»   » దిల్ రాజు లక్కీ నెంబర్ ఎన్టీఆర్‌కి కలిసొచ్చేనా?

దిల్ రాజు లక్కీ నెంబర్ ఎన్టీఆర్‌కి కలిసొచ్చేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా ఇండస్ట్రీలోని వారు కొన్ని నమ్మకాలను చాలా సీరియస్‌గా ఫాలో అవుతుంటారనే విషయం కొత్తేమీకాదు. తాజాగా దిల్ రాజు కూడా అదే ఫాలో అవుతున్నారు. ఆయన లక్కీ నెం.11 కావడంతో జూ ఎన్టీఆర్ హీరోగా ఆయన నిర్మించిన 'రామయ్యా వస్తావయ్యా' చిత్రాన్ని ముందుగా అనుకున్నట్లు 10న కాకుండా...11న విడుదల చేస్తున్నారు.

దిల్ రాజు నిర్మించిన చివరి సినిమా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కూడా జనవరి 11న విడుదల చేసారు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో అదే సెంటిమెంటును ఫాలో అవుతూ 'రామయ్యా వస్తావయ్యా' చిత్రాన్ని అక్టోబర్ 11న విడుదల చేయాలని నిర్ణయించారు.

ఆయన ఐ.ఏ.ఎన్.ఎస్‌తో మాట్లాడుతూ...'కొన్ని సెంటిమెంట్లను తప్పనిసరి పరిస్థితుల్లో ఫాలో కావాల్సి ఉంటుంది. నాకు 11 అనేది లక్కీ నెంబర్. ఈ డేట్‌పై చివరి సారిగా విడుదలైన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం మంచి విజయం సాధించింది. అందుకే 'రామయ్యా వస్తావయ్యా' చిత్రాన్ని కూడా 11వ తేదీనే విడుదల చేయాలని నిర్ణయించా' అన్నారు.

అదే విధంగా దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారీ బ్లాక్ బస్టర్ మూవీ 'గబ్బర్ సింగ్' కూడా మే 11, 2012న విడులైంది. దీనిపై దిల్ రాజు స్పందిస్తూ...ఇది అనుకోకుండా జరిగిందే. నేను మాత్రం నా సెంటిమెంటును బలంగా నమ్ముతున్నాను' అని తెలిపారు.

కాగా...గతంలో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రాన్ని అక్టోబర్ 10న నిర్ణయించారు. రాజు గతంలో నిర్మించిన కొత్తబంగారు లోకం, బృందావనం చిత్రాలు అదే తేదీన విడుదల కావడంతో సెంటిముంటుగా అప్పుడు ఆ డేట్ నిర్ణయించారు. కానీ చివరి నిమిషయంలో సెంటిమెంటు మారింది. 11వ తేదీని ఫైనల్ చేసారు. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత, శృతి హాసన్ నటిస్తున్నారు.

English summary
Producer Dil Raju , who considers number eleven lucky, says he likes to take certain sentiments seriously. Therefore, he is releasing Junior NTR -starrer Telugu action-drama Ramayya Vasthavayya October 11.
Please Wait while comments are loading...