»   » మహేశ్‌బాబుపై దెబ్బ పడింది.. ఇక అల్లు అర్జున్ పరిస్థితేంటో.. గుండెల్లో దడ దడ

మహేశ్‌బాబుపై దెబ్బ పడింది.. ఇక అల్లు అర్జున్ పరిస్థితేంటో.. గుండెల్లో దడ దడ

Posted By:
Subscribe to Filmibeat Telugu
మహేశ్‌బాబుపై దెబ్బ పడింది.. ఇక అల్లు అర్జున్ పరిస్థితేంటో..

టాలీవుడ్‌లోనే కాదు తమిళ చిత్ర పరిశ్రమలో పట్టు సాధించడానికి తెలుగు అగ్రహీరోలు తమ ప్రయత్నాలను ముమ్మురం చేస్తున్నారు. దక్షిణాదిలో తమ మార్కెట్‌ను విస్తృతం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే తమిళంలో ఎంట్రీ ఇచ్చిన మహేశ్‌కు ప్రేక్షకులు చుక్కలు చూపించారు. ఇప్పటికే మలయాళంలో పట్టు సాధించిన అల్లు అర్జున్ కోలీవుడ్‌పై కన్నేశాడు. ఇప్పుడు అల్లు అర్జున్ ప్రయత్నం ఏ మేరకు సత్పలితాలిస్తుందో వేచి చూడాల్సి ఉంటుంది.

 మహేశ్‌బాబుపై దెబ్బ పడింది

మహేశ్‌బాబుపై దెబ్బ పడింది

తెలుగులో సూపర్ స్టార్‌గా ఎదిగినప్పటికీ, కెరీర్‌లో బ్లాక్ బస్టర్లు వచ్చినప్పటికీ తమిళంలోకి ప్రవేశించడానికి మహేశ్ చాలా ఏండ్లు సమయాన్ని తీసుకొన్నాడు. కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ మురుగదాస్‌తో జతకట్టి స్పైడర్‌తో ఎంట్రీ ఇచ్చాడు. అయితే స్పైడర్‌కు మాత్రం తమిళ ప్రేక్షకులు ముఖం చాటేశారు. దాంతో కోలీవుడ్‌పై పట్ట సాధించాలన్న మహేశ్ ప్రయత్నానికి ఆదిలోనే గండిపడింది.

మూడో స్థానంలో స్పైడర్

మూడో స్థానంలో స్పైడర్

ప్రిన్స్ మహేశ్ నటించిన స్పైడర్ చిత్రంపై టాక్ ఎలా ఉన్నా తొలివారం కలెక్షన్లు బ్రహ్మండంగా వచ్చాయి. అయితే రెండో వారం ఆ కలెక్షన్లను నిలబెట్టుకోలేకపోయింది. అయితే స్పైడర్ చిత్రం ఇటీవల తమిళనాడులో విడుదలైన టాప్ 5 చిత్రాల్లో మూడో స్థానంలో కొనసాగుతున్నది.

 కోలీవుడ్‌పై అల్లు అర్జున్ దృష్టి

కోలీవుడ్‌పై అల్లు అర్జున్ దృష్టి

మహేశ్ తర్వాత కోలీవుడ్‌లో సత్తా చాటుకునేందుకు అల్లు అర్జున్ సిద్ధమవుతున్నాడు. అల్లు అర్జున్‌కు తమిళనాడులో తప్ప కేరళ, కన్నడ రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక కోలీవుడ్‌ను దున్నేయడమే స్టైలిష్ స్టార్ ముందున్న పెద్ద టాస్క్. తన గోల్ నెరవేరుతుందా లేదా అనే లింగుస్వామి దర్శకత్వంలో రూపొందే సినిమా తేల్చుతుంది.

తమిళ దర్శకుడు లింగుస్వామితో

తమిళ దర్శకుడు లింగుస్వామితో

తమిళ దర్శకుడు లింగుస్వామితో అల్లు అర్జున్ తెలుగు, తమిళంలో ఓ సినిమా చేయనున్నాడు. చాలా రోజుల క్రితమే ఈ సినిమాను ప్రకటించినప్పటికీ ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ఆ మధ్యలో లింగుస్వామితో అల్లు అర్జున్ సినిమా ఉండందని వార్తలు వచ్చాయి. కానీ ఈ మధ్యలో లింగుస్వామి చిత్రాన్ని పట్టాలెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

 అల్లు అర్జున్ నా పేరు సూర్య

అల్లు అర్జున్ నా పేరు సూర్య

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి కథా రచయిత వక్కంతం వంశీ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. ఈ చిత్రం వేసవిలో రిలీజ్ అయ్యేందుకు శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంటున్నది.

 అల్లు అర్జున్‌తో చేసే

అల్లు అర్జున్‌తో చేసే

ఇక లింగుస్వామి పందెం కోడి చిత్రానికి సీక్వెల్ రూపకల్పనలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో మళ్లీ విశాల్ నటిస్తున్నాడు. అయితే అల్లు అర్జున్‌తో చేసే చిత్రం కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తోపాటు మంచి యాక్షన్ సినిమా అని తెలుస్తున్నది.

English summary
After Mahesh Babu, Tollywood's stylish star Allu Arjun eying on Kollywood. He is getting ready with Director N. Lingusamy movie. Allu Arjun's bilingual movie will be commercial entertainer and heavy action drama. This movie will go floors very soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu