»   »  చిరు బర్త్ డే పార్టీకి దాసరి ఎందుకు రాలేదు?

చిరు బర్త్ డే పార్టీకి దాసరి ఎందుకు రాలేదు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 150వ పుట్టినరోజు వేడుక హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్‌లో ఇటీవల గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా దేశంలోని సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. అయితే తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖుడైన దాసరి నారాయణ రావు మాత్రం ఈ వేడుకకు హాజరు కాలేదు.

దాసరి ఈ వేడుకకు హాజరు కాక పోవడానికి కారణంగా వారి మధ్య ఉన్న విబేధాలే అని అంతా అనుకుంటున్నారు. అయితే అలాంటిదేమీ లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు. మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలకు అందరూ సినీ సెలబ్రిటీలకు అందినట్లే దాసరికి కూడా ఓ ఇన్విటేషన్ అందిందని తెలుస్తోంది.

Why Dasari absent Chiranjeevi's birthday bash

అయితే చిరంజీవి నుండి గానీ, రామ్ చరణ్ నుండి గానీ స్వయంగా పిలుపు వస్తుందని దాసరి ఆశించారని, అలాంటి దేమీ రాక పోవడంతో ఆయన పుట్టినరోజు వేడుకకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది. చిరంజీవి లేదా చరణ్ ఫోన్ చేసి ఆహ్వానించి ఉంటే ఆయన తప్పకుండా వెళ్లే వారని అంటున్నారు.

దీనికి తోడు ఆ మధ్య పలు సందర్భాల్లో రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు దాసరిని ఉద్దేశించినవే అంటూ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రామ్ చరణ్ ఆర్గనైజ్ చేస్తున్న చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపలేదని, ఒక వేళ రామ్ చరణ్ లేదా దాసరి నుండి ఫోన్ వస్తే ఆయన తప్పకుండా వెళ్లేవారని అంటున్నారు.

English summary
Why is veteran director Dasari Narayana Rao absent at Megastar Chiranjeevi's birthday bash. Here's reason, Dasari is waiting for a call either from Megastar Chiru or Ram Charan in person such that he would attend this mega meet. But Dasari received an invitation like any other celebrity in film industry but not any personal touch through a phone call.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu