»   » బాహుబలి 2 చూసారా..? అయితే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పగలరా...

బాహుబలి 2 చూసారా..? అయితే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పగలరా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు? నిన్నా మొన్నటి వరకూ అందరినీ వేదించిన ప్రశ్న ఇది... బాహుబలి ది కంక్లూజన్ లో దీనికి సమాధానం వచ్చేసింది. అయితే ఈ సమాధానం చెప్పిన పార్ట్ 2 మాత్రం ఇంకా చాలా ప్రశ్నలనే ప్రేక్షకుడి ముందుంచింది. ఎంత గొప్ప సినిమా అయినా ఏక్కడో ఒక చిన్న తప్పు దొర్లిపోతుంది. ఆ తప్పు మాత్రం మొత్తం అయిపోయాక తీరిగ్గా ప్రేక్షకుడి కంట్లో పడుతుంది.

భల్లాల దేవుడి పెళ్ళి

భల్లాల దేవుడి పెళ్ళి

ఇప్పుడు బాహుబలి లోనూ అలాంటే తప్పే ఒకటి పట్టుకున్నారు ప్రేక్షకులు. బాహుబలి ఫస్ట్ పార్ట్ లో చూసిన కొన్ని క్యారెక్టర్ల కంక్లూజన్ బాహుబలి 2 లో దొరుకుతుందనుకున్నా అసలు ఆ పాత్రల ఊసే కనిపించక పోవటం ఆశ్చర్య పరిచింది. అదేమిటంటే.... భల్లాల దేవుడి పెళ్ళి విషయం.


భళ్లాలదేవుడికి కొడుకు ఉన్నట్టు

భళ్లాలదేవుడికి కొడుకు ఉన్నట్టు

బాహుబలి: ది బిగినింగ్‌'లో భళ్లాలదేవుడికి కొడుకు ఉన్నట్టు చూపించారు. (ఈ పాత్ర అడివి శేష్ చేసారు ) ఆ కొడుకును ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌కు ముందు శివుడు చంపేస్తాడు. అయితే రెండో భాగంలో రానాకు పెళ్లవడం, కొడుకు పుట్టడం గురించి నామమాత్రంగానైనా చూపించలేదు. అసలు దేవసేనని కోరుకున్న భల్లాల దేవుడు అలా పెళ్ళి లేకుండానే మిగిలి పోయినట్టయితే కొడుకు పుట్టటం అనే మాటే లేదు.


పెళ్ళయ్యింది అనుకున్నా

పెళ్ళయ్యింది అనుకున్నా

భార్య కాకుండా వేరే స్త్రీ వల్ల పుట్టినట్టయితే "యువరాజు" ఎలా అవుతాడు? పోనీ పెళ్ళయ్యింది అనుకున్నా కథలో కీలకమైన పాత్ర "భల్లాల దేవుడిది" మరి అతను పెళ్ళి చేసుకొని ఉంటే ఆ భార్య ఎవరు అన్న ప్రశ్న కూడా ఉండాల్సిందే... అంతెత్తు ఎదిగిన కొడుకుని చూపించినా భల్లాల దేవుడి భార్య ని మాత్రం చూపించనే లేదు.


రానాకు పెళ్లి కానట్టే అనిపిస్తుంది

రానాకు పెళ్లి కానట్టే అనిపిస్తుంది

అసలు విశయం ఏమిటంటే రెండో భాగం చూస్తే అసలు రానాకు పెళ్లి కానట్టే అనిపిస్తుంది. ఎక్కడా తన రాజ్యాన్ని కాపాడే పుత్రున్నిచ్చిన భార్య గురించి గానీ కనీసం రానాతో కనిపించే ఒక్క లేడీ పాత్ర గానీ లేదు. ఈ విశయం మర్చి పోయారా? లేదంటే ఎడిటింగ్ లో ఆ పార్ట్ ఎగిరి పోయిందా..?


అవంతిక సంగతి కూడా

అవంతిక సంగతి కూడా

ఈ సంగతి అటుంచితే అవంతిక సంగతి కూడా... ఒక ప్రశ్న గానే మిగిలిపోయింది దేవసేన ని మాహిశ్మతిలో పడుతున్న హింసలనుంచి తప్పించటానికి అనత పోరాటం చేస్తుంది, అందులోనూ మహేంద్ర బాహుబలి లాంటి కీలకమైన పాత్రకి జోడీ ఆమె కానీ పార్ట్ 2 లో అసలు అవంతిక అనే పాత్ర అసలు ఏదో అనామక పాత్రలాగా వెనుకే ఉండి పోయింది.


ఎడిటింగ్ లో పోయింది

ఎడిటింగ్ లో పోయింది

ఈ సంగతి కూడా "ఎడిటింగ్ లో పోయింది" అని కవర్ చేసినా వేరే కారణాలున్నాయన్న మాటలూ వినిపిస్తున్నాయి. మరి బల్లాల దేవుడి పెళ్ళి విషయం లో కూడా అదే జరిగిందా? నిజంగా ఎడిటింగ్ వల్లనేనా? లేదంటే అసలు ఆ సంగతి మర్చిపోయారా....!? అన్న ప్రశ్నలకి సమాధానం రాజమౌళి ఒక్కడే చెప్పగలడు.


English summary
Rajamouli has to answer for many questions that he did not reveal in Baahubali: The Beginning. Why did Katappa kill Bahubali is the one question which is on minds of many people? But who is wife of Bhallaladeva?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more