»   » రెండు సార్లు చెప్పుతో కొట్టాను: రకుల్ ప్రీత్ సింగ్

రెండు సార్లు చెప్పుతో కొట్టాను: రకుల్ ప్రీత్ సింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన త‌మ్ముడు అమ‌న్‌తో క‌లిసి రాఖీ పండుగను ర‌కుల్ ప్రీత్ సింగ్ సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఈ విష‌యాన్ని త‌న ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో ర‌కుల్ అభిమానుల‌తో షేర్ చేసుకుంది. త‌మ్ముడు అమ‌న్ తో క‌లిసి దిగిన ఫొటోను ర‌కుల్ పోస్ట్ చేసింది. రాఖీ టైమ్ విత్ మై ల‌వ్లీ మాన్‌స్ట‌ర్!! నాకు త‌మ్ముడిగా ఉన్నందుకు కృతజ్ఞ‌త‌లు అంటూ ర‌కుల్ ఇన్‌స్టాగ్రాంలో పేర్కొంది. సరే తమ్ముడితో ప్రేమ సంగతి పక్కన పెడితే బయత తనని ఇబ్బంది పెట్టిన అబ్బాయిలని మాత్రం బాగానే ఆడుకుందట రకుల్

రీల్ లైఫ్ లో సరే.. రియల్ లైఫ్ లో ఎవరినైనా చెప్పుతో కొట్టారా? అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చింది. ఒకసారి కాదు.. రెండుసార్లు చెప్పుతో కొట్టిన విషయాన్ని చెప్పింది. కాలేజీ రోజుల్లో ఒకసారి చెప్పుతో కొట్టానని.. రెండోసారి ఫోరం మాల్ లో కొట్టినట్లుగా చెప్పింది.

Why Rakul Preet slapped her fan

బ్రదర్ తోనూ.. ఒక స్నేహితుడితోనూ ఫోరం మాల్ కు సినిమాకు వెళ్లానని.. ఏదో తీసుకొని వెనక్కి తిరిగే సమయానికి ఒక వ్యక్తి ముఖానికి దగ్గరగా రావటంతో ఒళ్లు మండిపోయినట్లు చెప్పింది. సెల్ఫీ తీసుకోవటానికి వచ్చినట్లు చెప్పిన అతడ్ని.. కాస్త గట్టిగానే తాను కొట్టినట్లు చెప్పింది. ఏం చేస్తున్నావ్ అంటే.. ఎప్పటి నుంచో మిమ్మల్ని ఫాలో అవుతున్నా అని అనటంతో మరింత మండిపోయింది. ఫాలో చేయటం ఏమిటి? అంటూ గట్టిగా నిలదీసి.. గార్డ్స్ ను పిలిచి అతన్ని బయటకు పంపాలని గట్టిగా చెప్పా.

Mahesh Babu Releases Winner Song for Rakul Preet Singh - Filmibeat Telugu

తనకు కోపం రాదని.. కానీ ఒకసారి వస్తే మాత్రం అగ్నిపర్వతం బద్ధలైనట్లేనని చెప్పుకొచ్చింది. అయితే.. కోపం వెంటనే తగ్గిపోతుందని చెప్పిన రకుల్.. అప్పటి నుంచి తాను సెల్ఫీలు ఇవ్వటం లేదంది. మరికొన్ని ప్రశ్నలకు బదులిస్తూ.. హీరోలకు లేని కష్టాలు హీరోయిన్లకు ఎక్కువని చెబుతూ.. గ్లామర్ గా కనిపించటానికి హీరోయిన్లు చాలా కష్టపడాలంది.

English summary
Rakul Preeth Singh said that she slapped two people in her life. One incident took place when she was studying in college and the second incident took place recently when she was in Forum mall, Hyderabad.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu