For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వాడిగదిలో వయాగ్రా చూసాను, అప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నా: డేరా బాబా పై రాఖీ తీవ్ర వ్యాఖ్యలు

  |
  వయాగ్రా చూసాను : డేరా బాబా పై రాఖీ Rakhi Sawant comments on Gurmeet Ram Rahim

  రాఖీసావంత్ ఒక్కోసారి ఈ ఐటం గాళ్ కి తానేం మాట్లాడుతుందో తనకే అర్థం కాదు. డేరాబాబా తనకి మంచి మిత్రుడనీ, ఆయన మీద వచ్చిన ఆరోపణలు అసత్యమని తేలి శిషనుంచి బయటపడాలని కోరుకుంటున్నానీ చెప్పి నెలకూడా గడవకముందే మళ్ళీ ఇప్పుడు డేరాబాబా లీలలన్నీ తనకు ముందే తెలుసుననీ, తన సినిమాలో అవన్నీ బయట పెట్తబోతున్నాననీ ఇంకో ప్రకటన చేసింది. అసలు పొంతనే లేని ఈ వ్యాఖ్యలకి విస్తుపోవటం ఇప్పుడు జనం వంతయ్యింది.

  డేరా బాబా జీవిత చరిత్ర

  డేరా బాబా జీవిత చరిత్ర

  డేరా బాబా జీవిత చరిత్రని తెరకెక్కించే పనిలో ఉన్న రాఖీ ఢిల్లీలో ఈ బయోపిక్ షూట్ జరుగుతున్న స్పాట్ కెళ్లిన మీడియాతో మాట్లాడింది.. గుర్మీత్ సింగ్‌కు సంబంధించి కొన్ని 'నగ్న'సత్యాలను విడమర్చి చెప్పింది. ''సినిమా పేరు ' స్కాండల్ అబ్ ఇన్సాఫ్ హోగా'. మా బ్రదర్ రాకేష్ సావంత్ డైరెక్ట్ చేస్తున్నాడు.

  బాబా మీద బయోపిక్

  బాబా మీద బయోపిక్

  గుర్మీత్ బాబా మీద బయోపిక్ తీయడానికి నాకు సెంట్ పర్సెంట్ అర్హత ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే.. అతణ్ణి, అతడి చీకటి రాజ్యాన్ని దగ్గరినుంచి చూసిన అనుభవం నాకుంది. నాతో కూడా హనీప్రీత్ తన కూతురుగా పరిచయం చేసుకున్నాడు.. కానీ ఆ తర్వాతే తెలిసింది వాళ్ళిద్దరి అసలు 'రంగు'. బాబాను కలుద్దాం రమ్మంటూ వాళ్ళ పీఏ నన్ను మారియట్ హోటల్‌కి పిలిపించుకున్నాడు'' అంటూ ఒక్కటొక్కటిగా గుర్మీత్ రహస్యాలను విప్పి చెప్పింది.

  డేరా బాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీం సింగ్

  డేరా బాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీం సింగ్

  ఈ మధ్యకాలలో ఇండియాలో సంచలనం సృష్టించిన వ్యవహారం ఏదన్నా ఉంది అంటే డేరా బాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ అరెస్టు అని తడుముకోకుండా చెప్పవచ్చు. అత్యాచారం కేసులో జైలుపాలై 20 ఏళ్ల జైలు శిక్షకు గురైన డేరా బాబా అరెస్టు టైం లో జరిగిన ఘోరమైన పరిణామాలు అంతా ఇంతా కాదు.

  హనీ ప్రీత్ ఇన్సాన్

  హనీ ప్రీత్ ఇన్సాన్

  డేరా బాబా సినిమా అంటే మరి సంచలనమే కదా మరి ఇప్పుడు ఆ సినిమాలో డేరా బాబా పాత్రలో ఎవరు నటిస్తున్నారు అంటే . డేరా బాబా పాత్రలో సంజయ్ గోరీ నటిస్తుండగా అతడి దత్త పుత్తికగా చెప్పబడుతున్న హనీ ప్రీత్ ఇన్సాన్ పాత్రను రాఖీ సావంత్ పోషిస్తోంది. ఈ సినిమాలో కేసు విచారణాధికారిగా ఎజాజ్ ఖాన్ నటిస్తున్నాడు. ఈ సినిమాని పూర్తి చేసి డిసెంబర్ మూవీ విడుదలయ్యేలా షెడ్యూల్ ప్లాన్ చేశారు.

  స్కాండల్ అబ్ ఇన్సాఫ్ హో గా

  స్కాండల్ అబ్ ఇన్సాఫ్ హో గా

  ఈ సంచలనాత్మక సినిమాకి " స్కాండల్ అబ్ ఇన్సాఫ్ హో గా' పేరు పెట్టారు. ఈ సినిమాలో హాట్ హాట్ క్లిప్స్ చుపిస్తార్తా లేక వాస్తవాలకి దెగ్గరగా తెరకేక్కిస్తారా అనేది హాట్ టాపిక్ అయ్యింది. డేరా బాబా కి దత్తపుత్రికగా చెప్పుకుంటున్న "హనీ ప్రీత్ సింగ్" కూతురా లేక మరేదన్నా సంభందం ఉందా అనే కోణాన్ని కూడా సినిమాలో చుపిస్తారట.

  వయాగ్రా పొట్లాలు

  వయాగ్రా పొట్లాలు

  'సిర్సాలోని అతడి డెన్‌లోకి కూడా నేను స్వయంగా వెళ్ళొచ్చాను. కానీ.. అక్కడ వయాగ్రా పొట్లాలు ఉండడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక సన్యాసికి, దైవాంశ సంభూతుడిగా చెప్పుకునే పెద్దమనిషికి 'వయాగ్రా'తో పనేంటి.. అన్న సందేహం నాకు అప్పుడే కలిగింది. అక్కడే నిర్ణయించుకున్నా.. ఏదోఒకరోజు వీడి కథ నేనే ప్రపంచానికి చెప్పేస్తానని.

  నా మనసు చలించింది

  నా మనసు చలించింది

  వీడిచ్చే ఫారిన్ విస్కీ బాటిళ్లకు ఆశపడి సొంత ఆడబిడ్డల్ని ఇక్కడికి పంపే 'భక్తులను' చూసి నా మనసు చలించింది.'' అంటూ ఆవేదనతో చెప్పింది రాఖీ సావంత్. అంటే నిన్నామొన్నటిదాకా ఆయన నా మిత్రుడూ, ఆయన బయటికి రావాలని కోరుకుంటున్నా లాంటి మాటలెందుకు చెప్పినట్టో. ఒక వేళ డేరాబాబా నిజంగానే బయటికి వచ్చి ఉండి ఉంటే ఈవిడ గారి సినిమా పేరు ఏదై ఉండవచ్చో మరి.

  English summary
  Rakhi Sawant, while revealing that she found Viagra, a medication used to treat erectile dysfunction in Gurmeet Ram Rahim Singh's room
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X