»   »  అందుకే నాకా అవార్డు వద్దు: మేస్త్రో ఇళయరాజా

అందుకే నాకా అవార్డు వద్దు: మేస్త్రో ఇళయరాజా

Posted By:
Subscribe to Filmibeat Telugu

తనకు ప్రకటించిన అవార్డు అసంపూర్ణమైనదని, అందుకే ఆ అవార్డు స్వీకరణకు హాజరు కాలేదని ఇండియన్ మ్యూజిక్ మేస్త్రో ఇళయరాజా పేర్కొన్నారు. ఇళయరాజా 1000వ చిత్రమైన 'తారతప్పటైకి' ఉత్తమ ప్లేబ్యాక్‌ మ్యూజిక్‌కు జాతీయ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన హాజరు కాకపోవటం చర్చనీయాం శమైంది.

ఇండియాలో ఫిలిం మేకర్స్ అందరూ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించే నేషనల్ అవార్డే. ఐతే అంత విలువైన అవార్డును వద్దనుకున్నాడు మేస్ట్రో ఇళయరాజా. తనకు ప్రకటించిన పురస్కారం పట్ల ఆయనకు సంతృప్తి లేకపోవడమే దీనికి కారణం. అందుకే ఆయన మొన్నటి అవార్డుల వేడుకకు హాజరు కాలేదు. అవార్డు తీసుకోలేదు. ఇంతకీ ఇళయరాజా అసంతృప్తి ఎందుకన్న విషయం ఎవ్వరికీ తెలియలేదు.

ఈ నేపథ్యంలో తిరువణ్ణామలైలోని రమణమహర్షి ఆశ్రయంలో విశ్రాంతి పొందుతున్న ఆయన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గైర్హాజరీకి కారణాలను వెల్లడించారు. ఇంతకు ముందు సాగరసంగమం, రుద్రవీణ, సింధుబైరవి చిత్రాలకు ఉత్తమ జాతీయ సంగీత దర్శకుడిగా అవార్డులు తీసుకున్న సంగతి గుర్తు చేసుకున్న మేస్త్రో....

Why Ilayaraja rejected National award 2016 ?

'తారై తాపట్టై" సినిమాకు ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడిగా అవార్డుకు ఎంపిక చేయడం పట్ల తన అభ్యంతరాన్ని చెప్పారు. ఇలా నేపథ్య సంగీతానికి మాత్రమే అవార్డు ఇవ్వడం అన్నది తనను అవమానించడమే అంటున్నారాయన. అందులో పాటలు, మ్యూజిక్‌కు కలిపి అవార్డులు అందించాల్సిందని పేర్కొన్నారు.

పాటలు,నేపథ్య సంగీతం ఈ రెండూ కలిస్తేనే సంపూర్ణమైన సంగీతమని.., అవార్డును రెండుగా విభజించి.. పాటలకు వేరుగా, నేపథ్య సంగతానికి వేరుగా పురస్కారాలివ్వడం ఏం పద్ధతి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. నేపథ్య సంగీతానికి మాత్రమే అవార్డివ్వడమంటే తన పనిని సగం మాత్రమే గుర్తించినట్లని. ఇది సరి కాదని ఆయన అన్నారు.

English summary
Maestro Ilayaraja skipped the award ceremony in New Delhi on Tuesday refusing to receive the National award
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu