»   » ఇబ్బందుల్లో క్రిష్ "మణికర్ణిక": ప్రాజెక్ట్ ఆగిపోతుందా? కంగనకు కోర్ట్ నోటీసులు

ఇబ్బందుల్లో క్రిష్ "మణికర్ణిక": ప్రాజెక్ట్ ఆగిపోతుందా? కంగనకు కోర్ట్ నోటీసులు

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  క్రిష్‌ తీర్చిదిద్దనున్న 'మణికర్ణిక'.  ఝాన్సీ లక్ష్మీబాయ్‌గా నటించేందుకు కంగనా రనౌత్ సిద్ధమవుతోంది. ఆ చిత్రానికి 'మణికర్ణిక - ద క్వీన్ ఆఫ్‌ ఝాన్సీ' అనే టైటిల్‌ ఖరారు చేశారు. లక్ష్మీబాయ్‌ అసలు పేరు మణికర్ణిక! తెలుగు దర్శకుడు క్రిష్‌కు ఈ సినిమాని డైరెక్ట్‌ చేసే అవకాశం లభించింది. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో మొదలైన కొత్త వివాదం క్రిష్ ని కూడా ఇబ్బందుల్లో పడేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఇప్పుడు బాలీవుడ్ లో ఏం జరిగిందీ.., దానికీ క్రిష్ కీ సంబందం ఏమిటీ అంటే..??

  కంగనా రనౌత్ లీడ్ రోల్

  కంగనా రనౌత్ లీడ్ రోల్

  'బాహుబలి' రచయిత విజయేంద్రప్రసాద్ ఈచిత్రానికి కథ అందించారు. ఈ చిత్రంలో కంగనా రనౌత్ లీడ్ రోల్ చేస్తోంది. శంకర్-ఎస్సాన్-లాయ్ సంయుక్తంగా సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని జీ స్టూడియోస్, కమల్ జైన్ సమర్పణలో కైరోస్ కంటెంట్ స్టూడియోస్ బేనర్లో సంజయ్ కుట్రీ, నిషాద్ పిట్టి సహనిర్మాతలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

  అతడు అడవిని జయించాడు

  అతడు అడవిని జయించాడు

  ముదు వెంకీ కోసం క్రిష్ 'అతడు అడవిని జయించాడు' చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నాడు క్రిష్. కేశవరెడ్డి రచించిన ఈ నవలకు చాలా అవార్డులు వచ్చాయి. ఈ నవల కాపీ రైట్స్ తీసుకోవాలని అనుకున్నారు క్రిష్. కానీ ఇంతలోనే మరో వ్యక్తి ఆ నవల హక్కులను సొంతం చేసుకోవడంతో వెంకీ సినిమా డ్రాప్ అయింది.

  భారీ చారిత్రక చిత్రం

  భారీ చారిత్రక చిత్రం

  గౌతమిపుత్ర శాతకర్ణితో తెలుగు చక్రవర్తి కథకు రూపం ఇచ్చిన క్రిష్, మరోసారి ఓ భారీ చారిత్రక చిత్రం రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో... భారత చరిత్రలో ధీరవనితగా గుర్తింపు తెచ్చుకున్న రాణీ లక్ష్మీబాయ్ జీవితాన్ని సినిమాగా రూపొందించనున్నాడని వార్తలు వచ్చిన కొద్ది రోజులకే సినిమా ప్రారంభించేసాడు క్రిష్. అయితే ఇప్పుడు మణి కర్ణిక కి అనుకోని అవాంతరం ఎదురయ్యింది. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కక ముందే వివాదం లోకి దిగింది.

  లక్ష్మి భాయి అసలు పేరు మణికర్ణిక

  లక్ష్మి భాయి అసలు పేరు మణికర్ణిక

  ఝాన్సీకి రాణి లక్ష్మి భాయి అసలు పేరు మణికర్ణిక. మరాఠా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆమె1828 లో వారణాసిలో జన్మించారు. అందుకే సినిమాను అక్కడి నుండే ప్రారంభించాలని నిర్ణయించిన క్రిష్ ఫస్ట్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం వారణాసిలో ఏర్పాటు చేసారు.వారణాసిలోని గంగానది తీరంలో ‘మణికర్ణిక' ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

  పోస్టర్ ఆవిష్కరణ

  పోస్టర్ ఆవిష్కరణ

  దశ్వమేధ్ ఘాట్ వద్ద గంగా హారతి నిర్వహించిన అనంతరం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.మణికర్ణిక చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా రిలీజ్ చేయబోతున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తరహాలోనే ఈ చిత్రాన్ని గ్రాండ్ గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు క్రిష్.

  క్రిష్ ప్రాజెక్ట్ పై ప్రభావం

  క్రిష్ ప్రాజెక్ట్ పై ప్రభావం

  2018 ఏప్రిల్ 27న ఈ మూవీ విడుదల కానుంది. అందుకు తగిన విధంగా సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసారు. అయితే ఈ హంగామా ఇంకా సద్దుమణగకముందే ఇప్పుడు ఈ సినిమా కి అవాంతరం ఎదురయ్యింది. అసలు క్రిష్ కీ ఈ వివాదానికీ డైరెక్ట్ సంబందం ఏమీ లేకపోయినా ఈ తాజా పరిణామం వల్ల క్రిష్ ప్రాజెక్ట్ పై ప్రభావం మాత్రం ఖచ్చితంగా పడుతుంది.

  బాలీవుడ్‌ దర్శకుడు కేతన్‌ మెహతా

  బాలీవుడ్‌ దర్శకుడు కేతన్‌ మెహతా

  ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న కంగనా రనౌత్‌ తన సినిమాను హైజాక్‌ చేసిందని ఆరోపిస్తూ బాలీవుడ్‌ దర్శకుడు కేతన్‌ మెహతా కంగనాకు నోటీసులు పంపారు. ఆమె ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో వస్తున్న ‘మణికర్ణిక-ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ' సినిమాలో నటించాల్సి ఉంది.

  రాణి ఆఫ్‌ ఝాన్సీ

  రాణి ఆఫ్‌ ఝాన్సీ

  కానీ కేతన్ మెహతా మాత్రం 2015లోనే కంగనాతో ‘రాణి ఆఫ్‌ ఝాన్సీ' సినిమా గురించి మాట్లాడారట. అప్పుడు తన సినిమా చేయటానికి ఒప్పుకున్న కంగనా అదే కథతో ఇంకో దర్శకుది దగ్గర పని చేయటానికి సిద్దపడిందంటూ కేతన్‌ కోర్టును ఆశ్రయించారు.
  ‘ఇప్పుడు ఈ కేసును మా లాయరే చూసుకుంటారు.

  కేవలం భారతీయుల కోసమే కాదు

  కేవలం భారతీయుల కోసమే కాదు

  ఇంతటి గొప్ప సినిమా అందించడానికి పదేళ్లు కష్టపడాలి. ఇది కేవలం భారతీయుల కోసమే కాదు యావత్‌ ప్రపంచం కోసం తీయాలనుకున్నాం. ఈ నోటీసులపై కంగనా ఇంకా స్పందించలేదు.' అని వెల్లడించారు కేతన్‌. సో.! ఇప్పుడు దీనిమీద క్రిష్ ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు, కంగానా ఈ ప్రాజెక్ట్ లో ఉంటుందా లేదా అన్న అనుమానాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందో...

  English summary
  Acclaimed filmmaker Ketan Mehta on Thursday said he has sent a legal notice to actress Kangana Ranaut for conniving with producer Kamal Jain and others to hijack Rani of Jhansi: The Warrior Queen, his most ambitious film project.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more