»   » జగపతిబాబు : రామ్ చరణ్ ని కాదని మహేష్ కే ఎందుకు?

జగపతిబాబు : రామ్ చరణ్ ని కాదని మహేష్ కే ఎందుకు?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Why Jagapathi babu accepted Mahesh's Film
హైదరాబాద్ : ప్రస్తుతం జగపతిబాబు కెరీర్ ఫుల్ స్వింగ్ మీదుంది. అయితే రీసెంట్ గా రామ్ చరణ్ సినిమాను వదలు కుని మహేష్ బాబు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం అంతటా చర్చనీయాంశంగా మారింది. చాలామంది ఇరవై తొమ్మిది సంవత్సరాల రామ్ చరణ్ కి తండ్రిగా నటించమంటే నో చెప్పి 38 ఏళ్ల మహేశ్ బాబుకి యస్ అని చెప్పడంపై జగపతి స్ట్రాటజీ ఏమిటనేది ఆరాలు తీస్తున్నారు. అయితే అలా జగపతిబాబు నిర్ణయం తీసుకోవటానికి బలమైన కారణం ఉందీ అంటున్నారు.

అయితే ఆ మధ్య కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న 'గోవిందుడు అందరివాడే'లో రామ్ చరణ్ కి తండ్రిగా జగపతిబాబుని నటించమని అడిగారు. కానీ అందులో నటించడం లేదని చెప్పేశాడు అయితే మహేష్ సినిమాలో ప్రిన్స్ కి బాబాయ్ గా నటించటానికి మాత్రం ఓ కె అన్నాడు. మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో హీరో తండ్రిగా నటించేందుకు జగపతి సై అనడమే కాదు మహేశ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని స్వయంగా ట్వీట్ కూడా చేశాడు.

దీనికి కారణం... మహేశ్ సినిమాలో రెండు రకాల గెటప్స్ ఉంటాయట ప్రత్యేకించి ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే జగపతి బాబు క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట అందుకే కథ విన్నవెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు జగపతి అదే రామ్ చరణ్ సినిమా విషయానికి వస్తే ఇందులో జగపతి బాబుకి ఆఫర్ చేసిన పాత్ర వర్తమానం అంతా ఓల్డ్ ఏజ్ గెటప్ తోనే ఉంటుందట అందుకే నో చెప్పేశాడట.

'లెజెండ్'తో తన కెరీర్ ను కొత్త కోణంలో ఆవిష్కరించుకున్న జగపతిబాబు ఇటీవల జోరు పెంచాడు. ఒకప్పుడు ప్లే బాయ్ క్యారెక్టర్స్ కే పరిమితమైన జగపతి ఇప్పుడు విలక్షణమైన పాత్రల్లో అలరించేందుకు ప్రయత్నిస్తున్నాడు. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషనల్లో తెరకెక్కిన 'లెజెండ్' ఈ సీనియర్ నటుడిలో ఉన్న మరో యాంగిల్ ని తట్టిలేపింది. థియేటర్లలో గర్జించేలా చేసింది. ఇంకేముంది జగపతికి అవకాశాలు వెల్లువెత్తాయి.

English summary
Jagapathi Babu got a powerful flashback to perform in Mahesh Babu's forthcoming movie under Koratala Siva's direction.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu