»   » త్రివిక్రమ్ అందుకే ముఖం చాటేశారట.. కారణం అదేనట..

త్రివిక్రమ్ అందుకే ముఖం చాటేశారట.. కారణం అదేనట..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Trivikram Was Absent For Chal Mohan Ranga Movie Promotion

నటుడిగా పవన్ కల్యాణ్, దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ వెండితెరపై రాణించిన వీరు కొత్త అవతారం ఎత్తారు. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేరుతో సినీ నిర్మాణం చేపట్టారు. తొలి చిత్రంగా నితిన్‌తో ఛల్ మోహనరంగాను రూపొందించారు. ఈ చిత్రంతో గీత రచయిత చైతన్య కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ మార్చి 25న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగింది. అయితే నిర్మాతగా వ్యవహరిస్తున్న త్రివిక్రమ్ వేడుకకు హాజరుకాకపోవడంపై మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అవేమింటంటే..

అజ్ఞాతవాసి మూవీ ఎఫెక్ట్

అజ్ఞాతవాసి మూవీ ఎఫెక్ట్

త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో వచ్చిన అజ్ఞాతవాసి అభిమానులను నిరాశపరిచింది. బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని పొందింది. అజ్ఞాతవాసి ఫ్లాప్‌ను మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ బహిరంగంగానే విమర్శలు చేశారు.

త్రివిక్రమ్ డుమ్మాతో నిరాశ

త్రివిక్రమ్ డుమ్మాతో నిరాశ

అజ్ఞాతవాసి సినిమా పరాజయంతో త్రివిక్రమ్ అవమానభారాన్ని మోయాల్సి వచ్చింది. సాధారణంగానే సినీ వేడుకలకు దూరంగా ఉంటే త్రివిక్రమ్ బయట కనిపించలేదు. అయితే నిర్మాత కాబట్టి త్రివిక్రమ్ ఈ సినిమా వేడుకకు తప్పకుండా వస్తారని ఆశించారు. కానీ ఆయన రాకపోవడం కొంత నిరాశను కలిగించింది.


త్రివిక్రమ్, పవన్ మధ్య..

త్రివిక్రమ్, పవన్ మధ్య..

అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ మధ్య కొంత దూరం పెరిగింది. అందుకే రాలేకపోవచ్చుననే మాట వెబ్‌ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నది. అయితే పవన్, త్రివిక్రమ్ మధ్య విభేదాలను సన్నిహితులు కొట్టిపడేస్తున్నారు. వారి మధ్య అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు.


త్రివిక్రమ్ రాకపోవడంపై

త్రివిక్రమ్ రాకపోవడంపై

త్రివిక్రమ్ హాజరుకాకపోవడం కారణం ఆయనకు ముందస్తు వ్యక్తిగత కార్యక్రమాలు ఉండటమే అని చెబుతున్నారు. ఎన్టీఆర్ సినిమా పనులు, ఇతర కార్యక్రమాల వల్లనే ఈ వేడుకకు దూరంగా ఉన్నారనే వాదనను వారి సన్నిహితులు వినిపిస్తున్నారు. ఏదిఏమైనా ఈ వ్యవహారానికి సంబంధించిన గాసిప్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి.


ఏప్రిల్ 5న ఛల్ మోహనరంగ

ఏప్రిల్ 5న ఛల్ మోహనరంగ

కాగా, ఛల్ మోహనరంగ చిత్రం ఏప్రిల్ 5న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో నితిన్ సరసన మేఘా ఆకాశ్ నటిస్తున్నారు. లై చిత్రం తర్వాత వరుసగా వీరిద్దరూ జతకట్టారు. ఈ చిత్రంలో హలో సినిమా హీరోయిన్‌ కల్యాణి తల్లి, అలనాటి హీరోయిన్ లిజి కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.


English summary
The Pre-Release event of 'Chal Mohana Ranga' was held on Sunday in Hyderabad. Trivikram Srinivas and Powerstar Pawan Kalyan are jointly producing Nithiin's next Chal Mohan Ranga. Besides the film's cast and crew, Power Star Pawan Kalyan graced the occasion as the chief guest.But Trivikram has skipped this event become talk of the Industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X