»   »  పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ మూవీకి డైరెక్టర్ అతడేనా?

పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ మూవీకి డైరెక్టర్ అతడేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ సొంత బేనర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి దర్శకుడు ఖరారైనట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారట.

త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాలని రామ్ చరణ్ చాలా కాలంగా ఆశ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కోరిక తీర్చేందుకు ఇద్దరితో సినిమా ప్లాన్ చేసారట పవర్ స్టార్. ఇటీవలే త్రివిక్రమ్ ఓ స్టోరీ లైన్ చెప్పగా పవన్‌కు బాగా నచ్చిందని, ఒకసారి చరణ్‌కు కూడా చెప్పాలని సలహా ఇచ్చినట్లు సమాచారం.

 Who is directs Pawan Kalyan-Ram Charan's Project

ప్రస్తుతం రామ్ చరణ్ శ్రీను వైట్లతో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టు తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. ఈ రెండు పూర్తయిన తర్వాత రామ్ చరణ్-త్రివిక్రమ్ మూవీ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమా చేయడంపై రామ్ చరణ్ స్పందిస్తూ...‘అవును నిజమే! కళ్యాణ్ బాబాయ్ తన ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయడం సంతోషంగా ఉంది. ఆయన ఫస్ట్ ప్రాజెక్టులో నేను భాగటం కావడం మరింత ఆనందంగా ఉంది. లవ్ యూ బాబాయ్' అని చెప్పుకొచ్చారు. అయితే ఆ సినిమాకు దర్శకుడు ఎవరు? అనే విషయం మాత్రం రామ్ చరణ్ వెల్లడించలేదు.

English summary
Reports are abuzz that Trivikram Srinivas who is a good friend of Pawan Kalyan will be directing Ram Charan's project under Pawan Kalyan Creative Works Pvt Ltd banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu