»   » ఎందుకు హ్యాక్ చేసాడో తెలుసా? : హీరోయిన్ కరీనా ఐటీ వివరాలు హ్యాక్‌.. వ్యక్తి అరెస్ట్‌

ఎందుకు హ్యాక్ చేసాడో తెలుసా? : హీరోయిన్ కరీనా ఐటీ వివరాలు హ్యాక్‌.. వ్యక్తి అరెస్ట్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: కొన్ని వింటూంటే ఇలాంటి పిచ్చోళ్లు కూడా ఉంటారా అని ఆశ్చర్యం వేస్తుంది. అభిమాని అంటూనే హ్యాక్ చేయటం ఏమిటి..పిచ్చి కాకపోతే.. బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ ఐటీ వివరాలను హ్యాక్‌చేసేందుకు యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఈ వ్యవహారంలో పారామిలటరీ బలగాలకు చెందిన 26 ఏళ్ల యువకుడిని సైబర్‌సెల్‌కు చెందిన పోలీసులు అరెస్టుచేశారు. ఈ అంశంపై కరీనా సీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగప్రవేశం చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టుచేశారు. అయితే హ్యాక్ చేయటానికి అతను చెప్పిన సమాధానం అందిరినీ షాక్ కు గురిచేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే...2016 సెప్టెంబర్‌లో కరీనా ఆదాయ పన్ను ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. ఉత్తరాది ప్రాంతానికి చెందిన ఓ అధికారి తానే కరీనా ఖాతా హ్యాక్‌ చేశానని.. తాను కరీనాకు వీరాభిమానినని, ఇలా చేస్తే కరీనాతో మాట్లాడే అవకాశం ఉంటుందని ఇలా చేసినట్లు సైబర్‌ పోలీసులకు వివరించాడు.

why this man hacked into Kareena Kapoor's Income Tax account

నిందితుడిని వేరే రాష్ట్రంలోనే అరెస్ట్‌ చేసి సోమవారం మధ్యాహ్నం ముంబయికి తీసుకొచ్చినట్లు డీసీపీ సచిన్‌ పాటిల్‌ తెలిపారు. నిందితుడు ఫోన్‌ సాయంతో కరీనా ఖాతాను హ్యాక్‌ చేసినట్లు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. అతని ఫోన్‌లో చాలా ఐపీ అడ్రస్‌లు ఉన్నాయనీ, దీనిపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.

నిందితుడి ఆచూకీ తెలియగానే అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ జరపగా, కరీనా ఫ్యాన్‌ నెంబర్‌ ఆధారంగా ఆమె ఖాతావివరాలు తెలుసుకుని హ్యాక్‌ చేసినట్లు నిందితుడు అంగీకరించినట్టు పోలీసులు వివరించారు. కేంద్ర ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న నిందితుడు తన సహోద్యోగులకు ఆదాయ పన్ను రిటర్న్స్‌లో సాయం చేస్తుంటాడని తెలిపారు.

English summary
The cyber cell of the Mumbai Police arrested a man for allegedly attempting to hack Income tax details of actress Kareena Kapoor Khan in September last year. The man has been identified as an paramilitary official and asserted of being a fan of the actress, said media reports.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu