్కడ ఆస్కార్‌ వేదికపైకి చేరడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తే బాగుంటుంది'' అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి నిర్మాత 'స్రవంతి' రవికిశోర్‌ ఆ జ్యూరీలో ఉన్నారు.

    English summary
    ‘I was never worried about these Awards. Neither do I know about the selection procedures nor do I have any expectations, so there is no word of upsetting. When there are no expectations, there will be obviously no disappointments. I will watch ‘Barfi’ soon not because it is selected for Oscars but the movie has got good reviews,’ rajamouli reacted as per a media report.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X