»   » ‘మగధీర’కి పోటీలేదంటూనే ‘బద్రినాథ్’ సంచలనం అంటున్న బన్నీ..!

‘మగధీర’కి పోటీలేదంటూనే ‘బద్రినాథ్’ సంచలనం అంటున్న బన్నీ..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్, తమన్నా జంటగా వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అత్యంత భారీ బడ్జెట్ చిత్రం 'బద్రినాథ్" పై పలు అంచనాలు చోటు చేసుకున్నాయి. ఈ 10న విడుదలకానున్న ఈ చిత్రం విడుదలకు ముందు టాక్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. ఫస్టాఫ్ బాగా వచ్చింది. ఫస్టాఫ్ లో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయట. మూడు పాటలు చాలా బాగా వచ్చాయట. ఈ పాటలకు అర్జున్ అద్భుతంగా డ్యాన్స్ చేసాడట.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బద్రినాథ్ సినిమా ఒక సంచలనం సృష్టిస్తుందని, అయితే తెలుగు చలన చిత్ర రంగంలోని రికార్డులు బద్దలు కొట్టిన బ్లాక్‌ బస్టర్ మూవీ 'మగధీర"కు ఈ సినిమాకు ఎలాంటి పోలిక లేదని అల్లు అర్జున్ అన్నారు. మంగళవారం బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సినిమాకు పని చేసి ప్రతి టెక్నీషియన్‌ కు ఈ విజయం దక్కుతుందని అర్జున్ అన్నారు. హిమాలయాల దగ్గర వేసిన భారీ సెట్‌ లలో ఈ సినిమా దృశ్యాలు తెరకెక్కించామని చెప్పారు. బధ్రినాథ్ సినిమా కోసం ఆనందసాయి ఏకంగా 22 సెట్‌లు వేశారని, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇంత భారీ వ్యయంతో ఇంతకు ముందు ఏ సినిమా తీయలేదని అల్లు అర్జున్ చెప్పారు.

శ్రమ వృథా కాదు: బద్రినాథ్ సినిమా కోసం తాను వియత్నాంలో రెండు నెలల పాటు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నానని అన్నారు. యజ్ఞంలాగా తీశాం : రూ. కోట్ల వ్యయంతో ఒక యజ్ఞం లాగా ఈ సినిమా తీశామని, అదేవిధంగా 'హరీ ఓం... ఓం కాళీశ్వరి పాట హైలెట్‌' గా నిలుస్తుందన్నారు. మెగాస్టార్ చిరంజీవిని గుర్తు చేసుకుని, ఆయన చేసిన విధంగానే ఈ సినిమాలో డ్యాన్స్ చేశానని అన్నారు. ఈ సందర్భంగా బద్రినాథ్ సినిమా ట్రయలర్స్ ప్రదర్శించారు.

తెలుగు, మళయాళంలో ఒకేసారి ఈ సినిమా విడుదల అవుతుందని చె ప్పారు. కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలి నియమాలకు కట్టుబడి ఈ సినిమాను కర్ణాటకలో విడుదల చేస్తామని గీతా ఆర్ట్స్‌కు చెందిన కుమారస్వామి అన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 'మగధీర' లాంటి సిని మాలు ఒకటి, రెండు ఉంటాయన్నారు. రామచరణ్‌ తో కలిసి నటిస్తున్నారా అన్న ప్రశ్నకు.. అలాంటిది ఏమి లేదని స్పష్టం చేశారు. అయితే కలిసి నటించే అవకాశం ఉందని అర్జున్ అన్నారు.

English summary
Magadheera has created all time records in tollywood ,and now we have to see will Badrinath break the records created by Badrinath,this film will be striking the big screens on June 10th and till now it has created some records and talks are going on that the director has concentrated on Tamanna navel exposure and they have spent 45 crores ....
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu