»   » ఆ బిడ్డకు తల్లి హీరోయిన్ కాజలే.... రానా ఫన్నీ ట్వీట్!

ఆ బిడ్డకు తల్లి హీరోయిన్ కాజలే.... రానా ఫన్నీ ట్వీట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి-2 మూవీ విడుదలై దాదాపు నెల రోజులైనా చాలా మంది అభిమానులు ఆ మత్తు నుండి బయటకు రాలేదు. ఈ సినిమాలో సమాధానం దొకరని ప్రశ్నలకు జవాబుకోసం అన్వేషిస్తూనే ఉన్నారు.

'బాహుబలి 2' చిత్రం విడుదలైన తర్వాత.... భల్లాలదేవుడి భార్య ఎవరు? తనకొడుకైన భద్రకు ఎవరి ద్వారా జన్మనిచ్చాడు? అనే ప్రశ్నలు సోషల్‌ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ విషయమై కొన్ని రోజుల క్రితం రానాను ప్రశ్నిస్తే... సరోగసి విధానంతో 'భద్ర' పుట్టాడంటూ ఆ మధ్య సరదాగా బదులిచ్చారు.


ఆ బిడ్డకు తల్లి కాజల్ అంటూ..

ఆ బిడ్డకు తల్లి కాజల్ అంటూ..

తాజాగా రానా హీరోగా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి' టీజర్‌ విడుదలైన సందర్భంగా ఓ అభిమానిని రానాని ఓ ప్రశ్న వేశారు. ‘బాహుబలి 2లో భల్లాలదేవుడి భార్య ఎవరు? మీరు ఈ మిలియన్‌ డాలర్ల ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే' అని రానాకు ట్వీట్‌ చేశాడు. దీనికి రానా.. కాజల్‌ అంటూ సమాధానమిచ్చారు.


కాజల్ కూడా...

ఈ ట్వీట్‌ని కాజల్‌ అగర్వాల్‌ రీట్వీట్‌ చేస్తూ.. ‘ఇక నేనేం చెప్తాను. మాది జన్మ జన్మల అనుబంధం' అంటూ కామెంట్ చేయడం గమనార్హం. నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో జోడీగా నటిస్తున్నరానా, కాజల్ చేసిన ఈ ట్వీట్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.


నేనే రాజు నేనే మంత్రి

తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నేనే రాజు నేనే మంత్రి' చిత్రం టీజర్ ప్రముఖ నిర్మాత, రానా తాతయ్య డి. రామానాయుడు జయంతి సందర్భంగా రిలీజ్ చేశారు.


పొలిటికల్ థ్రిల్లర్

పొలిటికల్ థ్రిల్లర్

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, బ్లూ ప్లానెట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బాబు-కిరణ్ రెడ్డి-భారత్ చౌదరి నిర్మాతలు. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పోలిటికల్ థ్రిల్లర్ లో రాణా సరసన కాజల్ కథానాయికగా నటిస్తోంది.


రానా కెరీర్లో మైలు రాయి

రానా కెరీర్లో మైలు రాయి

సురేష్ బాబు మాట్లాడుతూ.. "రానా కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచిపోయే చిత్రం "నేనే రాజు నేనే మంత్రి" అన్నారు. రానా, కాజ‌ల్, అశితోష్ రాణా, కేథ‌రిన్ థెరిస్సా, న‌వ‌దీప్‌, పోసాని, జెపీ, ర‌ఘు కారుమంచి, బిత్తిరి స‌త్తి, ప్ర‌భాస్ శీను, శివాజీ రాజా, జోష్ ర‌వి, న‌వీన్ నేలి, ఫ‌న్ బ‌కెట్ మ‌హేష్ త‌దిత‌రులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.English summary
Baahubali 2 hit the screens a few weeks ago and SS Rajamouli's magnum opus answered the most-awaited question that kept millions of fans awaiting for almost two years - Why Kattappa killed Baahubali? The closely guarded secret was out on April 28, and since then the fans cannot stop raving about the second instalment of the franchise. While the second instalment gave a back story to many characters in the film, Baahubali 2 failed to bring to scene Bhallaladeva's wife. Who is Bhallaladeva's wife... Rana answer is Kajal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu