»   » రామ్ చరణ్ మదర్ కోసం వెతుకుతున్నారు!

రామ్ చరణ్ మదర్ కోసం వెతుకుతున్నారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో రామ్ చరణ్ కు అమ్మ పాత్రలో ఎవరిని తీసుకోవాలనే దానిపై చిత్ర యూనిట్ తలముకలై ఉన్నారు. రమ్య కృష్ణ, తులసి, జీవిత రాజశేఖర్ పేర్లు వినిపించినా....వీరిలో ఎవరినీ తీసుకోవడం లేదని శ్రీను వైట్ల బిహేవియర్ బట్టి తెలుస్తోంది. రామ్ చరణ్ అమ్మ పాత్రకు కాస్త యంగ్ గా ఉండి, మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే మిడిలేజ్ యాక్టర్ కోసం అన్వేషిస్తున్నారు.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

త్వరలో ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. . దూకుడు సినిమా తర్వాత విడిపోయి శ్రీను వైట్ల-కోన వెంకట్-గోపీ మోహన్... రామ్ చరణ్ సినిమా కోసం మళ్లీ కలిసి పని చేస్తుండటం వల్ల సినిమాపై అంచనాలు పెరిగాయి.

Who is Ram Charan's Mom

ఈ విషయమై గోపీ మోహన్ మాట్లాడుతూ...మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా శ్రీనువైట్ల డైరెక్షన్లో దానయ్య గారి బ్యానర్ లో త్వరలో స్టార్ట్ అయ్యే ప్రాజెక్ట్ కి కూడా మేము కధని అందిస్తున్నాం. పదేళ్ళు కలిసి పనిచేసిన మేము(వైట్ల గారు,కోన గారు,నేను), కొన్ని అనివార్య కారణాల వల్ల గత సంవత్సరం కలిసి పనిచెయ్యలేకపోయాం. దానికి కారణాలు అనేకం. జరిగిన దానికి ఒకరి మీద ఒకరు వేలెత్తి చూపించుకునే సంస్కృతి నుండి బయటపడి, అందరి హీరోలతో జనరంజకమైన సినిమాలకి పనిచెయ్యాలని ఆశిస్తున్నాము. హీరో రామ్ చరణ్ ఉన్నత మనసుతో కోన గారిని, వైట్ల గారిని కలిపిన విధానం అభినందించదగినది. మా కలయికలో రాబోయే రామ్ చరణ్ నూతన చిత్రం చాలా మంచి కధతో, శ్రీను వైట్ల గారి సినిమాలకి భిన్నమైన కొత్త కధనంతో రూపకల్పన జరుగుతోంది. మా మార్కు మంచి హాస్యము ఉంటుంది. శ్రీను వైట్ల గారు, మా కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా బ్రహ్మానందం గారి పాత్ర ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుంది. ఇదివరకు సినిమాల ఛాయలు ఎక్కడా లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. మార్చి 5న సినిమా ప్రారంభం కాబోతోంది' అని అని తెలిపారు.

మరో వైపు ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ టైటిల్ విషయమై ఇప్పటి వరకు అటు రామ్ చరణ్ నుండి గానీ, ఇటు శ్రీను వైట్ల నుండి గానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

చిత్రానికి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ ఓకే అయినట్లు తెలుస్తోంది. రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్లు కాకుండా...తమిళ కుర్రోడు, కొలవెరి సాంగ్ ఫేం అనిరుద్ రవిచందర్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేసిన వై దిస్ కొలవెరి సాంగ్ దేశ వ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. మరి రామ్ చరణ్ సినిమాకు అనిరుద్ ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

English summary
It is known that Ram Charan is currently busy with Srinu Vaitla’s My Name Is Raju. So, his unit is on a hunt to find a glam mom for Cherry.
Please Wait while comments are loading...