twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇద్దరు హీరోలు కలిసి వచ్చిన వేళ.... బాహుబలి-2 & ఓప్పో ఎఫ్ 3

    బాహుబలి సినిమా కోసం భారతదేశ ప్రజలు ఎంత ఆసక్తిగా ఎదురు చూసారో.... ఒప్పో మొబైల్ బ్రాండ్ నుండి వస్తున్న ఒప్పో ఎఫ్ 3 కోసం కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాహుబలి-1 రిలీజైన సమయం జులై, 2015. భారీ విజయం సాధించింది. సినీ విమర్శకుల నుండి పాజిటివ్ రివ్యూలు, అన్ని వర్గాల సినీ ప్రేక్షకుల నుండి ప్రశంసలు అభినందనలు అందుకుంది ఈ చిత్రం.

    మొదటి భాగం చూసిన ప్రేక్షకుల్లో 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?' అనే ప్రశ్న తలెత్తింది. దానికి రెండో భాగంలో సమాధానం దొరుకుతుందని చిత్ర యూనిట్ ప్రకటించడంతో పార్ట్-2 సినిమా కోసం రెండేళ్ల పాటు అందరూ ఎదురు చూసారు.

    మొత్తానికి 'బాహుబలి-ది కంక్లూజన్' సినిమా విడుదలతో మొదటి భాగంలో సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికింది. ఇండియన్ సినీ చరిత్రలో ఇంతకుముందెన్నడూ లేనంత అద్భుతంగా, యూనిక్ గా సినిమా ఉండటంతో సూపర్ హిట్ అయింది.

    When Two Heroes Come Together – Baahubali 2 & OPPO F3

    1. 4k హై డిఫనేషన్ ఫార్మాట్ లో విడుదలైన తొలి ఇండియన్ మూవీ 'బాహుబలి-2’. సినిమాలోని క్లిస్టర్ క్లియర్ గ్రాఫిక్స్ ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమాకు కీరవాణి అందించిన సంగీతం కూడా చాలా బావుండటంతో అందరూ ఆయనపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.

    2. ఇండియాలో భారీ ఖర్చుతో తీసిన మూవీ సిరీస్ కూడా ఇదే. సినిమాకు అయిన ఖర్చులో ఎక్కువ భాగం విజువల్ ఎఫెక్ట్స్ మీదే పెట్టారు. తద్వారా ఇప్పటి వరకు ఇండియన్ సినిమాల్లో చూడని అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులు చూసారు.

    3. సినిమాలో నటీనటులు వాడిన డ్రెస్సులు, కాస్టూమ్స్ కూడా చర్చనీయాంశం అయ్యాయి. అనుష్క, తమన్నా ధరించిన చీరలు, ఇతర కాస్టూమ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

    4. మొదటి భాగం చూసిన ప్రేక్షకలు రెండో భాగంలో కూడా భారీ యుద్ధ సన్నివేశాలు, అదిరిపోయే యాక్షన్ ఉంటుందని భావించారు. వారి అంచనాలకు తగిన విధంగానే సినిమా ఉండటంతో సూపర్ హిట్ అయింది.

    బాహుబలి సినిమా కోసం భారతదేశ ప్రజలు ఎంత ఆసక్తిగా ఎదురు చూసారో.... ఒప్పో మొబైల్ బ్రాండ్ నుండి వస్తున్న ఒప్పో ఎఫ్ 3 కోసం కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఒప్పో ఎఫ్ 3, బాహుబలి 2 కు మధ్య కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి.

    బాహుబలి-2 మరియు ఒప్పో ఎఫ్ 3 రిలీజ్ ముందే బాగా పాపులర్ అయ్యాయి. బాహుబలి ఇండియన్ సినీ చరిత్రలో తొలి 4k హై డిఫనెషన్ ఫార్మాట్ మూవీ. సినిమాలో బ్రిలియంట్ విఎఫ్ఎక్స్ టెక్నాలజీ, సినిమాటోగ్రఫీ వాడటంతో వీడియో గేమ్ రూపంలో కూడా బాహుబలి రిలీజ్ చేసారు.

    ఒప్పో ఎఫ్ 3 కూడా ఇండియాలో తొలి డ్యూయెల్ సెల్ఫీ కెమెరాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రెండు కెమెరాల్లో ఒకటి ఇండివిడ్యువల్ సెల్పీ కోసం అయితే... మరో కెమెరా గ్రూఫ్ సెల్పీ కోసం రూపొందించబడింది. పెర్ఫెక్ట్ సెల్పీ ఫోన్ గా ఈ మోడల్ కీర్తిగడించబోతోంది.

    బాహుబలి మేకర్స్ కు ఉన్న పాషన్ బెస్ట్ ఎంటర్టెన్మెంట్ ప్రేక్షకుడికి అందేలా దోహదం చేసింది. ఒప్పో ఎఫ్ 3 ఫోన్ మేకర్స్ పాషన్ వినియోగదారులకు బెస్ట్ సెల్ఫీ ఎక్స్‌పీరియన్స్ అందేలా చేసింది.

    సెల్పీ మరియు కెమెరా ఫోన్స్ కాన్సెప్టు ప్రధానంగా విఫణిలోకి దూసుకొచ్చిన తొలి తయారీదారు 'ఓప్పో' బ్రాండ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

    ఎక్సలెన్స్ అనే పదానికి సరైన అర్థం వచ్చేలా ఒప్పో బ్రాండ్ ఫోన్స్ రిలీజ్ చేస్తున్నారు. సెల్ఫీ క్లిక్కింగ్ ట్రెండ్ బాగా పెరిగిన నేపథ్యంలో... వినయోగదారుల అవసరాలకు తగిన విధంగా, వారి అభిరుచికి తగినట్లుగా ఒప్పో సంస్థ కెమెరా ఫోన్స్ తయారు చేస్తోంది.

    2.0 వెర్షన్ కు చెందిన ఒప్పో ఎఫ్ 3 కెమెరా ఫోన్ మే 4వ తేదీన లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సెల్పీ కెమెరా ఫోన్లు కావాలనుకునే వారికి ఒప్పో ఎఫ్ 3 మంచి ఆప్షన్ అని చెప్పక తప్పదు.

    బాహుబలి-2 సినిమాపై అంచనాలు ఎంత భారీగా ఉన్నాయో...... ఒప్పో ఎఫ్ 3 సెల్ఫీ కెమెరా ఫోన్ మీద కూడా అంచనాలు అదే రకంగా ఉన్నాయి. బాహుబలి-2 సినిమా మాదిరిగానే ఒప్పో ఎఫ్ 3 కూడా అభిమానులు సంతృప్తి పరుస్తుందని అంచనా వేస్తున్నారు.

    English summary
    Just like Baahubali, people are also looking forward to the launch of the new OPPO F3 phone. It is interesting to note that there are some common points between OPPO F3 and Bahubali 2.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X