For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిజమేనా..., లేక అభిమానుల భయమేనా..? రామ్ చరణ్ మరీ అంత అర్భకుడేం కాదేమో

  |

  కామన్ గా హీరో అంటే సినిమాకి ప్రాణం... ఇక కమర్షియల్ సినిమా అంటే ఇక చెప్పే పనే లేదు. హీరో ఎవరూ అన్న విషయం మీదే సినిమా భవిష్యత్తే ఆధార పడి ఉంటుంది. ఏ భాష అయినా కావచ్చు, ఏ హీరో అయినా కావచ్చు కథా భలం లేని సినిమాలు కూడా కొన్ని సార్లు కేవలం హీరో చరిష్మాతో గట్టెక్కిన సంధర్బాలు బోలెడు.

  ఇక మన దక్షిణాది సంగతికొస్తే టాలివుడ్ లో హీరోయిజానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఒక హీరో మరో హీరోతో కలిసి సినిమా చేస్తున్నప్పుడు తమ అభిమాన నటుడి కి ప్రాముఖ్యత కొంచం తగ్గితేనే భరించలేరు. ఇక తమ హీరో కంటే ఏకంగా విలన్ రోల్ భలంగా ఉండి... ఆ నటుడే సినిమాలో ఎక్కువ మార్కులు కొట్టేస్తే ఆ సినిమాని అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అందులోనూ అది ఒక మెగా హీరో అయితే..??? ఇప్పుడు రామ్ చరణ్ ముందు ఉన్న సమస్య అదే మరి... ఇంతకీ సంగతేమిటంటే....

   రామ్ చరణ్ న్యూ లుక్:

  రామ్ చరణ్ న్యూ లుక్:

  ధృవ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమా, 'తని ఒరువన్' అనే తమిళ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతోంది.అక్కడ భారీ విజయాన్ని అందుకోవడం వలన, ఇక్కడ కూడా ఈ సినిమా ఘనవిజయాన్ని సాధిస్తుందని భావిస్తున్నారు. రామ్ చరణ్ న్యూ లుక్ తో కనిపించనుండటం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకుంటున్నారు.

   చెర్రీ కంటే చాలా సీనియర్:

  చెర్రీ కంటే చాలా సీనియర్:

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ధ్రువ సినిమాలో ప్రముఖ నటుడు అరవింద స్వామి విలన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. అరవింద్ స్వామి మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఈ సంగతి అతను నటించిన సినిమాల్లో ప్రూవ్ అయింది కూడా. పైగా అరవిందస్వామి చెర్రీ కంటే చాలా సీనియర్ నటుడు. అంతటి సీనియర్ విలన్ గా చేస్తున్నప్పుడు రామ్ చరణ్ ఇమేజ్ దెబ్బతింటుందా అని కొందరు సందేహిస్తున్నారు.

   రీజన్ ఉంది:

  రీజన్ ఉంది:

  అరవింద స్వామి విషయంలో కొందరు ఇలా అనుకోడానికి రీజన్ ఉంది. తమిళంలో వచ్చిన తని ఒరువన్ మూవీని ధ్రువ పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తని ఒరువన్ లో విలన్ గా నటించిన అరవింద స్వామి హీరో జయం రవిని డామినేట్ చేశాడు. స్వామి కేరక్టర్ హైలైట్ అయింది. అతని ముందు జయం రవి కనబడలేదు. తెలుగులో కూడా అదే జరగవచ్చని, అందువల్ల రామ్ చరణ్ ఇంపార్టెన్స్ తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నారు అభిమానులు.

   అరవింద్ కే క్రెడిట్:

  అరవింద్ కే క్రెడిట్:

  తెలుగు వెర్షన్ కోసం స్క్రిప్ట్ మారిస్తే .... తమిళంలో మాదిరి మూవీ సక్సెస్ అవుతుందా లేదా అని ఇంకో సందేహం. సేమ్ టు సేమ్ అయితే... అరవింద్ కే క్రెడిట్ వెళ్తుంది కానీ రాం చరణ్ కి కాదు అని భావిస్తున్నారు. ఈమధ్య చెప్పుకోదగ్గ హిట్స్ లేని చెర్రీ మరి ధ్రువను ఎలా డీల్ చేస్తాడా అని చూస్తున్నారు.

  మార్పులు చేసాదట:

  మార్పులు చేసాదట:

  మార్పులు చేసాదట:

  కొత్తగా ఉంటుందట:

  అయితే ఒక ఆస ఇంకా మిగిలే ఉంది. దీన్ని బట్టి చూస్తే ధృవ కి ఏ ప్రమాదమూ లేనట్టే కానీ సురేందర్‌ రెడ్డి ఈ సినిమాలో తెలుగు నేటివిటీకి సంబంధించి చాలా మార్పులు చేశాడట. ఆ సినిమాతో పోలిస్తే ‘ధృవ' సినిమా ఇంకా కొత్తగా ఉంటుందట. అంతేకాదు స్టార్‌ డమ్‌ విషయానికొస్తే తమిళంలో హీరోగా నటించిన జయం రవికి ఉన్న స్టార్‌ డమ్‌ వేరు. ఇక్కడ చరణ్‌కున్న స్టార్‌డమ్‌ వేరు. ఆ రకంగా కూడా ఈ సినిమాపై అంచనాలుంటాయి. ఫైట్స్‌, సాంగ్స్‌, డైలాగ్‌ డెలివరీ ఇలా చాలా విషయాల్లో మార్పులు ఉన్నాయని చెబుతున్నారు సురేందర్‌ రెడ్డి.

   హీరోయిన్ కూడా కీలకమే:

  హీరోయిన్ కూడా కీలకమే:

  అయినప్పటికీ ఆ సినిమా చూసిన వాళ్లు ఇంక ఇంతకన్నా చరణ్‌ సినిమాలో ఇంకేం చేసి ఉంటారా. అని ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు.మొత్తానికి ఈ సినిమా చరణ్‌కి కత్తి మీద సామే. అయినప్పటికీ పెద్ద సాహసం చేసి ఈ సినిమాను ఎంతో ఎఫర్ట్‌ పెట్టి చేస్తున్నాడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో. తమిళంలో హీరోయిన్‌కి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కానీ తెలుగులో రకుల్‌ క్యారెక్టర్‌కి ప్రాధాన్యత ఉండబోతోందట.

   ఐపీస్ అధికారి పాత్రలో:

  ఐపీస్ అధికారి పాత్రలో:

  దసరా కానుకగా అక్టోబరు 7న సినిమాను విడుదల చేద్దామనుకున్నా అది కాస్తా వాయిదా పడింది. డిసెంబరు తొలి వారంలో విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఎప్పుడు ప్రకటిస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. అసలు విషయానికొస్తే సినిమాలో చెర్రీ ఐపీస్ అధికారి పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

   ప్రత్యేక షో:

  ప్రత్యేక షో:

  ఆ పాత్ర కోసం ఎంతో మంది ఐపీఎస్‌లను కలిసి చెర్రీ చాలా విషయాల్లో సలహాలు తీసుకున్నాడు . మొత్తంగా ధృవ బృందం చాలా మంది పోలీసులను కలిసిందట. అందుకే ఐపీఎస్‌లు, పోలీసులు, ఆ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఇతర సిబ్బందికి ప్రత్యేక షోలు వేయాలని నిర్ణయించిందట చిత్ర బృందం. ఇప్పటికే సినిమా తొలి కాపీ సిద్ధం అయిందట. కాబట్టి దసరా నుంచి సినిమా ప్రమోషన్లకు సంబంధించిన కార్యక్రమాలను చేపడతారని సమాచారం.

  English summary
  some of the fans and anti fans expressed their doubts if Arvind Swamy's character dominates Ram Charan's role in the movie
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X