»   »  మహేష్ 'శివం' ఎప్పుడు మొదలవుతుంది?

మహేష్ 'శివం' ఎప్పుడు మొదలవుతుంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్, క్రిష్ కాంబినేషన్ లో రూపొందనున్న 'శివం' చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. రీసెంట్ గా మహేశ్ సరసన 'శివం' చిత్రాన్ని చేయబోతున్న విషయాన్ని మరోసారి నిర్ధారించింది బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. దాంతో ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుందనే టాపిక్ అంతటా మొదలైంది.


అయితే సోనాక్షి మాటల్ని బట్టి 2014లో ఈ చిత్రం మొదలుకానున్నదని తెలుస్తోంది. 2013 చివరలో ఈ చిత్రం పూజతో ప్రారంభం చేసి...2014 ప్రారంభంలో రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితమే మహేశ్, సోనాక్షి జంటగా క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు నిర్మాత సి. అశ్వనీదత్ తెలిపారు.

సోనాక్షి మాట్లాడుతూ..."మహేశ్‌బాబుతో 'శివం' అనే సినిమాని వచ్చే ఏడాది చేయబోతున్నా. తెలుగు దర్శకుడు క్రిష్ దానికి డైరెక్టర్. స్క్రిప్టు తీసుకుని క్రిష్ నా వద్దకు వచ్చినప్పుడు సున్నితంగా ఆ ఆఫర్‌ను తిరస్కరించాలని అనుకున్నా. ఎందుకంటే ఈ ఏడాది హిందీ సినిమాలతో బాగా బిజీగా ఉన్నాను. అయితే క్రిష్ ఎప్పుడైతే స్క్రిప్టు చెప్పడం ప్రారంభించాడో, చాలా ఆసక్తికరంగా అనిపించి, వివరంగా చెప్పమన్నాను. ఆ తర్వాత అతను మూడు గంటలసేపు పూర్తి కథ చెప్పాడు. ఆ సినిమా చేయాలని అప్పుడే నిర్ణయం తీసేసుకున్నాను'' అని వివరించింది సోనాక్షి.

మరో ప్రక్క వంశీ పైడిపల్లి ఇప్పటికే మహేష్ బాబును కలిసి స్టోరీ వివరించాడు. వంశీ చెప్పిన కథకు మహేష్ బాబు బాగా ఇంప్రెస్ అయి, స్ర్కిప్టును పూర్తి వినోదాత్మకంగా డెవలప్ చేయాలని సూచించాడు. మహేష్ బాబు కోసం ఇప్పటికే స్టోరీ రెడీ చేసుకున్న వంశీ పైడిపల్లి, స్క్రిప్టు విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టబోతున్నారు. రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్టెనర్‌గా వైవిద్యమైన కథ, స్ర్కిప్టుతో ఈచిత్రాన్ని ప్లాన్ చేస్తాడని తెలుస్తోంది. అదే విధంగా మహేష్ బాబు లుక్ కూడా గత సినిమాలకు భిన్నంగా ఉండేలా చూసుకుంటున్నాడు.

ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో '1' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వరుస హిట్ సినిమాలతో దూసుకెలుతున్న మహేష్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్నాడు. '1' సినిమాతో మహేష్ తిరుగులేని హీరోగా మారతాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

English summary
Sonakshi Sinha confirms about Krish film. She says "I am doing a Telugu film next year with Mahesh Babu called Shivam, which will be directed by Telugu director Krish," she says and adds, "When Krish came to me with the script I thought I would politely decline, as I was too caught up with my Hindi films this year. But when he narrated the script, I was hooked and insisted that he tell me about it in detail. Over the next three hours he narrated the entire script to me and I thought I had to do this film."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu