»   »  పులి ప్రక్కన ఎవరు

పులి ప్రక్కన ఎవరు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Pawan Kalyan
చిరకాల విరామం తరువాత "ఖుషి" ఫేమ్ ఎస్.జె. సూర్య దర్శకత్వంలో పవన్ నటిస్తున్నారు. పులి టైటిల్ తో రాబోవుతున్న ఈ సినిమాను శింగనమల రమేష్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో తొలిసారిగా పవన్ పోలీసాఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఆ పాత్ర కోసం ఆయన మీసాలు బొద్దుగా పెంచి జుట్టును సైతం చిన్నగా కత్తిరించుకున్నాడు. దేహ దారుఢ్యాన్ని సైతం మెరుగు పరచుకున్నాడు. అయితే ఇప్పుడందరి కళ్లూ ఆ సినిమాలో నటించే హీరోయిన్ పైనే. ఇంతవరకు అధికారికంగా ఈ సినిమా హీరోయిన్ ఎవరో వెల్లడి కాలేదు. అయితే ఫిల్మ్‌నగర్ వర్గాల్లో కరీనా కపూర్ పేరు నానుతోంది. ఈ బాలీవుడ్ హీరోయిన్ 'జబ్ వయ్ మెట్' సినిమా నుండి అక్కడ టాప్ స్టార్ అయ్యింది. తాజాగా ఆమె చేసిన 'తషాన్' చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయినా ఆమె తరగని అంద చందాలకు మంచి పేరుతీసుకొచ్చింది. దాంతో ఆమె రెమ్యునేషన్ కూడా పెరిగింది. మూడు నుంచి మూడున్నర కోట్లు మూడ్ ని బట్టి డిమాండు చేసి మరీ పుచ్చుకుంటోంది. ఆమె అయితే తమ సినిమాలో పాత్రకు కరెక్టుగా సూటవుతుందని పవన్ భావిస్తున్నాడట.

అలాగే రెండో హీరోయిన్ కోసం "జల్సా"లో రెండో హీరోయిన్‌గా కనిపించిన పార్వతీ మిల్టన్ ని కలిసారని తెలుస్తోంది. అందులో ఆమె "సెక్సీ"గా కనిపించింది. అదే సంగతి హీరోయిన్ ఇలియానా సినిమాలో పార్వతిని ఉద్దేశించి "అది నాకంటే సెక్సీగా వుంటుంది" అంటుంది . అదలా వుంచితే అందులో పార్వతి నటన పవన్‌ను బాగా ఆకట్టుకున్నదనీ, అతను ఆమెను ప్రత్యేకంగా ప్రశంసించాడనీ వినిపిస్తోంది. అందుకే "పులి"లోనూ ఆమెను తీసుకోవాల్సిందిగా దర్శకుడు సూర్యకు అతను సూచించాడని టాలీవుడ్ అంతర్గత వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ కరీనా...పార్వతి లలో ఎవరు పులి ప్రక్కన సెటిల్ అవుతారు లేదా ఇద్దరూ తలో ప్రక్కా ఉంటారా అన్నది తేలాలి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X