»   »  నా కూతురు బికినీ ఫోటోను వివాదం చేయొద్దు: షారుక్ ఖాన్

నా కూతురు బికినీ ఫోటోను వివాదం చేయొద్దు: షారుక్ ఖాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ పిల్లలు ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ లండన్లో చదువుతూ తన స్నేహితులతో ఎంజాయ్ చేసిన ఫోటోలతో పాటు, కూతురు సుహానా బికినీ ఫోటోలు, చిన్న కుమారుడు అబ్ రామ్ ఆడుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ లా వ్యాపిస్తున్నాయి.

అంతా బాగానే ఉంది కానీ... తన పదహారేళ్ల కూతురు సుహానా బికినీ ఫోటోపై మీడియాలో వివాదం రేగడంపై షారుక్ కాస్త మనస్తాపానికి గురయ్యాడు. నా కూతురు కావడం వల్లనే దాన్ని అనవసర రాద్దాంతం చేస్తున్నారని, దయచేసి ఆ ఫోటోను తొలగించాలని షారుక్ ఖాన్ కోరారు.

Why Shahrukh Khan removed Suhana's Bikini Pic?

'సుహానా చిన్న పిల్ల...తనకు ఏమీ తెలియదు. బీచ్ ఒడ్డున బికినీలో తన చిన్న తమ్ముడితో ఆడుకుంటోంది. కానీ కొన్ని మీడియా సైట్లు ఈ ఫోటోను వివాదం చేస్తున్నారు. షారుక్ కూతురు తన బికినీ బాడీ ప్రదర్శిస్తోందని రాస్తున్నారు. మరీ ఇంత చెత్త రాతలు రాస్తారని నేను ఊహించలేదు' అన్నారు.

'ఆమెను నేను మీడియా నుండి ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాను.... నా స్టార్ డమ్ నుండి ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఆమె షారుక్ డాటర్ కావడం వల్లనే ఇలా చేస్తున్నారు, తన కూతురు కాకపోయి ఉంటే అది పెద్ద వార్త అయ్యేది కాదు. కొందరు నగ్నంగా పరుగెత్తినా పట్టించుకోను... పెద్ద న్యూస్ కాదు' అని షారుక్ ఖాన్ అభిప్రాయ పడ్డారు.

English summary
“My daughter was a little awkward about it. She’s 16, yaar. And the headlines some sites use are. Wow. We’re very liberal people and even had a laugh about it. But it’s still awkward,” SRK said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X