»   » లిప్ లాక్ చేయను, నాకూతురు చూస్తుంది: కట్టప్ప కొడుకు ఆన్సర్ అద్బుతం

లిప్ లాక్ చేయను, నాకూతురు చూస్తుంది: కట్టప్ప కొడుకు ఆన్సర్ అద్బుతం

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత 2016వ సంవత్సరంలో విడుదలైన సూపర్ హిట్ చిత్రాల్లో అడివి శేష్ ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు రవికాంత్ పేరెపు డైరెక్ట్ చేసిన 'క్షణం' కూడా ఒకటి. ఏడాది ఇన్వెస్ట్మెంట్-రిటర్న్స్ పరంగా చూసుకుంటే టాలీవుడ్లో బిగ్గెస్ట్ మూవీ 'క్షణం' అనే చెప్పాలి. ఈ సినిమా బడ్జెట్ కేవలం కోటి రూపాయలు.

క్షణం

క్షణం

ప్రమోషన్ కార్యక్రమాలన్నింటికీ కలిపి ఓ కోటి పెట్టారు. కానీ ఆ సినిమా ఏడెనిమిది కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసినట్లు అంచనా. మరోవైపు శాటిలైట్ రైట్స్ కూడా మంచి రేటే పలికే అవకాశాలున్నాయి. అది కాక చాలా భాషల నుంచి రీమేక్ రైట్స్ కోసం గట్టి పోటీ కూడా నెలకొంది.


రీమేక్ రైట్స్

రీమేక్ రైట్స్

హిందీలో ఇప్పటికే ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా మంచి రేటు పెట్టి రీమేక్ రైట్స్ తీసేసుకున్నాడు. కన్నడ పరిశ్రమ నుంచి రైట్స్ కోసం చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు తమిళ రీమేక్ కోసం ఆల్రెడీ డీల్ కూడా అయిపోవటమే కాదు సినిమా షూటింగ్ కూడా మొదలైపోయింది.


తమిళ రీమేక్

తమిళ రీమేక్

తక్కువ బడ్జెట్ తో రూపొంది భారీ కలెక్షన్లను కొల్లగొట్టిన ఈ చిత్రం తమిళ రీమేక్ హక్కులకు చాలా పోటీనే నెలకొంది. చివరికి సత్య రాజ్ తనయుడు శిబి సత్యరాజ్ ఈ హక్కులని దక్కించుకుని తానే హీరోగా సినిమా చేస్తున్నాడు.శిబిరాజ్ దశాబ్దం నుంచి హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు.


సరైన బ్రేక్ రావట్లేదు

సరైన బ్రేక్ రావట్లేదు

కానీ అతడికి సరైన బ్రేక్ రావట్లేదు. హీరో వేషాలు వదిలేసి విలన్ అవతారమెత్తినా అతడికి విజయం దక్కలేదు. ఇంతకుముందు ఎన్టీఆర్ సినిమా ‘స్టూడెంట్ నెంబర్ వన్'ను రీమేక్ చేసినా అది కూడా యావరేజ్ అనిపించుకుందంతే. ఐతే ‘క్షణం' మూవీ తాను ఆశిస్తున్న బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నాడు శిబిరాజ్.


రమ్యా నంబీశన్

రమ్యా నంబీశన్

ఈ రోజుల్లో సినిమాలకు చాలా మసాలా అద్దుతున్నారనేది తెలిసిన విషయమే. అందుకే.. ఈ సినిమాలో కూడా లిప్ లాక్స్ పెడదామనేది దర్శకుడి భావన. ఈ సినిమాలో రమ్యా నంబీశన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెకు, శిబిరాజ్ కు మధ్య మూతి ముద్దులు ప్లాన్ చేశాడట దర్శకుడు.


లిప్ లాక్ సీన్

లిప్ లాక్ సీన్

దీనికి హీరోయిన్ నుంచి ఎలాంటి అభ్యంతరం రాలేదు. కానీ శిబిరాజ్ మాత్రం కాదనేశాడట. సినిమా కోసం లిప్ లాక్ సీన్ లో నటించడానికి నో చెప్పడం ఆసక్తికరంగా అనిపించినా ఎందుకు ఆ సీన్ వద్దన్నాడో శిబిరాజ్ చెప్పిన కారణం మాత్రం అందరినీ ఆలోచింపజేసేలా ఉంది.


తన కూతురు కూడా చూసే అవకాశం ఉంది

తన కూతురు కూడా చూసే అవకాశం ఉంది

కారణం ఏమిటి అంటే.. తన సినిమాలు తన కూతురితో కలిసి చూసేలా ఉండాలని లిప్ లాక్స్ ఉంటే కూతురి ముందు తనకు చిన్నతనంగా ఉంటుందని అంటున్నాడు శిబిరాజ్.ఆ సినిమాను తన కూతురు కూడా చూసే అవకాశం ఉందని అందుకే.. అలాంటి సీన్ లో నటించను అని శిబిరాజ్ స్పష్టం చేసినట్టు సమాచారం.English summary
Actress Sibiraj has apparently refused to perform a lip-lock scene with Remya Nambeesan in his upcoming film ‘Sathya’ directed by Pradeep Krishnamurthy of ‘Saithan’ fame.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu