»   » పవన్ కళ్యాణ్ సారీ చెప్పారు....ఎందుకంటే?

పవన్ కళ్యాణ్ సారీ చెప్పారు....ఎందుకంటే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తిత్వం ఉన్న వాడనిని, మంచి మనసున్న మనిషని పలు సందర్భాల్లో విన్నాం. ఆయనది ఎంత మంచి మనసో మరోసారి తేటతెల్లం అయింది. 'అత్తారింటికి దారేది' చిత్రానికి పని చేసిన కొందరు ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్‌కు పిలిచి మరీ సారీ చెప్పారట ఆయన. అలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది అనే విషయం తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ స్టోరీ చదవాల్సిందే.

'అత్తారింటికి దారేది' చిత్రంలో క్లైమాక్స్ సీన్లో పవన్ ఎమోషన్‌గా స్పందించి...కన్నీళ్లు పెట్టుకునే సీన్ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ సీన్ చేసేప్పుడు పవన్ కళ్యాణ్ ఆ సీన్లో భాగం కాని ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరినీ ఆ ప్లేసు ఖాళీ చేసి వెళ్లిపొమ్మని చెప్పాడట. ఆ సీన్ చేసేప్పుడు తనకు ఎలాంటి డిస్ట్రబెన్స్ ఉండకూడదనే పవన్ వారిని అక్కడి నుంచి వెళ్లి పొమ్మన్నాడు.

సీన్ చిత్రీకరణ అయిపోయిన తర్వాత అందరినీ పిలిచి....తను అలా ప్రవర్తించినందుకు సారీ చెప్పాడట పవన్. ఈ విషయాన్ని కమెడియన్ అలీ మంగళవారం జరిగిన ప్రెస్ మీట్లో వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ఉన్న స్థాయికి ఆయన ఎవరికీ సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనది ఎంతో మంచి మనసు కాబట్టే అలా చేసారని అంటుననారు అలీ.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.

నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్: రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
During the filming of AD climax scene sequence, Pawan got emotional and asked the rest of unit members who weren't part of the scene to vacate the place immediately to avoid any distractions. After the completion of the scene, he asked all of us to come in and apologized to each of us even though an actor of his stature needn't have to say sorry to small artistes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu