For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కట్టప్ప ఎందుకు చంపాడు? అంటే రానా ఇలా అనేసాడేంటి? ప్రాబ్లమ్స్ రావా?

  By Srikanya
  |

  హైదరాబాద్‌: బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే సమాధానం కోసం అభిమానులు కొంత కాలం నుండి చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తొలి భాగానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న బాహుబలి ది కంక్లూజన్ చిత్రం ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వనుండగా.. తాజాగా ఆ సన్నివేశానికి సంబంధించిన విషయం గురంచి రానా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు.

  బాహుబలి కోసం డైరెక్టర్ రాజమౌళి, నటీనటులు, టెక్నీషియన్స్ ఎంతో శ్రమపడ్డారు. షూటింగ్ కు ఏకంగా కొన్ని సంవత్సరాలే పట్టింది. తెలుగు ప్రేక్షకులు ఇమాజినేషన్ చేయనంతటి భారీ స్థాయిలో తీసిన ఈ సినిమా చూస్తే మనకు వచ్చే ఒక డౌట్ బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అని. ఈ ప్రశ్నకు జవాబు బాహుబలి 2 లో దొరకవచ్చు. ఇలా ఉండగా ఈ డౌట్ మీద మరో డౌట్ వచ్చింది. అసలు కట్టప్ప బాహుబలిని నిజంగా చంపాడా అని.

  ఫ్యాన్స్ ను వెంటాడి, నిద్రలేని రాత్రులకు గురి చేస్తున్న 'బాహుబలి-1'లోని ఈ ట్విస్టు గురించి తాజాగా 'భల్లాల దేవ' అలియాస్‌ రాణా దగ్గుబాటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు. బాలీవుడ్‌ లైఫ్‌ వెబ్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలియచేసారు.

  ఆ పత్రికవారు రానాను టాప్‌ సీక్రెట్‌ అయిన 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపారు' అని అడిగారు. దీనికి రాణా ఆసక్తిరమైన సమాధానం చెప్పి వార్తల్లో నిలిచాడు. రానా ఏం చెప్పాడో క్రింద చూద్దాం. అలాగే రెండు రోజుల క్రితం తమన్నా, అంతకు ముందు రాజమౌళి, సత్యరాజ్ ఇదే విషయమై మాట్లాడారు.

  ఎందుకు చంపాడంటే..రానా

  ఎందుకు చంపాడంటే..రానా

  బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అన్న ప్రశ్నకు సమాధానం సెట్‌లోని ప్రతి ఒక్కరికీ తెలుసని చిత్రంలో విలన్ గా నటించిన రానా దగ్గుబాటి అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రానా ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అందరికీ ఆ ట్విస్ట్ ఏమిటో తెలుసు అనటంతో అందరూ షాక్ అయ్యారు. అందరికీ తెలిస్తే ఈ లోగా ఏదో విధంగా బయిటకు లీక్ అయ్యేది కదా అంటున్నారు.

   రాజమౌళి అందరికీ చెప్పారు

  రాజమౌళి అందరికీ చెప్పారు

  ‘సెట్‌(బాహుబలి 2)లో ప్రతి ఒక్కరికీ బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసు. ఎస్‌.ఎస్‌. రాజమౌళికి మొదటినుంచి కథపై చాలా స్పష్టత ఉంది. చిత్రంలో నటిస్తున్న ప్రతి ఒక్కరికి, చిన్న నటుడి నుంచి పెద్ద నటుడి వరకు అందరికీ సినిమా పూర్తి కథ చెప్పారు అని దగ్గుపాటి రానా అన్నారు. అంటే ఇప్పుడు టీమ్ లో ఎవరినీ కదిలించినా విషయం రివిలయ్యే అవకాసం ఉందని హింట్ ఇచ్చేసాడు.

   ఎప్పుడో ఐదేళ్ల క్రితమే..

  ఎప్పుడో ఐదేళ్ల క్రితమే..

  బాహుబలి రెండు భాగాలు ఐదేళ్ల ముందే రాశారు. ఇప్పటికిప్పుడే కథను రాసి తీస్తున్నది కాదు. దీన్ని ముందే ప్లాన్‌ చేసుకుని, అనుకున్న దాన్ని అమలు చేస్తున్నారు అని రానా వివరించారు. నిజానికి రాజమౌళి పూర్తి బౌండ్ స్క్రిప్టు లేనిదే సీన్ లోకి వచ్చే వ్యక్తి కాదు. ముఖ్యంగా ఇలాంటి భారీ చిత్రం, బోల్డు డబ్బుతో కూడుకున్న సినిమాకు అయితే మరీను.

   నేరుగా చెప్పకపోయినా

  నేరుగా చెప్పకపోయినా

  అయినా ఇది వివరించడానికి వీలుకానిది. ‘బాహుబలి: కన్‌క్లూజన్‌' విజువల్‌ ట్రీట్‌ లాంటిది, ఇదేమీ అప్పటికప్పుడు అనుకున్న సంగతి కాదు. మంచి ప్రణాళికతో, ఆలోచనతో తెరకెక్కిస్తున్నాం' అని రాణా వివరించారు. అయితే, మిస్టరీ గుట్టు రాణా నేరుగా విప్పకపోయినా కొన్ని మంచి విషయాలు చెప్పాడు. సో, రాజమౌళి తెరకెక్కిస్తున్న 'బాహుబలి-2' వచ్చేవరకు వేచి చూడాలన్నమాట.

   షూటింగ్ సమయంలో వాళ్ళు మాత్రమే

  షూటింగ్ సమయంలో వాళ్ళు మాత్రమే

  వాస్తవానికి షూటింగ్ సమయంలో కేవలం ముగ్గురు వ్యక్తులని తప్ప మరెవరిని లొకేషన్‌లోకి అనుమతించలేదని సమాచారం. ఆ ముగ్గురిలో బాహుబలిగా నటించిన ప్రభాస్, కట్టప్ప సత్యరాజ్, ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ ఉన్నారట. అయితే ఇప్పటి వరకు ఆ ప్రశ్నకు సమాధానం రచయిత విజయేంద్ర ప్రసాద్‌తో పాటు దర్శకుడు రాజమౌళికి మాత్రమే తెలుసు.

   నేను అక్కడ లేను ..తమన్నా

  నేను అక్కడ లేను ..తమన్నా

  బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడని ప్రశ్నించగా తమన్నా ఇలా సమాధానం ఇచ్చారు. ‘బాహుబలిని కట్టప్ప చంపినప్పుడు నేనక్కడ లేను, ఇంకెవరైనా ఉండి ఉంటారని అనుకోను. నాకు తెలిసి రాజమౌళి ఈ సన్నివేశం చిత్రీకరణను తొలి విభాగంలోనే పూర్తి చేసుంటారు. ఎవరికీ ‘బాహుబలి' కథ తెలియదు' అని చెప్పారు.

   రానాకు బిన్నంగా

  రానాకు బిన్నంగా

  రానా ఏమో బాహుబలికి పనిచేసిన టీమ్, నటీనటులు అందరికీ ఈ ట్విస్ట్ ఏమిటని తెలుసుని, రాజమౌళి ముందే చెప్పారని రివీల్ చేస్తే, తమన్నా మాత్రం భిన్నంగా...ఎవరికీ ‘బాహుబలి' కథ తెలియదు అని చెప్పుకొచ్చింది. నిజంగా క్లారిటీ లేదా..లేక కావాలానే ఇలా చెప్తున్నారా అనే సందేహం అందరికీ కలుగుతోంది ఇది వింటూంటే.

   సత్యరాజ్ ఏమంటాడు అంటే...

  సత్యరాజ్ ఏమంటాడు అంటే...

  అందుకే చంపాను బాహుబలి సినిమా తర్వాత ...కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్న చాలా మంది అడిగారు...ఆ ప్రశ్నకు నా నుండి వచ్చే సమాధానం ఒక్కటే... ‘రాజమౌళి చెప్పారు.. నేను చంపాను..' మరింత బలంగా ప్రస్తుతం రెండో భాగం ‘బాహుబలి: ది కంక్లూజన్‌' చిత్రకరణ శరవేగంగా జరుగుతోంది. ఇందులో నా పాత్ర మరింత బలంగా ఉంటుంది అని కట్టప్ప పాత్ర వేసిన సత్యరాజ్ తెలిపారు.

   రాజమౌళి సరదాగా ఇలా

  రాజమౌళి సరదాగా ఇలా

  ‘నేను చంపమన్నాను. కాబట్టి కట్టప్ప బాహుబలిని చంపాడు' అని ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి సరదాగా చెప్పిన సంగతి తెలిసిందే. మరి అసలు కారణం అభిమానులు తెరపై చూడాల్సిందే.

   విజయేంద్రప్రసాద్ చెప్పింది వింటే షాక్

  విజయేంద్రప్రసాద్ చెప్పింది వింటే షాక్

  'బాహుబలి' రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. ‘ఆ సినిమాలో బాహుబలి చనిపోయాడని ఎందుకు అనుకోవాలి? బ్రతికి కూడా ఉండొచ్చు కదా?' అన్నారు. దాంతో కొత్త ప్రశ్నలు రెయిజ్ అయ్యాయి. చనిపోక పోతే మరి ఏమైనట్టు? విజయేంద్రప్రసాద్ ఈ కామెంట్ ఎందుకు చేసినట్టు? -ఇలా రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

   సీక్వెల్ అప్పుడు రాసిందే

  సీక్వెల్ అప్పుడు రాసిందే

  'బాహుబలి' సినిమా విడుదలకు ముందే రెండు భాగాలకు సంబంధించిన స్క్రిప్టు పూర్తయింది. బాహుబలి భారీ విజయం తర్వాత సీక్వెల్ లో ఎటువంటి మార్పులు చేయడం లేదు అని ఆయన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్ ..సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు.

   భారతంలో పాత్రే కట్టప్ప

  భారతంలో పాత్రే కట్టప్ప

  బాహుబలి సినిమాలోని పాత్రలు మహాభారతం, రామాయణంలోని పాత్రలను స్ఫూర్తిగా తీసుకుని రూపొందించినవే అని విజయేంద్రప్రసాద్ తెలిపారు. భీష్ముడి పాత్ర ఆధారంగా కట్టప్ప పాత్ర రూపకల్పన చేశానని, శివగామిలో కైకేయి, గాంధారీ, కుంతి ఛాయలు కనిపిస్తాయని, బిజ్జలదేవ పాత్రలో శకుని తత్వం కనిపిస్తుందని, భల్లాలదేవ పాత్రలో రావణుడు, దుర్యోధనుడు కనిపిస్తాడని, బాహుబలిలో అర్జునుడు, రాముడు కనిపిస్తాడని రచయుత విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు.

  కట్టప్ప పేరుని వాడేస్తున్నారే

  కట్టప్ప పేరుని వాడేస్తున్నారే

  ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి' తమిళనాట కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో సత్యరాజ్‌ పాత్ర కూడా అన్నివర్గాల ప్రేక్షకులను రంజింపజేసింది. కట్టప్ప పాత్రకు సంబంధించి ఇప్పటికే పలు హాస్య వీడియోలు, ఫొటోలు కూడా వచ్చాయి. తమిళనాట ఆ స్థాయిలో రీచ్‌ అయిందా కట్టప్ప పాత్ర. ఈ నేపథ్యంలో ఆ కట్టప్ప కనిపించడం లేదంటూ సత్యరాజ్‌ కుమారుడు శిబిరాజ్‌ వెతుకుతున్నారు. అది నిజమైన వెతుకులాట కాదు. 'కట్టప్పావై కానోం' (కట్టప్ప కనిపించడంలేదు) అనే పేరిట ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఆ తర్వాత మణి దర్శకత్వంలో 'కట్టప్పావై కానోం' సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమాకు కట్టప్ప పాత్రకు ఏమాత్రం సంబంధం లేదని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఆ పాత్ర కోసం తగిన జాగ్రత్తలు కూడా తీసుకున్నామని తెలిపారు.

   38 ఏళ్ల కెరీర్ లో

  38 ఏళ్ల కెరీర్ లో

  38ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నా.. ప్రస్తుతం అందరూ నన్ను 'కట్టప్ప'గానే పిలుస్తున్నారు. చిన్నారులూ కూడా అంతే. ఈ క్రెడిట్‌ అంతా రాజమౌళిదే. జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి పాత్ర వస్తుంది. కట్టప్ప లాంటి ఒక పాత్రలో నటించే అవకాశం దక్కడం నా అదృష్టం. ఈ సినిమాతో నాకు వచ్చిన క్రెడిట్ అంతా రాజమౌళి గారికే దక్కాలి. యంగ్ డైరెక్టర్స్ ఒక విజన్‌తో సృష్టించే పాత్రలే మాలాంటి నటులకు గుర్తింపు తెస్తుంటాయి అన్నారు సత్యరాజ్.

   కట్టప్ప ద్రోహమే కథ..రాజమౌళి

  కట్టప్ప ద్రోహమే కథ..రాజమౌళి

  అసలు కట్టప్ప చేసిన గురించి చెప్పాలంటే.. అది ఒక్క మాటతోనో ఒక లైన్ తోనో చెప్పడం సాధ్య కాదట. రెండో భాగంలో కట్టప్ప ద్రోహం గురించి ఖచ్చితంగా సమాధానం ఉంటుందని చెప్పిన రాజమౌళి.. దాని వెనుక చాలా పెద్ద నేపథ్యం ఉంటుందన్నాడు. ఇంకా చెప్పాలంటే.. అసలు స్టోరీ అంతా కట్టప్ప చేసిన ద్రోహం మీదే ఆధారపడి ఉంటుందన్నాడు రాజమౌళి . ఓ నేషనల్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడీయన. .

   చంపలేదు, పొడిచాడు

  చంపలేదు, పొడిచాడు

  ఓ ఇంటర్వ్యూలో బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ `బాహుబలిని కట్టప్ప కేవలం పొడిచాడంతే` అని వ్యాఖ్యానించాడు. అంటే బాహుబలి మరణానికి అసలు కారకులు వేరే ఉన్నారని ఆయన మాటల్నిబట్టి చూస్తే అర్థమవుతోంది. బాహుబలి చంపడం వెనక వేరొకరు ఉన్నప్పటికీ కట్టప్ప తన చేతులతో ఎలా పొడవగలిగాడన్నది ఇప్పుడు డిస్కషన్ గా మారింది. మొత్తమ్మీద ఈ ట్విస్టు `బాహుబలి2`కి కావల్సినంత క్రేజ్ ని తీసుకొచ్చినట్టైంది.

   మా నాన్నకు కోపం వచ్చి...

  మా నాన్నకు కోపం వచ్చి...

  సత్యరాజ్ కుమారుడు శిబిరాజ్ ని మీడియావారు ఇదే ప్రశ్నను అడిగితే దానికి సమాధానమిస్తూ... "బాహుబలి పాత్రలో రాజమౌళి నన్ను తీసుకోలేదు. అందుకే మా నాన్నకు కోపం వచ్చి బాహుబలినే చంపేసాడు" అని ఫన్నీగా సమాధానమిచ్చాడు.

   ఈ ప్రశ్నపై జోక్స్, కామెడీలు

  ఈ ప్రశ్నపై జోక్స్, కామెడీలు

  ముఖ్యంగా నెట్ జనులు జోకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ‘బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్న సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలలో హల్‌చల్ చేస్తోంది. దీనిని ‘క్వశ్చన్ ఆఫ్ ది ఇయర్'గా చెప్తూ దానికి తమకు నచ్చిన సమాధానాలతోపాటు ఫోటోలను కూడా పెడుతున్నారు.

   ఆ ఎమౌంట్ పట్టుకొస్తే చెప్తా

  ఆ ఎమౌంట్ పట్టుకొస్తే చెప్తా

  రైటర్ విజయేంద్ర ప్రసాద్ ను ఓ పత్రిక ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న అడిగితే ఆయన చెప్పిన సమాధానం షాక్ ఇచ్చింది. ఇంతకీ బాహుబలిని కట్టప్ప చంపిందెందుకు అని సీరియస్ గా అడిగితే.. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే రూ. 150 కోట్ల చెక్కు పట్టుకు రండి! అప్పుడు చెబుతా! అంటూ జోక్ చేశారు విజయేంద్రప్రసాద్.

  ఈ ట్విస్ట్ లీకైందంటున్నారు

  ఈ ట్విస్ట్ లీకైందంటున్నారు

  అయితే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే విషయం లీకైందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కట్టప్ప మాహిష్మతికి సామ్రాజ్యానికి నమ్మకమైన బంటుగా ఉన్న సంగతి తెలిసిందే. కట్టప్ప పూర్వీకులు మాహిష్మతి రాజ్యానికి ఎవరైతే రాజుగా ఉంటారో వారి ఆజ్ఞని శిరసావహిస్తామని ప్రతిజ్ఞ చేసారు. ఈ క్రమంలో భళ్ళాలదేవుడి ఆర్డర్ ప్రకారం కట్టప్ప బాహుబలిని చంపాడని చెబుతున్నారు. మరి ఇదే నిజమా లేదంటే ఇంక జక్కన్న వేరే ఏదైన ట్విస్ట్ ఇచ్చాడా అనే విషయాలు తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.

   కష్టపడి గుర్రపుస్వారి, కత్తిసాము

  కష్టపడి గుర్రపుస్వారి, కత్తిసాము

  భారత్‌లోనే కాక వివిధ దేశాల్లోను మంచి రెస్పాన్స్‌ వచ్చింది.. అందుకే బాహుబలి2 చిత్రం కోసం టెన్షన్‌గా కంటే ఆతృతగా ఎదురుచూస్తున్నానని తెలిపింది. ఈ చిత్రం కోసం తొలిసారిగా గుర్రపు స్వారీ, కత్తిసాము నేర్చుకుందట. ఇందు కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నానని చెప్పుకొచ్చింది. ఎక్కడికి వెళ్లినా అందరూ నన్ను ఒకటే అడుగుతున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.. అని కాని నేను సమాధానం చెప్పడం లేదు.. చిత్రం చూసి తెలుసుకోవాల్సిందే అంటోంది తమన్నా.

   ఎగ్రిమెంట్ రాయించుకున్నారు

  ఎగ్రిమెంట్ రాయించుకున్నారు

  'బాహుబలి' ప్రస్తావన రాగానే అందరూ 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు' అని అడుగుతున్నారు. దానికి నేను సమాధానం చెప్పలేను. ఈ సినిమా కథకు సంబంధించిన విషయాలు వెల్లడించకూడదని ఒప్పందం ఉంది. రెండో భాగంలో ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అంది తమన్నా.

   సెకండ్ పార్ట్ లో తమన్నా ఇలా

  సెకండ్ పార్ట్ లో తమన్నా ఇలా

  'బాహుబలి: ది బిగినింగ్‌'తో పోలిస్తే రెండో భాగంలో నా పాత్ర కొత్తగా ఉంటుంది. తొలి భాగంలో నేను ఓ మామూలు అమ్మాయిగానే ఎక్కువ కనిపిస్తాను. అందులో నాకు పాటలు, డ్యాన్సులు ఉన్నాయి. కానీ 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌'లో యోధురాలిగా పోరాటాలు చేస్తాను. కత్తియుద్ధం, గుర్రపు స్వారీ చేస్తూ కనిపిస్తాను. దాని కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాను అని చెప్పుకొచ్చింది తమన్నా.

  మరింత ఆసక్తిగా

  మరింత ఆసక్తిగా

  తొలి భాగాన్ని మించిపోయేలా భారీస్థాయిలో 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌ ఉంటుంది. కథ, కథనాల పరంగానూ రెండో భాగం ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం క్లైమాక్స్‌ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. గతేడాది వచ్చిన బాహుబలి: ద బిగినింగ్‌ రికార్డు సృష్టించడమే కాకుండా ఉత్తమ జాతీయ చిత్రంగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.

   బాహుబలి 2 ట్రైలర్ డేట్

  బాహుబలి 2 ట్రైలర్ డేట్

  'బాహుబలి 2' చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ చిత్రం విడుదల కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే నవంబరులో చిత్రం షూటింగ్‌ పూర్తి కానుందని సమాచారం. హీరో ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా అక్టోబరు 23న చిత్రం ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

  English summary
  Baahubali’s Bhallala Dev aka star Rana Daggubati spoke to Bollywoodlife and made us question all our basics. The ‘why-Kattappa-killed-Baahubali’ is not a well-kept secret. Apparently, every single person who has been associated with the film knows the answer to this question.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X