»   » జూ.ఎన్టీఆర్ ఎవరు? తెలియదే : డైరక్టర్ వివాద్పద కామెంట్ పై పెద్ద దుమారం

జూ.ఎన్టీఆర్ ఎవరు? తెలియదే : డైరక్టర్ వివాద్పద కామెంట్ పై పెద్ద దుమారం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రెండు రోజుల నుంచి ఎన్టీఆర్ అభిమానుల్లోనే కాక, మీడియా సర్కిల్స్ లో, సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలలో ఒకటే టాపిక్ రన్ అవుతోంది. అదే..అసలు జూ.ఎన్టీఆర్ ఎవరు, నాకు తెలియదే అని తమిళ స్టార్ డైరక్టర్ హరి అన్నారని. ఈ విషయమై సోషల్ మీడియాలో ఓ రేంజిలో పోస్ట్ లు పడుతున్నాయి.

సౌత్ ఇండియాలో పాపులర్ అయిన ఓ హీరోని , అతనెవరు అని అనటమేంటి, కావాలని అనటమే అంటున్నారు. అయితే యాంటి ఫ్యాన్స్ మాత్రం..ఎన్టీఆర్ కు ఉన్న పాపులారిటి ఇప్పుడు బయిటకు వచ్చింది అంటూ ప్రోపగాండ చేస్తున్నారు. ఇలా ఈ కామెంట్ పెద్ద దుమారమే రేపుతోంది.

సింగం సీరిస్ చిత్రాల ద‌ర్శ‌కుడిగా సౌత్ ఇండియాలో సూప‌ర్ పాపులారిటీ ఉన్న డైరక్టర్ హ‌రి తాజా ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయటం వివాదాస్పదంగా మారింది. సూర్య హీరోగా ఆయన రూపొందించిన సింగం 3 ప్రమోషన్ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నారంటూ వార్తలొస్తున్నాయి.

Who is NTR jr? I don't know him, Director Hari controversial comments

అందులో ఎంతవరకూ నిజముందని యాంకర్ అడిగిన ప్రశ్నకు హరి సమాధానమిచ్చారని చెప్తున్నారు. అస‌లు త‌న‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ గురించి తెలియదని, తననెప్పుడూ కలవలేదని కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై జూనియర్ ఫ్యాన్స్ గరంగరంగా ఉన్నారు.

ఇదిలా ఉంటే, హరి తన తదుపరి చిత్రం చియాన్ విక్రమ్‌తో ఉంటుందని ప్రకటించాడు. హ‌రి సినిమాలు తెలుగులో సైతం రిలీజ్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలో ఎన్టీఆర్ తెలియ‌ద‌ని చెప్ప‌డంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ సినీజ‌నాలు సైతం హ‌రిపై మండిప‌డుతున్నారు. అదండీ మ్యాటర్, గతంలో నిత్యామీనన్..ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ గుర్తు వస్తున్నాయి కదూ.

English summary
The shocking news is now spreaded among the social network stating out that Tamil famous director Hari has said he doesn't ever heard of the name of Telugu super star NTR jr.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X